Business

ఏపీలో తగ్గిన మద్యం పెరిగిన కూరగాయల ధరలు-వాణిజ్యం

ఏపీలో తగ్గిన మద్యం పెరిగిన కూరగాయల ధరలు-వాణిజ్యం

* హైదరాబాద్ మెట్రో రైల్ 7వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం. ప్యాసింజర్ లను బట్టి ఫ్రీక్వెన్సీ పై నిర్ణయం.మెట్రో స్టేషన్ లతో పాటూ రైళ్లలో భౌతిక దూరం కోసం ప్రత్యేక చర్యలు.భౌతిక దూరాన్ని సిసి టీవీల ద్వారా పర్యవేక్షణ.మెట్రో ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి.మాస్క్ లేకపోతే ఫెనాల్టీ.లక్షణాలు లేని వాళ్లకు మాత్రమే మెట్రో ప్రయాణానికి అనుమతి.మెట్రో ఉద్యోగుల కు పిపిఇ కిట్లు.స్మార్ట్ కార్డు, క్యాష్ లెస్ విధానంలో టికెట్లు.

* 180 ఎంల్ బాటిల్ ధర 120 రూపాయలకు మించని బ్రాండ్లకు 30 రూపాయల నుంచి 120 రూపాయల వరకూ తగ్గించిన ప్రభుత్వం.కార్టర్ బాటిల్ ధర 120 నుంచి 150 రూపాయల వరకూ ధర ఉన్న బ్రాండ్లకు 30 నుంచి 280 వరకూ తగ్గింపు.క్వార్టర్ బాటిల్ 150 నుంచి 190 రూపాయల మధ్య ఉన్న బ్రాండ్లకు ఎలాంటి ధర మార్పులు చేయని ప్రభుత్వం.క్వార్టర్ 190 రూపాయల నుంచి 210కి మించి ధర ఉన్న బ్రాండ్లకు 40 నుంచి 300 రూపాయల వరకూ పెంపు.అన్ని బ్రాండ్ల బీర్ బాటిళ్లపై 30 రూపయాల మేర ధర తగ్గించిన ప్రభుత్వం.రెడీ టూ డ్రింక్ మద్యం పై 30 రూపాయల మేర తగ్గింపు.ఇవాల్టి నుంచే సవరించిన ధరలు వర్తిస్తాయని ప్రభుత్వ ఉత్తర్వులు.

* సింహాచలం అప్పన్న బంగారం అమ్ముతామంటూ ఓ మహిళ పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడింది.నెల్లూరుకు చెందిన శ్రావణికి హైమావతి అనే మహిళ రూ.1.40 కోట్లకు టోకరా వేసింది.కరోనా వల్ల ప్రచారం చేయలేదని నెల్లూరు మహిళను నమ్మించి మోసానికి పాల్పడింది.ఆలయ ఈవో భ్రమరాంబ వేలంకి అనుమతి ఇచ్చినట్లు ఫోర్జరీ నోటీసును చూపించి ఇంత దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.అయితే రసీదు ఇచ్చి బంగారం ఇవ్వకపోవడంతో అనుమానంతో ఆలయ అధికారులను సంప్రదించగా… అలాంటి సంప్రదాయం లేదని  అధికారులు చెప్పారు.అయితే ఈ ఘటనపై  పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు  దేవస్థానం ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

* రాష్ట్రంలో కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి.మండుతున్న కూరగాయల ధరలతో సామాన్యులు సతమతమౌతున్నారు.కరోనా వేళ లాక్‌డౌన్‌ నిబంధనలతో శుభకార్యాలు చెప్పుకోదగ్గ స్థాయిలో జరగడం లేదు.దీంతో కూరగాయలకు పెద్దగా డిమాండ్‌ లేకపోయినా, ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు.వర్షాలు ఆశాజనకంగా కురిసి కూరగాయల ఉత్పత్తి బాగున్నప్పటికీ ధరలు పెరగడంపై సామాన్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.చాలా రకాల కూరలగాయలు రిటైల్‌గా కిలో రూ.50పైనే పలుకుతున్నాయి.రైతుబజార్లలో కొన్ని రకాలు తక్కువగా ఉన్నా, మరికొన్ని రూ.50కి అటు ఇటుగానే ఉంటున్నాయి.హోల్‌సేల్‌ రేట్లకు రిటైల్‌ ధరలకు క్వింటాకు రూ.వెయ్యి వరకు వ్యత్యా సం ఉంటోంది.రాయలసీమ జిల్లాల్లో పండించే టమాటను క్వింటా రూ.3 వేలు కూడా పలకడం లేదు.కానీ, రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.50-రూ.60 వరకు అమ్ముతున్నారు.టమోట క్వింటా రూ. 4,400 హోల్‌సేల్‌ రేటు చెప్తున్నారు.వర్షా లు విస్తారంగా కురిసి, పచ్చిమిర్చి బాగా పండుతున్నా, హోల్‌సేల్‌గా క్వింటా రూ.7 వేలు అమ్ముతున్నారు. రిటైల్‌గా కిలో రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు.అయితే, ధరలు ఈ రకంగా మం డడానికి రవాణా చార్జీల భారమే కారణమని వ్యా పారులు చెబుతున్నారు.