Movies

ఆ కమెడీయన్ అసభ్యంగా….

Telugu Actress Pragathi Speaks Of Molestation By Comedian

ఓ సినిమా సెట్‌లో హాస్య నటుడు తనతో తప్పుగా ప్రవర్తించాడని నటి ప్రగతి పేర్కొన్నారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాలతో గుర్తింపు పొందిన ఆమె తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు ఓ నటుడి వల్ల కల్గిన అసౌకర్యం గురించి చెప్పారు.‘ఓ కమెడియన్‌ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు.. నాతో మంచిగానే ఉన్నాడు. కానీ ఓ రోజు సినిమా సెట్‌లో తప్పుగా ప్రవర్తించాడు. చీప్‌గా మాట్లాడాడు. మార్నింగ్‌ షిఫ్ట్‌లో 11 గంటల ప్రాంతంలో ఇదంతా జరిగింది. ఆయన ప్రవర్తన, మాటల్ని నేను జీర్ణించుకోలేకపోయా. షూట్‌ పూర్తయిన తర్వాత సాయంత్రం ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడా. సెట్‌లో ప్రవర్తించిన తీరు సరికాదని చెప్పా. మీ అసభ్య పదజాలాన్ని, ప్రవర్తనను సహించలేకపోయానని, చాలా అసౌకర్యం అనిపించిందని తెలిపా. సెట్‌లో అందరూ ఉండగా అడిగితే.. మీ ఇమేజ్‌ దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఎవరూ లేనప్పుడు ప్రశ్నించినట్లు చెప్పా’ అని ఆమె తెలిపారు. ఆ నటుడి పేరును మాత్రం ఆమె బయటపెట్టలేదు.ఇటీవల ప్రగతి తన కుమారుడితో కలిసి మాస్‌ డ్యాన్స్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. తమిళ స్టార్‌ విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ సినిమాలోని పాటకు తల్లీకుమారుడు డ్యాన్స్‌ చేశారు. ప్రగతి చొక్కా, లుంగీలో స్టెప్పులు అదరగొట్టారు. ఆమె గత ఏడాది ‘ఎఫ్‌ 2’, ‘ఓ బేబీ’, ‘అర్జున్‌ సురవరం’, ‘90ఎమ్‌ఎల్‌’ సినిమాలలో కీలక పాత్రలో అలరించారు. అంతేకాదు పలు టెలివిజన్‌ సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు.