Food

కొబ్బరినీరు తేనె కలిపి వేసవిలో తీసుకోండి

Coconut water and honey in summer will be beneficial

వేసవిలో కొబ్బరి నీరును పెద్దలూ పిల్లలు అందరూ త్రాగుతారు. ఇది చలువ చేస్తుంది. శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది. ఇది సహజ సిద్ధమైన పానీయం. కూల్‌డ్రింక్స్, సోడాలు వంటి వాటి వలన కలిగే దుష్ప్రభావాలు వీటి వలన కలగవు. సహజసిద్ధమైన హైడ్రేటింగ్ ఏజెంట్లకు ప్రాధాన్యతనిచ్చే వారందరూ ఈ కొబ్బరిబోండాలను ఎక్కువగా వినియోగిస్తుంటారు.
జ్వరం, వడదెబ్బ వంటి రోగాలు వచ్చినప్పుడు దీనిని ఎలాంటి సంకోచం లేకుండా త్రాగుతారు. తలనొప్పి వంటి చిన్నచిన్న రుగ్మతల వలన కూడా రోజువారి కార్యకలాపాలు కుంటుపడే అవకాశం ఉంది. కాబట్టి వ్యాధులను నివారించేందుకు సాధ్యమైనంతవరకు కొబ్బరి నీళ్లను తీసుకుంటే మంచిది. కొబ్బరి నీళ్లల్లో తేనెను కలిపి ప్రతిరోజు తీసుకోవడం వలన వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.
తేనెలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, కొబ్బరి నీళ్లలో ఉన్న విటమిన్ సి వంటి కారకాలు ఒకటిగా కలిసి మీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడి మలబద్దకం సమస్య తగ్గుతుంది. పానీయంలో ఉన్న ఫైబర్, ప్రేగులలో గల నిక్షేపాలను బయటకు వెళ్లేలా చేస్తుంది. ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ కొబ్బరి నీళ్లు చాలా ఉపయోగపడుతాయి.
గ్యాస్ సమస్యలు, కడుపులో మంట, అల్సర్‌‌ వంటి వ్యాధులను తగ్గిస్తుంది. కిడ్నీలలో రాళ్ళను కరిగిస్తుంది. కొలెస్ట్రా‌‌ల్‌, బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ బాక్టీరియా, యాంటి షూగర్ లక్షణాలు ఉంటాయి. చర్మానికి నిగారింపునిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. నీరసం, దప్పిక వంటి వాటిని తగ్గిస్తుంది.