‘అంబులి’ చిత్రం ద్వారా కోలీవుడ్లోకి నటి సనంశెట్టి అడుగుపెట్టింది. సవారి, వెల్లయా ఇరుక్కరవన్ పొయ్ సొల్లమాట్టాన్, గతం గతం వంటి పలు తమిళ చిత్రాలతో పాటు కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం రెండు తమిళ, ఓ కన్నడ సినిమాలో నటిస్తోంది. పలు వెబ్ సీరిస్‌లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం వెబ్ సీరిస్‌లలో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. సినిమాకు, వీటికి పెద్ద వ్యత్యాసం లేదు. రెండింటిలోనూ ఒకే రకమైన పారితోషకం, గౌరవం దక్కుతోంది. సినీ పరిశ్రమ రోజురోజుకూ మారుతోంది. సాంకేతికతకు తగ్గట్టుగా అందరూ మారాలి. సినిమాలకు సెన్సార్ ఉంటుంది కాబట్టి ఎక్కువ గ్లామర్‌గా నటించలేం. వెబ్ దారావాహికలకు సెన్సార్ లేనందువల్ల ఎక్కువ పాళ్లు అందాలు ఆరబోయవచ్ఛు అయినా అందాలు ఆరబోస్తే తప్పేంటి. అది కూడా నటనలో ఓ భాగమే. కథకు, సన్నివేశానికి అవసరమైతేనే కదా అలా నటిస్తాం’’ అని చెప్పింది.
అంబులి ఆరబోత
Related tags :