Movies

అక్షయ్ చేతిలో ₹100కోట్లు

Akshay Kumar Ranks No.1 With 100Crore Commercial Agreements

రూ.100 కోట్లతో టాప్‌లో అక్షయ్‌!
సెలబ్రిటీలకు పాపులారిటీని బట్టి పారితోషికాలు ఉంటాయి. ఒక్క సినిమా హిట్టైతే చాలు ఆ తర్వాతి సినిమాకు పారితోషికం పెంచేస్తుంటారు. ఇది సినిమాలకే పరిమితం కాలేదు. వారు టీవీ కమర్షియల్స్‌, బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించడానికి తీసుకునే పారితోషికం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అలా యాడ్‌ ఫిలింస్‌‌, కమర్షియల్స్‌కు అత్యధిక పారితోషికం తీసుకునేవారిలో బాలీవుడ్‌ ‘ఖిలాడీ’ అక్షయ్‌ కుమార్‌ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన చేతిలో రూ.100 కోట్లు విలువ చేసే కమర్షియల్స్‌ ఒప్పందాలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో రణ్‌వీర్‌ సింగ్‌ (రూ.84 కోట్లు), మూడో స్థానంలో ఆయన సతీమణి దీపిక పదుకొణె (రూ.75 కోట్లు) ఉన్నారు.
టాప్‌ 10లో మిగతా సెలబ్రిటీలు వీరే..
4. అమితాబ్ బచ్చన్‌ (రూ.72 కోట్లు)
5. ఆలియా భట్‌ (రూ.68 కోట్లు)
6. షారుఖ్‌ ఖాన్‌ (రూ.56 కోట్లు)
7. వరుణ్‌ ధావన్‌ (రూ.48 కోట్లు)
8. సల్మాన్‌ ఖాన్‌ (రూ. 40 కోట్లు)
9. కరీనా కపూర్‌ (రూ.32 కోట్లు)
10. కత్రినా కైఫ్‌ (రూ.30 కోట్లు)