Fashion

రాత్రివేళల్లో ఆ దుస్తులు వద్దు

Avoid wearing such material during night times-Womens evening fashion

క్యాజువల్‌ వేర్‌, పార్టీవేర్‌… అంటూ సందర్భానికి తగినట్లుగా ట్రెండీ దుస్తుల్ని ఎంచుకోవడం మనం చేసేదే. అయితే రాత్రిపూట వేసుకునే దుస్తుల విషయంలో మాత్రం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. కానీ అలా చేయొద్దు. అవి మన ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలిగిస్తాయి. పడుకునేటప్పుడు వీలైనంతవరకూ బ్రా వేసుకోకపోవడమే మంచిది. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే… అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన నూలు రకాల్ని ఎంచుకోండి. మెత్తగా ఉండే టీషర్ట్‌లు బాగుంటాయి. ఏవి ఎంచుకున్నా మరీ వదులుగా, బిగుతుగా ఉండకూడదు. షర్ట్‌లు, ప్యాంట్లు, నైటీలు, గౌన్‌లు, త్రీఫోర్త్‌ స్కర్టులు ప్రయత్నించొచ్చు. మెరుపులు, కుందన్లు, రాళ్లు వంటి హంగులున్న డిజైన్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ ఇవి మరీ సాదాగా వద్దు అనుకుంటే ప్రింటెడ్‌ రకాల్ని, జేబులు, ఫ్రిల్స్‌, లేయర్లు వంటివాటితో డిజైన్‌ చేసినవి వాడొచ్చు. కాలర్‌నెక్‌లు, డీప్‌నెక్‌లు పనికిరావు. చెమట పట్టకుండా, సౌకర్యంగా ఉండాలంటే మామూలు రౌండ్‌నెక్‌ తరహా ఎంచుకుంటేనే మేలు. ఎండాకాలంలో అయితే పొట్టి చేతులు బాగుంటాయి. ఇబ్బందేం లేకపోతే స్లీవ్‌లెస్‌ వేసుకోండి. ఇక, రాత్రిపూట ఆహ్లాదకరమైన రంగులు నప్పుతాయి కాబట్టి మరీ కొట్టొచ్చినట్లు ఉండే వర్ణాల జోలికి పోవద్దు.