Movies

రెండు అయినా ఫర్వాలేదు

Kareena Kapoor Is So Happy Even For A Shorter Role In Irfan Khans Movie - tnilive- telugu movie news

ఇర్ఫాన్‌ఖాన్‌తో నటించే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అంటోంది బాలీవుడ్‌ నాయిక కరీనాకపూర్‌. ఇర్ఫాన్‌ఖాన్‌ ఈ మధ్యే క్యాన్సర్‌ నుంచి కోలుకొని తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘అంగ్రేజీ మీడియం’. ‘హిందీ మీడియం’ చిత్రానికి సీక్వెల్‌ ఇది. ఇందులో ఓ కీలక పాత్రలో కరీనా నటిస్తోంది. ఈ విషయమై కరీనా మాట్లాడుతూ ‘‘అంగ్రేజీ మీడియం’లో నాది చిన్న పాత్రే. అందుకని ఇర్ఫాన్‌ఖాన్‌తో పనిచేసే అవకాశాన్ని వదులుకోలేను కదా. ఆయనతో కలిసి రెండు సన్నివేశాల్లో నటించినా కెరీర్‌లో గొప్పగా చెప్పుకోవచ్చు. ఇలాంటి మంచి చిత్రాల్లో నటిస్తే ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. నాకు ఇలాంటి అవకాశం మళ్లీ వస్తుందో రాదో చెప్పలేను. నటులుగా మా ఇద్దరివీ వేర్వేరు దారులు. నటించిన చిత్రాలూ అంతే’’ అని చెప్పింది. కరీనా ఇందులో ఓ పోలీస్‌ అధికారిణిగా నటించనుంది. త్వరలోనే ఆమె చిత్రీకరణలో పాల్గొననుంది. హోమీ అద్‌జానీయా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ మధ్యే సెట్స్‌పైకి వెళ్లింది.దబాంగ్‌ పోటీ కాదు: అక్షయ్‌కుమార్‌తో కరీనా నటిస్తున్న చిత్రం ‘గుడ్‌ న్యూస్‌’. ఈ చిత్రం సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న ‘దబాంగ్‌ 3’ విడుదలైన వారం రోజులకి వస్తోంది. ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఉంటుందని చర్చ నడుస్తోంది. దీని గురించి కరీనా మాట్లాడుతూ ‘‘రెండు చిత్రాలకు మధ్య వారం రోజులు సమయం ఉంది. పైగా రెండూ పూర్తి భిన్నమైన చిత్రాలు. పోటీకి అవకాశమే లేదు. ‘గుడ్‌న్యూస్‌’…ఓ అందమైన ప్రయాణంలా ఉంటుంద’’ని చెప్పింది.