Movies

20ఏళ్లకు మళ్లీ….

Venkatesh Tabu Pairing Again After 20 Years For A New Movie

‘కూలీ నెం.1’లో జంటగా నటించారు వెంకటేష్‌, టబు. తెలుగులో టబుకి తొలి చిత్రమిదే. తొలి అడుగుతోనే స్టార్‌గా మారిపోయింది. ఆ సినిమా వచ్చి ఇరవై ఏళ్లు గడిచాయి. ఆ తరవాత వెంకీ – టబు కలసి నటించలేదు. ఇంతకాలానికి వీరిద్దరూ వెండితెరపై సందడి చేయబోతున్నట్టు సమాచారం. బాలీవుడ్‌లో విజయవంతమైన చిత్రం ‘దే దే ప్యార్‌ దే’. అజయ్‌దేవగణ్‌, టబు, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్‌తో రీమేక్‌ చేస్తున్నారు. టబు పాత్ర మళ్లీ ఆమెకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై చిత్రబృందం ఇప్పటికే టబుని సంప్రదించగా, తను సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. వెంకటేష్‌ ప్రస్తుతం ‘వెంకీ మామ’తో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తరవాతే ‘దే దే ప్యార్‌ దే’ రీమేక్‌ పట్టాలెక్కవచ్చు. దర్శకుడు, ఇతర చిత్రబృందం వివరాలు త్వరలో వెల్లడవుతాయి.