Food

గాడిద పాలు జున్ను బాగా కాస్ట్లీ

Donkey Milk Dessert From Serbia Is Very Expensive

సెర్బియా లోని ఒక తెగ గాడిదల పాలజున్నుకు ఎంతో గిరాకీ కనిపిస్తోంది. తెల్లగా చిక్కగా ఉండే ఈ జున్ను ఆరగిస్తే ఆరోగ్యం బాగా ఉంటుందని నమ్ముతున్నారు. కిలో 1130 డాలర్లకు అమ్ముతున్నారంటే దీని గిరాకీ ఎలా ఉందో చెప్పవచ్చు. ప్రపంచం మొత్తం మీద ఇంత ఎక్కువ ఖరీదైన జున్ను మరేదీ లేదని చెబుతున్నారు. ఈ గాడిదల పాలతో జున్ను తయారు చేసే వారిలో స్లోబోడన్ సిమిక్ ఒకరు. 2012 నుంచి సిమిక్ అతని రైతు బృందం దాదాపు 200 గాడిదల నుంచి జున్ను తయారు చేసి అమ్ముతుండడం పరిపాటిగా వస్తోంది. ఈ గాడిదలను ఉత్తర సెర్బియాలో సహజ ప్రకృతి వాతావరణంలో పెంచుతున్నారు. ఈ వ్యాపారం కారణంగా సిమిక్‌కు బాల్కన్ గాడిదల సంరక్షణకు మార్గం ఏర్పడింది.వ్యవసాయంలో యంత్రాలు ప్రవేశించడంతో వీటి ఉనికి దెబ్బతింది. స్తన్య క్షీరంతో ఈ పాలు సమానంగా చూస్తుంటారు. ఈ పాలను సేవిస్తే అనేక ఆస్తమా, శ్వాసకోస వ్యాధులు వంటివి అనేక రుగ్మతలు నయమవుతాయని చెబుతుంటారు. పసిబిడ్డలు మొదటి రోజే ఎలాంటి నీళ్లు కలపకుండా ఈ పాలను తాగవచ్చని సిమిక్ చెప్పారు. శాస్త్రీయ పరిశోధన ఈ పాల గురించి జరగకపోవడంతో ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో సరిగ్గా చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని సిమిక్ తెలిపారు.ఈ పాలలో ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయి. ఆవు పాలు పడని వారికి ప్రత్యామ్నాయంగా ఈ పాలను వినియోగించ వచ్చని ఐక్యరాజ్యసమితి కూడా సూచించింది. కానీ గాడిద పాలు జున్నుగా తయారు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని సిమిక్ అభిప్రాయ పడ్డారు. 2012 లో సెర్బియా టెన్నిస్ క్రీడాకారుడు నోవక్‌జెకోవోక్ ఏడాది పొడుగునా గాడిద పాలు కొన్నారని రూమర్లు రావడంతో ఈ గాడిదల పాల జున్ను వార్తలు బాగా ప్రచారం లోకి వచ్చాయి.