Devotional

2019 బోనాలకు ₹100కోట్లు కేటాయించిన తెలంగాణా ప్రభుత్వం

2019 బోనాలకు ₹100కోట్లు కేటాయించిన తెలంగాణా ప్రభుత్వం

జంట నగరాల్లో ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 100  కోట్ల ఖర్చు చేస్తోందని పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్‌ అన్నారు. సాలార్ జంగ్ మ్యూజియంలో అన్ని శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 4న గోల్కొండ బోనాలు మొదలుకుని 29వ తేదీన జరిగే లాల్‌ దర్వాజా బోనాల వరకూ అన్ని ఆలయాల అభివృద్ధికి ఈ నిధు లు వెచ్చించనున్నట్టు వెల్లడించారు. జులై 15లోపు అని ఆలయాల వద్ద పనులు పూర్తి చేయాలని సూచించారు. బోనాలతో తరలివచ్చే మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, ఎస్‌బీ జాయింట్ సీపీ తరుణ్ జోష్, ట్రాఫిక్ డీసీపీ బాబురావు, సౌత్ జోన్ డీసీపీ అంబర్ కిషోర్ ఝా, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి దేవాలయ చైర్మన్ పోటెల్ శ్రీనివాస్ యాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.