NRI-NRT

2024 ఆటా సభలకు విస్తృత ఏర్పాట్లు

2024 ఆటా సభలకు విస్తృత ఏర్పాట్లు

1990లో ఏర్పాటు అయిన అమెరికా తెలుగు సంఘం (ఆటా- అమెరికన్ తెలుగు అసోసియేషన్) గత 34 సంవత్సరాలుగా ఇటు ఉత్తర్ అమెరికాలో అటు తెలుగు రాష్ట్రాల్లో సేవా, సాంస్కృతిక వారధిగా విలసిల్లుతోంది. ఆటా కన్వెన్షన్ 2024 ఈ సారి అట్లాంటాలో జూన్ 7 నుంచి 9 వరకు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఫండ్ రైజింగ్, కిక్ ఆఫ్ మీటింగులు నిర్వహించారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మకంటి, కన్వీనర్ కిరణ్ పాశం నాయకత్వంలో కోర్ కమిటీ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ ఆధ్వర్యంలో దాదాపు 70 కమిటీలలో 300 మందికి పైగా వాలంటీర్లు అవిశ్రాంతంగా పాటు పడుతున్నారు. కార్యక్రమాల వివరములకు www.ataconference.orgని సందర్శించండి.

* 3 రోజుల పాటు సాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ ఫిబ్రవరి 29. సంబంధిత లింక్ – www.ataconference.org/Registration/Cultural-Registration

* ఉత్సాహవంతులైన గాయనీ గాయకులకు అత్యంత ప్రోత్సాహకరంగా నువ్వా నేనా అన్నట్టు సాగే ‘ఝుమ్మంది నాదం’ పాటల పోటీలు పలు నగరాలలో నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ లింకు – www.ataconference.org/Registration/Jhummandi-Naadam

* ‘సయ్యంది పాదం’ కార్యక్రమానికి లింకు -https://ataconference.org/Registration/Sayyaandi-Paadam

* బ్యూటీ పెజంట్ కూడా చాలా చోట్ల నిర్వహిస్తున్నారు. ఈ క్రింది లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు -www.ataconference.org/Registration/Beauty-Pageant




👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z