Devotional

ర్యాలి జగన్మోహినీ ఆలయం విశిష్టత

Ryali jaganmohini temple in godavari district is a must to be visited

ర్యాలి జగన్మోహినీ ఆలయం విశిష్టత విన్నారా..- తదితర ఆద్యాత్మిక వార్తలు
శ్రీ మహాభాగవత ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మధన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పోరాడుకొనుచుండగా శ్రీమహావిష్ణువు లోకకళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తాడు. జగన్మోహిని అవతార సమయం లోమహేశ్వరుడు జగన్మోహిని ని చూసి మోహితుడై ఆమె వెంట పడగా వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. మోహినీ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పం క్రింద పడుతుంది. ఈ పుష్పం క్రిందపడిన ప్రదేశమే ఇప్పటి ర్యాలి (ర్యాలి అంటే పడడం అని అర్థం) అని చెబుతారు.తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపు రం మండలంలో ఉంది ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం. ఈ ప్రాంతాన్ని కోనసీమ అంటారు. నిండైన కొబ్బరి చెట్లకు కోనసీమ ప్రసిద్ధి. ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. గోదావరి ఉపనదులు ఇక్కడ ప్రవహించ డంవల్ల ఈ ప్రాంతం సాక్షాత్తూ ‘అన్న పూర్ణ’. ర్యాలిలో జగన్మోహిని రూపంలో విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు. ఇది ఏక శిలా విగ్రహం. ఇటువంటి శిలను సాల గ్రామ శిల అంటారు. ఈ విగ్రహం పొడ వు ఐదు అడుగులు. వెడల్పు మూడు అడుగులు. విగ్రహానికి ముందువైపు విష్ణుమూర్తి, వెనుకవైపు జగన్మోహిని. ఇటువంటి విచిత్ర మైన దేవాలయం మరెక్కడా లేదేమో? నల్లరాతి శిల్పం కావడం వల్ల ఈ విగ్రహం కంటికింపుగా ఉంటుంది. ఇం దులోని శిల్ప సౌందర్యం వర్ణనాతీతం. నఖశిఖ పర్యంతం అందంగా ఉంది అని చెప్పడానికి ఇది అచ్చమైన నిదర్శనం.కాలి గోళ్ళు, చేతి గోళ్ళు నిజంగా ఉన్నాయా? అనిపించేలా అద్భుతంగా మలిచాడు శిల్పి. అదేవిధంగా ‘శిఖ’ జుట్టు వెం ట్రుకలు చెక్కిన తీరు చూస్తే ఇది శిల్ప మా, నిజంగా జుట్టు ఉందా? అనిపించే లా, చెక్కిన శిల్పి నిజంగా ధన్యుడే. ఈ వి గ్రహం పాదాల దగ్గర నుంచి, నీరు నిరం తరాయంగా ప్రవ హిస్తూ ఉంటుంది. ‘వి ష్ణు పాదోధ్బవి గంగ’ అనే ఆధ్యాత్మిక న మ్మకం మాట పక్కన పెడితే శిలల్లో ‘జల శిల’ అనే దా న్నుంచి నీరు నిరంతరం విష్ణుమూర్తి పాదాలను కడుగుతూ ఉం టుందని భక్తుల విశ్వాసం. గుడిప్రాం గణమంతా దశావతారాలకి సంబంధించి న శిల్పాలు కొలువై ఉన్నాయి.
**ఆలయ నిర్మాణం…
ర్యాలి ప్రాంతం 11వ శతాబ్దంలో పూర్తిగా అరణ్యం. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చోళ చక్రవర్తి రాజా విక్రమ దేవుడు, ఈ ఆలయాన్ని నిర్మించా డు. తరువాతి రోజులలో దీనిని పునరుద్ధరించారు.ర్యాలిని దర్శించడానికి ఉత్తర భారతంనుంచి వచ్చే యాత్రికులు విశాఖపట్నం మీదుగా (ఐదవ నెంబర్‌ జాతీయ రహదారి) తుని, అన్నవరం, రాజమండ్రి చేరు కోవాలి. రాజమండ్రి నుంచి ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా వెళ్ళి, బొబ్బర్లంక దగ్గర ఎడమవైపు తిరగాలి. బొబ్బర్లంక మీదనుంచి లొల్లమీదుగా మెర్లపాలెం దగ్గర కుడివైపుకి తిరిగితే ర్యాలి చేరుకుంటాం.విజయవాడ వైపు నుంచి వచ్చేవారు రావులపాలెం (ఐదవ నెంబర్‌ జాతీయ రహదారి), దగ్గర కుడివైపుగా తిరిగి మెట్లపాలెం దగ్గర ఎడమవైపు తిరిగితే ర్యాలి చేరుకోవచ్చు.
