DailyDose

పుంజుకున్న మార్కెట్లు-వాణిజ్య-05/17

May 17 2019 - Daily Business News Today - Indian Stock Markets Gain-tnilive daily news - పుంజుకున్న మార్కెట్లు-వాణిజ్య-05/17

* వరుస నష్టాల నుంచి పుంజుకున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. గురువారం నాటి పాజిటివ్‌ ధోరణిని శుక్రవారం 380 పాయింట్లకు పైగా ఎగిసింది. తద్వారా 37700 స్థాయిని అధిగమించింది. ప్రస్తుతం 306 పాయింట్లు జంప్‌చేసి 37,699 వద్ద నిఫ్టీ 85 పాయింట్లు ఎగసి 11,343 వద్ద ట్రేడవుతోంది.
*గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) రూ.251.79 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో బజాజ్‌ ఫైనాన్స్‌ స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.1114 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
* ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్‌ అంచనాలు తప్పింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో స్టాండలోన్‌ ప్రాతిపదికన కంపెనీ రూ.235.82 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
*కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కాకుండా వేరే కూటమి అధికారంలోకి వస్తే స్టాక్‌ మార్కెట్‌ దిద్దుబాటుకు లోనుకావచ్చని ఓ బ్రోకరేజీ సంస్థ అంచనా వేసింది. నిఫ్టీ 10-15 శాతం (సుమారు 1100- 1600 పాయింట్లు) వరకు నష్టపోయే అవకాశం ఉందని స్విట్జర్లాండ్‌ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది.
*ఫ్రెంచి దిగ్గజం రెనో భవిష్యత్‌ రవాణా కోసం మూడు విద్యుత్‌ కాన్సెప్ట్‌ కార్లను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా స్వయంచోదిత విద్యుత్‌ కారు అయిన రెనో జడ్‌ఓఈ క్యాబ్‌తో కార్‌-ఆన్‌-డిమాండ్‌ సేవలను ఇక్కడ జరుగుతున్న వైవా టెక్నాలజీ ప్రదర్శనలో ప్రారంభించింది.
*టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) రాజేశ్‌ గోపీనాథన్‌ 2018-19కి సంబంధించి రూ.16 కోట్ల వార్షిక ప్రతిఫలం పొందారు. 2017-18లో అందుకున్న మొత్తం 12.49 కోట్ల కంటే ఇది 28 శాతం అధికం. గోపీనాథన్‌కు వేతనం రూ.1.15 కోట్లు కాగా, బత్తా కింద రూ.1.26 కోట్లు, కమీషన్‌ కింద రూ.13 కోట్లు, ఇతర భత్యాల కింద రూ.60 లక్షలు కలిపి.. మొత్తం రూ.16.02 కోట్లు చెల్లించారు.
*భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ తన ఉద్యోగులకు పనితీరు ఆధారంగా 5 కోట్ల షేర్లను ప్రోత్సాహకాల రూపంలో అందజేసింది. ఆ మేరకు ‘ఎక్స్‌పాండెడ్‌ స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2019’కి కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది.
* శ్రీశ్రీ రవిశంకర్‌కు చెందిన ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, ఎఫ్‌ఎంసీజీ విభాగమైన శ్రీశ్రీ తత్వ తమ ఉత్పత్తుల విక్రయానికి స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)తో వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది.
*జర్మనీ విలాస కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ ఎస్‌యూవీ మోడల్‌ ‘ఎక్స్‌5’లో కొత్త వెర్షన్‌ను భారత విపణిలోకి ప్రవేశపెట్టింది. డీజిల్‌ వేరియంట్ల ప్రారంభ ధర రూ.72.9 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు.
*డిజిటల్‌ చెల్లింపు సేవలు అందించే సంస్థ అయిన ‘మాస్టర్‌కార్డ్‌’ మనదేశంలో వచ్చే అయిదేళ్లలో 1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7,000 కోట్లు) పెట్టుబడిగా పెట్టనుంది.
*చమురు-సహజవాయువు అన్వేషణ క్షేత్రం కోసం తన బ్రిటిష్‌ భాగస్వామి బీపీ పీఎల్‌సీతో కలిసి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) బిడ్‌ వేసింది.