NRI-NRT

షార్లెట్‌లో అనంతపురం ప్రవాసులతో ధర్మవరం ఎమ్మెల్యే భేటీ

Dharmavaram MLA Gonuguntla Suryanarayana Meets Ananthapur NRI Telugus in Charlotte North Carolina USA

ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రం షర్లెట్ నగర అనంతపురం ప్రవాసులతో సమావేశమయ్యారు. షార్లెట్ అనంతపూర్ ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ఐ టీడీపీ, ఏపీ ఎన్ఆర్టి సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ దంపతులను ఘనంగా సత్కరించారు. తెదేపా హయాంలో గత అయిదేళ్లల్లో చేసిన కార్యక్రమాలను వివరించిన సూర్యనారాయణ, ప్రవాసుల 2019 ఎన్నికల్లో తెదేపాకు మంచి తోడ్పాటును అందించారని, మాతృభూమి అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని అభినందించారు. అనంతపురం ప్రవాసాంధ్రులు పురుషోత్తమ చౌదరి, వెంకట్ మాలపాటి, రవినాయుడు, కృష్ణమోహన్, మహేష్ తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.
Dharmavaram MLA Gonuguntla Suryanarayana Meets Ananthapur NRI Telugus in Charlotte North Carolina USA-TNILIVE-america global news-charlotte north carolina latest nri nrt telugu news