Fashion

LED హెయిర్‌బ్యాండ్స్ మీకు బాగుంటాయి

LED Hairbands Called HairLights Are Attracting Fashion Freaks

వెలుగులీనే నెలవంకనూ మెరిసే తారలనూ తెచ్చి జవరాలి జడలో తురమనా… అంటూ జతగాడు సరసంగా కవిత్వం అల్లుతుంటే మురిసిపోతుంటారు ముద్దుగుమ్మలు. అచ్చంగా ఆ వెలుగులు సిగలో మెరుస్తుంటే ఎంత బాగుంటుందో కదా… అలా అని నిజంగా చందమామనూ చుక్కల్నీ తెచ్చి తల్లో పెట్టుకోనూలేం. అందుకే, ఆ వెలుగుల అందాలన్నిటినీ ఎల్‌ఈడీ లైట్ల రూపంలో గుది గుచ్చి తల్లో పెట్టుకునేందుకు చిన్న చిన్న క్లిప్పులతో సహా తయారుచేస్తున్నారు. ‘హెయిర్‌ లైట్స్‌’ పేరుతో వస్తున్న ఇవి బ్యాటరీలతో పనిచేస్తాయి. వీటిని పెట్టుకుని రాత్రిపూట పార్టీలూ ఫంక్షన్లకి వెళ్తే తారల్ని సిగలో తురుముకున్నట్లు అనిపించదూ…