ScienceAndTech

హైడ్రోజెన్‌తో నడిచి ఆక్సిజన్ ఇచ్చే పర్యావరణహిత ఇంజిన్ తయరీ

The sad story of tamilnadu engineer who made environment friendly engine. India kicked him out. Japan embraced him.

తమిళనాడుకు చెందిన మెకానికల్ ఇంజినీర్ ఒకరు పర్యావరణహిత ఇంజిన్‌ను తయారు చేశారు. ఈ యంత్రం బ్యాటరీ లేదా విద్యుత్‌తో నడిచే ఇంజిన్ కాదు. డిస్టిల్ వాటర్‌ను ఇంధనంగా తీసుకొని పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఆక్సీజన్ వాయువును గాల్లోకి విడుదల చేయడం దీని ప్రత్యేకత. కోయంబత్తూర్‌కు చెందిన కుమారస్వామి ఈ ఇంజిన్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ…..ఈ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడానికి 10ఏండ్లు పట్టింది. ప్రపంచంలోనే ఇలాంటి యంత్రాన్ని తయారు చేయడం ఇదే తొలిసారి. ఈ ఇంజిన్ హైడ్రోజన్‌ను ఇంధనంగా తీసుకొని ఆక్సీజన్‌ను బయటకి విడుదల చేస్తుంది. భారత్‌లో ఇంజిన్‌ను విడుదల చేయాలనేది నా కోరిక. కానీ, దీని గురించి వివరించేందుకు ఎన్నో సంస్థ‌లు, కంపెనీల చుట్టూ తిరిగాను. ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరికి జపాన్ ప్రభుత్వాన్ని సంప్రదించి నా ప్రాజెక్టు వివరాలను వారికి వివరించాను. దానికి వారు ఆమోదం తెలిపారు. మరికొన్ని రోజుల్లో నేను రూపొందించిన ఇంజిన్ జపాన్‌లో అందరికీ పరిచయం కాబోతోంది. అని కుమారస్వామి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ పర్యావరణహిత వాహనాల వినియోగానికి పెద్దపీట వేస్తున్నాయి. ఆ దిశగా భారత్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇచ్చి కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను క్రమక్రమంగా తగ్గించాలని భావిస్తోంది.