Fashion

పాలల్లో ముంచిన దూదితో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు

If you dont have cleanser use cotton ball dipped in milk to remove makeup

అలంకరణ వేసుకోవాలని అనుకున్న ప్రతిసారీ అన్ని వస్తువులూ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఈ కిటుకులు ఉపయోగపడతాయి.

* అలంకరణ తొలగించుకోవడానికి క్లెన్సర్‌ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. మేకప్‌ రిమూవర్‌నే దీనికోసం వాడుకోవచ్చు. లేదంటే పాలల్లో ముంచిన దూదితో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు.
* ఐలైనర్‌ లేనప్పుడు బదులుగా మస్కారాని వాడుకోవచ్చు. సన్నని బ్రష్‌ని మస్కారా బాటిల్‌లో ముంచి లైనర్‌గా వాడుకోవచ్చు.
* పెర్‌ఫ్యూమ్‌ ఎక్కువ సేపు సువాసన వెదజల్లాలంటే చెవి వెనుక కాస్త వ్యాజలీన్‌ రాసుకుని స్ప్రే చేసుకుంటే చాలు. రోజంతా తాజాగా ఉండొచ్చు.
* కళ్లకింద ఉబ్బెత్తుగా ఉన్నప్పుడు టీ బ్యాగులకు బదులుగా, గుడ్డు తెల్ల సొన రాసుకోవచ్చు.
* నెయిల్‌పాలిష్‌ గడ్డకట్టినప్పుడు కాస్త రిమూవర్‌ని అందులో కలిపితే తిరిగి మళ్లీ చక్కగా వేసుకోవచ్చు.
* గోళ్ల రంగు త్వరగా ఆరాలంటే చల్లటి నీళ్లలో వేళ్లను ముంచితే సరి. లేదంటే కూల్‌ ఎయిర్‌తో బ్లో డ్రై చేసుకున్నా ఫలితం ఉంటుంది.