Movies

థ్రిల్లర్ కావాలి

Katrina Kaif Wants To Perform In A Psychological Thriller

బాలీవుడ్‌ నాయికలు నిర్మాతల నుంచి భారీ పారితోషికాలు అందుకోవడమే కాదు.. నిర్మాతలుగా మారి పారితోషికాలూ ఇస్తున్నారు. అనుష్క శర్మ, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా….ఈ అగ్ర నాయికలందరూ నిర్మాతలుగానూ మారారు. వీళ్ల బాటలోనే మరో అందాల తార కత్రినాకైఫ్‌ నడుస్తానంటోంది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్రినా తను నిర్మాతగా ఎలాంటి చిత్రాలు తెరకెక్కించాలనుకుంటోందో చెప్పింది. ‘‘చిన్న బడ్జెట్‌ చిత్రాలు… వైవిధ్యమైన కథలతో చిత్రాలు నిర్మించాలనుకుంటున్నాను’’ అంటోంది. మరి మీరు నిర్మించే చిత్రాల్లో నటిస్తారా? అంటే ‘‘అదీ జరగొచ్చు..’ అని చెప్పింది కత్రినా. ఆమె సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించిన ‘భారత్‌’ మంచి వసూళ్లు రాబడుతోంది. యాక్షన్‌ చిత్రాల్లో కత్రినాకు మంచి పేరుంది. మరి మీకు ఎలాంటి చిత్రాల్లో నటించాలని ఉంది? అంటే..‘‘నాకు యాక్షన్‌ చిత్రాలంటే ఇష్టం. నా దగ్గరకు అలాంటి కథలు చాలానే వస్తుంటాయి. కానీ వాటితో పాటు కామెడీ, సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కథల్లో నటించాలని ఉంది. నేను ఏది చేసినా నా దగ్గరకొచ్చిన కథల్లోంచే ఎంచుకోవాలి. అన్నీ మన చేతుల్లో ఉండవు కదా’’ అంటోంది కత్రినా.