DailyDose

ఏపీ హైకోర్టులో చంద్రబాబుపై పిటిషన్‌-తాజావార్తలు– 06/14

Republican Party Candidate Files Against Chandrababu - June 14 2019 - Daily Breaking News

* టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై శుక్రవారం ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆయనపై రిపబ్లిక్‌ పార్టీ అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్‌కుమార్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ పథకాల పేరుతో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు డబ్బు వాడుకున్నారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ పథకాల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు సొంత ఖర్చు కింద ఆ నిధులను జమ చేయాలంటూ అనిల్‌ కుమార్‌ కోరారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిల్లి చేరుకున్నారు. మరికాసేపట్లో కేంద్ర హోంశాఖ అమిత్ షాతో ఆయన భేటి కానున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాల పై అమిత్ శాతో ఆయన చర్చించనున్నారు.
*కళాశాల విద్య ప్రత్యేక గా సుజాత శర్మను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వ్యులు జారీ చేశారు. ఇప్పటిదాకా ఆమె రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా పని చేశారు.
*రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లను ప్రారంభించాలని సాంఘిక సమ్క్షెమ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈమేరకు ఆశాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వ్యులు ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రారంభించేదుకు శాఖ సూత్రప్రాయం అనుమతి ఇచ్చింది.
*ప్రంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది గుండె కోసం యోగా అనే అంశాన్ని ప్రధాన శ్రీపాద్ యసోనాయాక్ తెలిపారు. ప్రధాని మోడీ కృషితో మొత్తం ప్రపంచం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటి అన్నారు.
*గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మరూ వారం రోజులు అదార్ కార్డు సంబందిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈసేవాలను తిరిగి అందించటానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అనుమతించడంతో సాధారణ సేవకేంద్రాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ఆధార కార్డులో చిరునామాతో పాటు ఇతర వివరాలలో మార్పులు, చేర్పులు చేసుకోవటానికి అవకాశం లభిస్తుంది. దీనికి నిర్ణిత రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.
*దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులు వ్యవసాయ సంక్షొభం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా తదితర అస్మహలపై శనివారం ప్రధాని మోడీ అద్యక్షతన జరగనున్న నీటి అయోగ్ సమావేశంలో చర్చించనున్నారు. వర్షపు నీటి సంరక్షణ వ్యవసాయ రంగంలో సంస్థాగతంగా తీసుకురాదలచిన సంస్కరణలు కూడా అజెండాలో ఉన్నట్లు అధికారులు వేల్లదిమ్కాహ్రు. రాష్ట్రపతి భవన్ లో జరిగే భేటీలో ముఖ్యమంత్రులు కేంద్రపాలిత ప్రాత్మాల లెప్టినెంట్ గవర్నర్లు కేంద్ర మంత్రులు తదితారులు పాల్గొననున్నారు.
*అమీర్ పేట్–- హైటెక్ సిటీ రూట్ లో మరో కొత్త ట్రైన్ ప్రారంభించనున్నట్టు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఆ రూట్ లో ఇటీవల ఎక్కువ మంది ప్రయాణిస్తున్నందున రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో రైలును ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. హైటెక్ సిటీ ఏరియా లో సాఫ్ట్ వేర్ కంపెనీలు మెట్రో స్టేషన్ నుంచి తమ ప్రాంగణాలకు షటిల్ సర్వీసులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మెట్రో ప్రయాణానికి ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు.
*సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని విజయదుర్గ ఆలయాన్ని సీఎం కేసీఆర్ సతీమణి శోభ నేడు సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయ నిర్వాహకులు డాక్టర్ చెప్పేల హరినాథ్ శర్మ కూతురు వివాహానికి సీఎం సతీమణి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
*యాదాద్రి ఆలయ సమాచారం కోసం హైదరాబాద్ బర్కత్ పురాలో యాదాద్రి భవన్ ప్రారంభించారు మంత్రులు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి పాల్గొన్నారు. 8 కోట్ల రూపాయల వ్యయంతో యాదాద్రి భవన్ నిర్మించామన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. యాదాద్రి ఆలయానికి సంబంధించిన ఆర్జిత సేవలు, కల్యాణం, గదుల బుకింగ్ ఇక్కడి నుంచే చేసుకునేలా సదుపాయం కల్పించామన్నారు.
