విజయవాడ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) శుక్రవారం ఉదయం నామినేషన్ వేస్తున్నట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కలెక్టరు కార్యాలయంలో చిన్ని నామినేషన్ దాఖలు చేస్తారు. అభిమానులు, కార్యకర్తల కోలాహలం నడుమ బెజవాడ కనకదుర్గ గుడి నుండి ప్రారంభమై వినాయక గుడి, కాళేశ్వరరావు మార్కెట్ బ్రిడ్జి, కంట్రోల్ రూం మీదుగా భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి ఆయన చేరుకుంటారని తెలిపారు. కేశినేని నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z