Editorials

వేమూరి రవికుమార్ తదితరుల భూదందాలపై జగన్ దృష్టి-TNI ప్రత్యేకం

Every single TDP minister knew of Amaravathi as capital. Here is a list of land scams they committed into thousands of crores of rupees. #APLandScams #AmaravathiScams #AndhraMinisterScams #TDPScams #telugudesamlandscams

*** తెదేపా మంత్రులందరికీ అమరావతి రాజధాని అని ముందుగానే తెలుసు.
*** నారాయణ, ప్రత్తిపాటి, రావెల, లోకేష్, వేమూరు రవికుమార్, లింగమనేని, మురళీమోహన్, ధూళిపాళ్ల, సుజనా, పయ్యావుల, కోడెల, నందమూరి బాలకృష్ణల చౌకైన భూదందా.
*** ల్యాండ్ పూలింగ్ చట్టం నుండి మినహాయింపు. ఔటర్ రింగును కూడా సరిచేయించుకున్నారు.

అమెరికాకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు వేమూరి రవికుమార్ ఏపీఎన్నార్టీ అధ్యక్షుడిగా నడిపిన వ్యవహారాలపై, లోకేష్‌కు బీనామిగా ఆయన రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములపై నూతన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ప్రత్యేకమైన దృష్టిపెట్టారు. ఈ వ్యవహారాలపై 6వ తేదీన ప్రత్యేక సమీక్షకు జగన్ సిద్ధమయ్యారు. దీనితో పాటు రాజధానిలో జరిగిన భూదందాలపైన కూడా విచారణకు పావులు కదుపుతున్నారు. వీటిపై సమగ్ర నివేదికలు సిద్ధమవుతున్నాయి.

అమరావతి రాజధానిగా వస్తుందనే విషయం తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది ముఖ్యులకు ముందుగానే లీకులు అందాయి. లోకేష్ కూడా వేమూరి రవికుమార్ ఆయన కుటుంబసభ్యుల పేరుమీదుగా బీనామిగా వందల ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం తెదేపాలోని కొందరు ముఖ్యులు కొనుగోలు చేసిన భూములపై విచారణ చేపట్టింది. వారు వీరే.

1.పీ నారాయణ (తెదేపా) – మంత్రి. ఈయన 432 కోట్లు పెట్టి అసైన్డు భూములతో కలిపి కొన్న భూములు 3129 ఎకరాలు. భూములు కొన్న గ్రామాలూ తాళ్లూరు మండలం మందాడం, లింగాయపాలెం, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, బోరుపాలెం, బీనామీలు పేర్లు: ఆకుల మునిశంకర్, నారాయణ బావమరిది, రావూరి సాంబశివరావు, నారాయణ బావమరిది పొత్తూరి ప్రమీల, కర్ణాటక, తమిళనాడు నారాయణ విద్యా సంస్థల బాద్యతలు చూసుకునే వ్యక్తి.

2.సుజనా చౌదరి – ఈయన 35కోట్లతో 700ఎకరాలు కొనగా ప్రస్తుతం వీటి విలువ 700 కోట్లు, భూములు కొన్న గ్రామాలూ.. గుడిమెట్ల, కీసర, వేరులపాడు. బీనామీల పేర్లు..యలమంచిలి జతిన్ కుమార్ సుజన చౌదరి సోదరుడు కాలింగ గ్రీన్ టెక్ కెమికల్స్ సుజనా సోదరుడు జతిన్ కుమార్ పరస్పాల్ అసిస్టెంట్ హర్షానంద కంపెనీ యలమంచిలి జనార్ధనరావు, సుజనా చౌదరి తండ్రి గారు. వై.శివరామకృష్ణ సుజనా చౌదరి సోదరుడు.

3.నారా లోకేష్ (తెదేపా మంత్రి) – లోకేష్, వేమూరి రవికుమార్ యాభై కోట్లు పెట్టి 500 ఎకరాలు కొనుగోలు చేయగా ప్రస్తుతం దీని విలువ 650కోట్లకు పెరిగింది. భూములు కొన్న గ్రామాలు..అమరావతి మండలంలోని ధరణి కోట, వైకుంటపురం బీనామీల పేర్లు: వేమూరి ఇండియా ప్రేవేట్ లిమిటెడ్ గొప్పది గ్రీన్ ఫీల్డ్స్ ప్రేవేట్ రవికుమార్ ప్రసాద్- నారా లోకేష్ స్నేహితుడు వేమూరి అనురాధ-వేమూరి రవి కుమార్ ప్రసాద్ భార్య, భూములు కొన్న కంపెనీ పేర్లు . నెట్ లిమిటెడ్ ప్యుచార్ స్పేస్ ఇండియా ప్రేవేట్ లిమిటెడ్.

4.ప్రత్తిపాటి పుల్లారావు (తెదేపా మంత్రి) – ఈయన 39 కోట్లు పెట్టి 196 ఎకరాలు కొనుగోలు చేయగా ప్రస్తుతం 784 కోట్లకు పెరిగింది. భూములు కొన్న గ్రామాలు: తుళ్ళూరు మండలంలోని మందాడం, వెంకటపాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి. బీనామి పేర్లు: గుమ్మడి సురేష్, ప్రత్తిపాటి పుల్లర్వు, అనుకాహృడు వెనిగళ్ళ రాజారెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడు వెంకాయమ్మ, వెనిగళ్ళ రాజారెడ్డి భార్య.

