ScienceAndTech

అతిత్వరలో భారతీయ ఈ-పాస్‌పోర్టులు

Indian Government To Issue E-Passports Very Soon

ఇ పాస్ పోర్టుల తయారీకి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని ఈ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ సోమవారం తెలిపారు. అధునాతన సంరక్షణ ఏర్పాట్లతో ఉండే ఈ సరికొత్త పాస్పోర్టులను త్వరితగతిన తీసుకురావాలని సంకల్పించినట్లు వివరించారు. ఏడవ పాస్ పోర్టు సేవాదివస్ సందర్భంగా ఏర్పాటు అయిన సభలో ఆయన మాట్లాడారు. చిప్ అమరిక ఉండే ఇపాస్పోర్టుల తయారీ కోసం ఇప్పటికే ఇండియా సెక్యూరిటీ ప్రెస్తో చర్చలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అనుకుంటున్నట్లు , సాధ్యమైనంత త్వరలోనే ఈ సరికొత్త పాస్పోర్టులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రతి లోక సభ నియోజకవర్గంలో ఒక పాస్ పోర్టు సేవా కేం ద్రం ఏర్పాటు ఉండే పోస్టాఫీసు (పిఒపిఎస్కె) ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారని , ఇటువంటి సేవా కేంద్రాలు లేని చోట ఇవి ఏర్పాటు అవుతాయని మంత్రి వివరించారు. ఈ పాస్ పోర్టు తపాలాఫీసుల ఏర్పాటు గురించి తమ మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖతో సమన్వయంతో వ్యవహరిస్తోందని మంత్రి తెలిపారు.