**‘ర్యాలి’ విశిష్టత…
గోదావరి జిల్లా ప్రాంతంలో ‘ర్యాలి’ అంటే ‘పడిపోవడం’ అని అర్ధం. ఈ ప్రాంతాన్ని పూ ర్వం ‘రత్నపురి’ అని పిలిచేవారు. భాగవత కధ ప్రకారం… దేవతలు, దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభిం చారు. వాసుకి అనే పాముని తాడుగా, మంధ ర గిరిని కవ్వంగా చేసుకుని, తలవైపు రాక్షసు లు, తోకవైపు దేవతలు నిలబడి సముద్రాన్ని చిలికారు. అందులోంచి చంద్రుడు, కామధే నువు, కల్పవృక్షం, లక్ష్మీదేవి, విషం… ఇలా వరుసగా వచ్చిన తరువాత చిట్టచివరకు ధన్వంతరి అమృతకలశంతో ప్రత్యక్షమయ్యా డు. దేవదానవులిరువురూ దాని కోసం పోటీ పడుతుండగా, విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో వచ్చి, అమృతం దానవులకి అందకుండా దేవతలకు మాత్రమే అందజేసి ముందుకు నడుస్తుండగా, వెనుకనుంచి విష్ణువుని చూసి జగన్మోహినిగా భ్రమచెందిన శివుడు విష్ణుమూర్తి చెయ్యిప ట్టుకోగానే ఉలికిపాటుతో విష్ణువు వెనుకకు తిరిగాడు. ఆ సమయంలో సిగలోంచి ఒక పువ్వు రాలిపడింది.ఆ కార ణంగా ఆప్రాంతానికి ‘ర్యాలి’ అని పేరు వచ్చిందని స్థలపు రాణం. విష్ణువుని చూసిన శివుడు స్థాణువులా నిలబడిపో యాడని అందుకే శివాలయం, వైష్ణవాలయం ఎదురెదు రుగా ఉంటాయని స్థానికులు చెప్తారు. అలా వెనుకకు తిరిగిన విష్ణుమూర్తి ముందువైపు పురుషుడిగానూ, వెనుక జగన్మోహిని రూపంలోనూ ఉంటాడు.తిక్కన చెప్పినట్లు ఇక్కడ హరిహరనాధ తత్వం కనిపిస్తుం ది. విష్ణుమూర్తి జగన్మోహినీకేశవస్వామిగాను, శివుడు ఉమాకమండలేశ్వరుడుగాను భక్తుల నీరాజనాలు అందు కుంటున్నాడు. ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ట చేసేటపుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలంతో మంత్ర పూతం కావించాడని స్థలపురాణం. అదే విధంగా జగన్మో హినీకేశవస్వామి విగ్రహాన్ని కూడా మంత్రపూర్వకంగా ప్రతిష్టించారని చెబుతారు. గుడిలోని పూజారులు నూనె దీపం సహాయంతో విగ్రహం గురించి వివరిస్తూ అణువణువూ చూపిస్తారు. నల్లరాతి విగ్రహాన్ని దీపం సహాయంతో చూస్తే విగ్రహం అందం రెట్టింపవుతుంది.
2. శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ ఇందిరా బెనర్జీ
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
3. 9 నుంచి టీటీడీలో బ్రహ్మోత్సవాలు ..
హైదరాబాద్ హిమాయత్‌నగర్ లిబర్టీ వద్ద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 9 తేదీ నుంచి13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రత్యేక అధికారి రమేశ్‌బాబు, టీటీడీ ప్రాంతీయ సలహాదారుల కమిటీ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి తెలిపారు. హిమాయత్‌నగర్‌లోని శ్రీ వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు ఎ.నర్సింహ్మామూర్తి, మహేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
4. తిరుమల భక్తుల కోసం కొత్త మొబైల్ యాప్
శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్తున్నారా? తిరుమలలో గది దొరుకుతుందో లేదో.. దర్శనం జరుగుతుందో లేదో.. అని టెన్షన్ పడుతున్నారా? భక్తులు ఇలాంటి ఇబ్బందులు పడకూడదనే టీటీడీ ఆధునిక సాంకేతికను వినియోగించుకుంటున్నది. తిరుమల భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేకంగా గోవింద యాప్ (Govinda App)ను రూపొందించింది. రెండేండ్ల క్రితమే అందుబాటులోకి వచ్చిన ఈ యాప్.. గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్నది. ఇటీవలే ఐఫోన్ యూజర్లకు చెంతకు వచ్చింది. ఇప్పటికే ఐదు లక్షల మందికిపైగా ఈ యాప్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. తిరుమల వెళ్లాలనుకొనే భక్తులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గదుల దగ్గర నుంచి దర్శనం, ఆర్జిత సేవాటికెట్లు ఈ యాప్‌లో పొందవచ్చు. గోవింద యాప్‌లో మీరు ఏ సేవలు పొందాలనుకున్నా ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
5. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని 29 కంపార్ట్‌మెంట్‌లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 18 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 86,721 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 34,926 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.75 కోట్లు.