5. రావెల కిషోర్ బాబు- రావెల 5.5 కోట్లు పెట్టి అసైన్డు భూములతో కలిపి 55 ఎకరాలు కొనుగోలు చేయగా ప్రస్తుత విలువ 82.5 కోట్లకు పెరిగింది. భూములు కొన్న గ్రామాలూ: మంగళగిరి మండలం కూరగల్లు, నవలూరు. బీనామీల పేర్లు: రావేలా శాంతి, కిషోర్ బాబు అనుచరుడు తెల్లా శ్రీనివాసరావు కంపెనీ.

6.మురళి మోహన్ (తెదేపా ఎంపీ) – మురళీమోహన్ 16కోట్లు పెట్టి 53 ఎకరాలు కొనుగోలు చేయగా.. ప్రస్తుత విలువ 212 కోట్లు. భూములు కొన్న గ్రామాలు: తాడేపల్లి మండలం కుంచేనపల్లి, బీనామీల పేర్లు. సొంతపేరు మీద కొనుగోలు.

7.కొమ్మలపాటి శ్రీధర్ (తెదేపా శాసన సభ్యుడు)..1.26 కోట్లు పెట్టి 42 ఎకరాలు కొనుగోలు చేయగా ప్రస్తుత విలువ 210కోట్లు భూములు కొన్నగ్ గ్రామాలూ ..అమరావతి టౌన్ షిప్ దగ్గర ఎర్రబాలెం గ్రామం. ఈ భూములకి ల్యాండ్ పూలింగ్ నుండి మినహాయింపు వచ్చింది. దానికి కాను నారా లోకేష్ కి వాటా (క్విడ్ ప్రోకో) బీనామీలు పేర్లు: సొంత పేరు మీద కొనుగోలు.

8.కోడెల శివరామకృష్ణ (కోడెల శివప్రసాద్ తనయుడు) 93 లక్షలు పెట్టి 17.3 ఎకరాలు కొనగా ప్రస్తుత విలువ 18.4 కోట్లు. భూములు కొన్న గ్రామాలూ.. సత్తెనపల్లి మండలంలోని ధూళిపాళ్ళ గ్రామం. బీనామీల పేర్లు: శశి ఇంప్రా కోడెల శివరామకృష్ణ పర్సనల్ అసిస్టెంట్ గుట్ట నాగప్రసాద్ కంపెనీ.

9. ధూళిపాళ్ళ నరేంద్ర చౌదరి (తెదేపా శాసన సభ్యుడు) – అనధికారికంగా 50 ఎకరాలు పోరంబోకు కాగా కాగా ప్రస్తుత విలువ ఐదు కోట్లు భూములు కొన్న గ్రామాలూ: నంబూరు. బీనామీల పేర్లు దేవర పుల్లయ్య, ధూళిపాళ్ళ నరేంద్ర చౌదరి దగ్గర బంధువు.

10. పయ్యావుల కేశవ్ 12.27 లక్షలు పెట్టి 4.09 ఎకరాలు కొనగా ప్రస్తుత విలువ 8కోట్లు, భూములు కొన్న గ్రామాలూ.. ఐనవోలు, బీనామీలు పేర్లు: పయ్యావుల విక్రమసింహ, పయ్యావుల కేశవ్ తనయుడు. రాజధాని ప్రకటించక ముందు జీపీఏ చేసుకుని ప్రకటించిన తరువాత రిజిస్త్రేషన్ చేసుకునారు.

11.లింగమనేని రమేష్ (చంద్రబాబు దగ్గరి వ్యక్తీ) కొన్న భూములు 804 ఎకరాలు. వచ్చిన లాభం 4వేల కోట్లు, 10లక్షల నుంచి 40 లక్షల లోపు పెట్టి 168 ఎకరాలు కొని సింగిల్ ఎస్టేట్ గా మార్చారు, ఆ మొత్తం ఎస్టేట్ ని ల్యాండ్ పూల్దింగ్ నుండి మినహాయించారు. రాజధాని సరిహదు ఖాజా గ్రామం దగ్గర ఆగిపోతుంది. అక్కడ నుండి ఎస్టేట్ కి మధ్య దూరం పది కిలోమీటర్లు (కిలోమీటర్ కాదు పది మీటర్లు మాత్రమే) దానికి గాను అక్రమ కట్టడం అయిన లింగమనేని గెస్ట్ హౌజ్ చంద్రబాబుకు ఇచ్చారు. లోకేష్ కి ఎస్టేట్ లో షేర్ ఇచ్చారు.

12. ఎం. ఎస్.పీ.రామరావు (బాలకృష్ణ బంధువు) – కేటాయించిన భూమి 498.83 ఎకరాలు డబ్బు కట్టింది 4.98 కోట్లు అయితే దీని ప్రస్తుత విలువ 300 కోట్లు. ఈ భూములు జగ్గయ్యపేట మండలంలోని జయంతిపురంలోని ఉన్నవి. విశాఖ బాటిలింగ్ కంపెనీ ఫెర్టిలైజెర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనే కంపెనీ కి ఇచ్చారు. తరువాత వీటి విలువ పెంచటానికి వాటిని సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చారు.
Every single TDP minister knew of Amaravathi as capital. Here is a list of land scams they committed into thousands of crores of rupees. #APLandScams #AmaravathiScams #AndhraMinisterScams #TDPScams #telugudesamlandscams