* ఇక గ‌తంలో కూడా టీడీపీ ఎంపీలు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో చేరారు. 1992 మార్చిలో పీవీ నరసింహారావు హయాంలో కూడా ఆరుగురు టీడీపీ ఎంపీలు భూపతి విజయకుమార్‌ రాజు, ఇంద్రకరణ్‌ రెడ్డి, గంగారెడ్డి, కేవీ చౌదరి, కేపీ రెడ్డయ్య, తోట సుబ్బారావు ఆ పార్టీ నుంచి చీలిపోయి మైనారిటీలో ఉన్న పీవీ ప్రభుత్వాన్ని రక్షించారు. అప్ప‌ట్లో ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వం ప్రతిప‌క్షంలో ఉంది. ఇక టీడీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌లుగా ప‌నిచేసిన ఉపేంద్ర, రేణుకా చౌదరి వేర్వేరు కారణాలతో ఇతర పార్టీల్లో చేరారు. నామా నాగేశ్వరరావు ఇటీవలే టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొని, ఆ పార్టీ తరఫున పోటీచేసి గెలిచారు.
* తెలుగుదేశం పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు ఇప్పటి వరకు చూపించారు. అయితే అసెంబ్లీ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో వైస్సార్ కాంగ్రెస్ లో చేరడానికి హడలిపోతున్నారు.
* కోటంరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో టచ్ లో ఉన్న వారి పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ నుంచి ఎంతమంది వెళ్లిన, చివరకు ఐదు మంది మి మిగిలిన పంచ పాండువుల్లా ప్రజా సమస్యలపై అసెంబ్లీ పోరాడుతామని చెప్పారు.
* అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత టీడీపీ నేతలు అధికార పార్టీ వైపు చూస్తున్నారన్న వాదనలు లేకపోలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూడా అధికార పార్టీ లో చేరేందుకు ఆసక్తి ఉన్నారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టిన కండిషన్ తో అధికార పార్టీ లో చేరాలనుకునే , టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఒకటి, రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాలంటే తమ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లి గెలవాల్సిన పరిస్థితి నెలకొనడంతో, ఎందుకులే ఐదేళ్లు ఎలాగో, అలాగా ఇక్కడే గడిపేద్దామని భావించే అవకాశాలు లేకపోలేదు.
* ఏపీ తొలి అసెంబ్లీ సమావేశాల రెండో రోజునే వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో టిడిపి అధినేత చంద్రబాబు గుండెల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు తమతో టచ్లో ఉన్నారని… తాము ఒక్క సైగ చేస్తే అసెంబ్లీలో టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోటం రెడ్డి వ్యాఖ్యలతో టిడిపిలో ఎవరికి వారు వైసీపీతో టచ్లో ఉన్నారని భుజాలు తడుముకుంటున్నారు. ఈ ప్రకటన ఇలా ఉంటే చంద్రబాబుకు దిమ్మతిరిగే మరో న్యూస్ జాతీయ మీడియా వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది.
* ఏపీ భవనాల అప్పగింత ప్రక్రియ వేగవంతమైంది. హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలు ఈనెల 19వతేదీలోగా తెలంగాణకు అప్పగిస్తామని ఆంధ్రప్రదేశ్ తెలిపింది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం లేఖ రాశారు.
* నేడు అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ సందడి చేశారు. వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కరచాలనం చేసి, ఆత్మీయంగా పలకరించడం ఆసక్తికరంగా మారింది.
*తెలంగాణ శాసనసభకు కొత్త భవన నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌లో ఉన్న రోడ్లు, భవనాల శాఖ కార్యాలయ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గురువారం అధికారుల బృందం దీనిని పరిశీలించినట్లు సమాచారం.
*ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ) ద్వారా ఎంపికైన అభ్యర్థులు వెంటనే తమకు ఉపాధ్యాయ నియామక పత్రాలివ్వాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ను గురువారం ముట్టడించారు.
*ప్రధానమంత్రి కిసాన్‌ పింఛను పథకం ద్వారా లబ్ధి పొందేందుకు రైతన్నలు తమవంతుగా నెలనెలా రూ.100 చెల్లించాల్సి ఉంటుందని కేంద్రప్రభుత్వం తెలిపింది.
* రాష్ట్రంలో శాసనసభ్యుల గృహ సముదాయం ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. ఏడేళ్లుగా సాగుతున్న నిర్మాణాలు ఎట్టకేలకు పూర్తి అయ్యాయి. 120 మంది ఎమ్మెల్యేల కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో అయిదు బ్లాకులుగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు.
*కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు కావడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 21న మేడిగడ్డ పంపుహౌస్‌ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోటార్లను స్విచాన్‌ చేయడం ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు.
*దశాబ్దం నుంచి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు కునుకు లేకుండా చేస్తున్న భవనాల సెట్‌బ్యాక్‌ సమస్య తీరిపోయినట్లే. ప్రైవేటు విద్యాసంస్థలకు అగ్నిమాపక శాఖ నుంచి ఇక నిరభ్యంతర ధ్రువపత్రం(ఎన్‌ఓసీ) సులువుగా దొరకనుంది.
*తెలంగాణ ఉద్యమంలో గట్టు భీముడు చురుకైన పాత్ర పోషించారని, ఆయన సేవలను తెరాస ఎప్పటికీ మరువదని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్కొన్నారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు బుధవారం కన్నుమూయగా గురువారం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని స్వగ్రామం బల్గేరలో అంత్యక్రియలు నిర్వహించారు.
*ఎమ్మెల్సీ పదవులపై అనర్హత వేటు వేస్తూ మండలి ఛైర్మన్‌ జనవరి 16న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కె.యాదవ్‌రెడ్డి, భూపతిరెడ్డి, రాములునాయక్‌లు దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. వీరి పిటిషన్‌లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
*ఇప్పటికే కొన్ని బోధనాసుపత్రుల్లో వేలిముద్రల హాజరు(బయోమెట్రిక్‌) విధానం అమలవుతుండగా.. ఇక నుంచి అన్ని స్థాయిల ఆసుపత్రుల్లోనూ ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది.
*నిజాం చక్కెర మిల్లులను విక్రయించాలంటూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పు వివరాలను ఒక నివేదిక రూపంలో సంబంధిత పరిశ్రమల అధికారులు గురువారం రాష్ట్రప్రభుత్వానికి పంపారు.
*గ్రామాల్లోని అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సర్పంచ్‌ను ఒక్కడినే బాధ్యుడిని చేయడం మూలంగా పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఎన్‌ఆర్‌వీ ఇండియా సంస్థ అభిప్రాయపడింది.
* రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.126.51 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు రూ.979.40 కోట్లు ఇచ్చింది.
*రాష్ట్రంలోని 3.25 కోట్ల గొర్రెలు, మేకలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు మొదటి విడతగా నట్టల నివారణ మందుల పంపిణీ నిర్వహిస్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.
*రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల అక్కడక్కడా ఒకమోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటనలో పేర్కొంది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు గురువారం నమోదయ్యాయని; ఖమ్మంలో అది అత్యధికంగా 42.4 డిగ్రీలు కాగా, రామగుండం 41,4, భద్రాచలం 41.2, మెదక్‌ 40.6, హన్మకొండ 40.5, ఆదిలాబాద్‌ 40.3, నిజామాబాద్‌, నల్గొండలలో 40 డిగ్రీలు నమోదయ్యాయని వివరించింది.
*మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీసీఆర్‌డీఏ ఛైర్మన్‌గా నియమితులు కానున్నారు. ఈ మేరకు రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు ఆయనే స్వయంగా తెలిపారు. 2014లో ఏర్పాటైన ఏపీసీఆర్‌డీఏకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఛైర్మన్‌గా వ్యవహరించారు.
*మార్కెటింగ్‌ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని వ్యవసాయ మార్కెటింగ్‌ ప్రత్యేక కమిషనర్‌గా నియమితులైన పీఎస్‌ ప్రద్యుమ్న చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ధరల స్థిరీకరణ నిధికి విధి విధానాలు రూపొందిస్తామని వివరించారు.
*ప్రత్యేక ఉపాధ్యాయ డీఎస్సీ పరీక్ష ఈనెల 19న ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి తెలిపారు.
*రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రవాణాశాఖ అధికారులు నేడు వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రత్యేకంగా పాఠశాల బస్సులను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఫిట్‌నెస్ లేకుండా తిరుగుతున్న 13 బస్సులను అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా మరో మూడు బస్సులపై కేసులు నమోదు చేశారు.