6. శుభమస్తు – నేటి పంచాంగం
తేది : 4, జూన్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పాడ్యమి
(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 29 ని॥ వరకు)
నక్షత్రం : మృగశిర
(ఈరోజు రాత్రి 12గం॥ 16 ని॥ వరకు)
యోగము : ధృతి
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 6 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 45 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 39 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 11 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 12 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 13 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 51 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 8 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 40 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 47 ని॥ లకు
7. శుభమస్తు చరిత్రలో ఈ రోజ *జూన్, 04*
* సంఘటనలు*
1938: మూడవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సు లో ప్రారంభమయ్యాయి.
2004: భారత లోక్‌సభ స్పీకర్‌గా సోమనాధ్ చటర్జీపదవిని స్వీకరించాడు.
2010: జపాన్ ప్రధానమంత్రిగా నవోతో కాన్ ఎంపికయ్యాడు.
* జననాలు
1694: ఫ్రాంకోయిస్ కేనే ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. (మ.1774)
1897: వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (మ.1981)
1944: కిడాంబి రఘునాథ్, సుప్రసిద్ధ శాస్త్రవేత్త మరియు పత్రికా సంపాదకులు. (మ.2003)
1946: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు.
1950: ఎస్. పి. వై. రెడ్డి, నంది గ్రూప్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు మరియు అధినేత.
1961: ఎం. ఎం. కీరవాణి, ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు గాయకుడు.
1984: ప్రియమణి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ నటి.
* మరణాలు
1998: ఆరుద్ర, కవి, గేయ రచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు ( జ.1925).
2001: దీపేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశారు (జ.1971).
2006: బూదరాజు రాధాకృష్ణ, ప్రసిద్ధ భాషావేత్త (జ.1932).
8. తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!
ఈ రోజు మంగళవారం. – 04.06.2019
ఉదయం 5 గంటల
సమయానికి,
_తిరుమల: *24C° – 33℃°
నిన్న *86,721* మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో *18*
గదుల్లో భక్తులు వేచి
ఉన్నారు,
ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*18* గంటలు పట్టవచ్చును,
నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 3.75* కోట్లు,
శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
నాలుగు గంటల సమయం
పట్టవచ్చును,
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతంకౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_
9. శుభోదయం
*మహానీయుని మాట*
” మన మీద మనకున్న నమ్మకం శత్రువుని భయపెడుతుంది, మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది ”
*నేటీ మంచి మాట*
” రహస్యం.. నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని.”
10. నేటి సుభాషితం*
*కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి..అంతమాత్రాన జ్ఞానం వచ్చేసినట్టా.*
* నేటి సామెతలు
*చెట్టు ముందా విత్తు ముందా*
అసంబద్దమైన ప్రశ్నలు వేసె వారిని గురించి ఈ సామెత పుట్టింది
*చెడపకురా చెడేవు*
ఇతరులకు చెడు తలపెడితె తానె చెడి పోతాడనె అంతరార్థం ఈ సామెత భోదిస్తున్నది.
11. నేటి జాతీయం*
*కరణం దస్త్రం*
కనీసం భార్యతో మాట్లాడే తీరిక కూడా లేకుండా పోయేంత పని,
*కర్త కర్మ క్రియ
సర్వస్వం, అంతా తానే . చేసేవాడు, చేయించేవాడు, చేసేది అంతా ఒకడే అ
12. నేటి ఆణిము
మానవనాథుఁ డాత్మరిపుమర్మ మెఱింగినవాని నేలినం
గాని జయింపలేఁ డరులఁ గార్ముకదక్షుఁడు రామభద్రుఁ డా
దానవనాయకున్ గెలువఁ దా నెటులోపుఁ దదీయనాభికా
స్థానసుధన్ విభీషణుఁడు తార్కొని చెప్పకయున్న భాస్కరా!
