Politics

సార్…నా ప్రమాణస్వీకారానికి మీరు తప్పకుండా రావాలి

Jagan invites chandrababu over the phone to attend his oath taking ceremony

కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ .. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు ఫోన్‌ చేశారు. తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఇప్పటికే పలువురు నేతలకు స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానం పలుకుతున్న జగన్‌.. ఇవాళ చంద్రబాబుకు ఫోన్‌ చేశారు. ఈనెల 30న జరిగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధికి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని జగన్‌ ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈనెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో జగన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈకార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది.