Movies

తొలిప్రేమ మరిచిపోయా

Time managed to let tamanna forget her first love

‘‘కాలం చాలా గొప్పది. చాలా విషయాలను మరిచిపోయేలా చేస్తుంది. నా తొలి ప్రేమను కూడా మరిపించింది’’ అని అంటున్నారు తమన్నా. ఆమె ప్రస్తుతం తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’, ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’, హిందీలో ‘ఖామోషీ’, తమిళ్‌లో విశాల్‌ సరసన సుందర్‌.సి. దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. తన ఫస్ట్‌ లవ్‌ గురించి ఇటీవల తమన్నా చెప్పుకొచ్చారు. ‘‘నేను స్కూల్‌ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్‌ అన్నయ్య చాలా బావుండేవాడు. తనని చూడాలని తాపత్రయపడేదాన్ని. చీటికీ మాటికీ ఏదో ఒక సాకుతో వాళ్ల ఇంటికి వెళ్లేదాన్ని. అది అట్రాక్షన్‌ అనీ, అసలైన ప్రేమ కాదనీ… అప్పుడు నాకు తెలియదు. నిజమైన ప్రేమ అనుకుని గంటల తరబడి అదే ఆలోచిస్తూ ఉండేదాన్ని. నా ప్రేమ గురించి తనతో ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇప్పుడు అతన్ని చూస్తే ‘అబ్బే.. అప్పుడలా ఎందుకు చేశాం’ అని అనిపిస్తుంది. ఆ వయసు అలాంటిదని అర్థం చేసుకున్నా. అప్పుడే కాదు… ఇప్పటి వరకూ నా వెంట మాత్రం ఎవ్వరూ పడలేదు. అప్పట్లో నేను అంత బావుండేదాన్ని కాదేమో! బహుశా ఇప్పుడు ఓవర్‌ క్వాలిఫైడేమో (నవ్వుతూ)’’ అని తెలిపారు తమన్నా.