*భావం:
రాజైనవాడు తన శత్రువు గురించిన రహస్యము తెలిసినవానిని ఒక్కడినైనా తన వద్ద చేర్చుకోకపోతే విజయం పొందలేడు. రావణుని రహస్యమంతా తెలిసిన అతని తమ్ముడగు విభీషణుడు చెంత ఉండి, బొడ్డున ఉన్న అమృతకలశం గురించి చెప్పనిదే రాముడు వానిని జయింపగలిగెనా?
13. శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్తున్నారా? తిరుమలలో గది దొరుకుతుందో లేదో.. దర్శనం జరుగుతుందో లేదో.. అని టెన్షన్ పడుతున్నారా? భక్తులు ఇలాంటి ఇబ్బందులు పడకూడదనే టీటీడీ ఆధునిక సాంకేతికను వినియోగించుకుంటున్నది. తిరుమల భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేకంగా గోవింద యాప్ (Govinda App)ను రూపొందించింది. రెండేండ్ల క్రితమే అందుబాటులోకి వచ్చిన ఈ యాప్.. గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్నది. ఇటీవలే ఐఫోన్ యూజర్లకు చెంతకు వచ్చింది. ఇప్పటికే ఐదు లక్షల మందికిపైగా ఈ యాప్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. తిరుమల వెళ్లాలనుకొనే భక్తులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గదుల దగ్గర నుంచి దర్శనం, ఆర్జిత సేవాటికెట్లు ఈ యాప్‌లో పొందవచ్చు. గోవింద యాప్‌లో మీరు ఏ సేవలు పొందాలనుకున్నా ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
14. రాశిఫలం – 04/06/2019
తిథి:
శుద్ధ పాడ్యమి మ.2.34, కలియుగం – 5121 శాలివాహన శకం – 1941
నక్షత్రం:
మృగశిర రా.12.23
వర్జ్యం:
మ.3.29 నుండి 4.15 వరకు
దుర్ముహూర్తం:
ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి రా.10.48 నుండి 11.36 వరకు
రాహు కాలం:
మ.3.00 నుండి 4.30 వరకు విశేషాలు: కరవీరవ్రతం, బౌద్ధ, కల్కి జయంతులు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లరాదు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) వ్యవసాయ రంగంలోనివారికి లాభదాయకంగా వుంటుంది. తొందరపాటువల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక భయము, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనమేర్పడుతుంది.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించుట మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోనివారికి మానసికాందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్ర్తిలు, బంధు, మిత్రులను కలుస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. అనారోగ్య బాధవలన బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) మిక్కిలి ధైర్యసాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) అకాల భోజనాదులవల్ల అనారోగ్యమేర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో నుండుట అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా నుండుట మంచిది. మనోద్వేగానికి గురి అవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించరాదు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు.
15. ఆకలి, అవినీతి లేని సమాజం కావాలి: వెంకయ్య
తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా ఆలయానికి వచ్చిన ఆయనకు మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉపరాష్ట్రపతి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఆకలి, అవినీతి లేని సమాజం నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందన్న ఆయన.. వర్షాలు బాగా కురవాలి, ప్రకృతి వైప రీత్యాలు లేకుండా చూడాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రముఖులు దర్శనానికి రావాలని, తద్వారా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. తాను రాజకీయాల్లో లేనని, భవిష్యత్తులోనూ ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు. అసమానతలు. .ఘర్షణలు లేని సమాజం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. దేశానికి సేవ చేసుకునే శక్తి ఇవ్వాలని, దైవ దర్శనం, సాహిత్యం, సత్సంగంతో ఆ శక్తి వస్తుందని విశ్వసిస్తున్నట్టు వెంకయ్యనాయుడు చెప్పారు.
16. దుర్గ గుడిలో బంగారం చోరీకి యత్నం
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కాసున్నర బంగారం చోరీకి యత్నించిన దంపతులు ఆలయ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. అమ్మ వారి హుండీల లెక్కింపులో సింహాచలం అనే వ్యక్తి పాల్గొన్నాడు. అమ్మవారికి కానుకగా వచ్చిన వాటిలో కాసున్నర బంగారాన్ని పక్కకు తీసిన సింహాచలం తన లుంగీలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆలయంలోనే స్వీపర్‌గా పని చేస్తున్న తన భార్యకు ఆ బంగారాన్ని ఇస్తుండగా ఆలయ అధికారులు గుర్తించారు. దీంతో ఆలయ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సింహాచలంతో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.