DailyDose

ఇక నుండి ₹20 నాణేలు-వాణిజ్య-07/06

Indian Govt To Release 20Rupee Coins

* వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.34,290, విశాఖపట్నంలో రూ.35,750, ప్రొద్దుటూరులో రూ.33,850, చెన్నైలో రూ.34,760గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,660, విశాఖపట్నంలో రూ.32,890, ప్రొద్దుటూరులో రూ.31,400, చెన్నైలో రూ.33,190గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.37,000, విశాఖపట్నంలో రూ.38,900, ప్రొద్దుటూరులో రూ.38,700, చెన్నైలో రూ.40,300 వద్ద ముగిసింది.
*2014 కు ముందు బ్యాంకులు, ప్రభుత్వం, రిజర్వ్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఆర్‌‌బీఐ)ల వైఫల్యం వల్లే ఎన్‌‌పీఏలు కొండలా ఎదిగిపోయాయని, ఫలితంగా మూలధన నిల్వలు హరించుకుపోయాయని ఆర్‌‌బీఐ మాజీ గవర్నర్‌‌ ఉర్జిత్‌‌ పటేల్‌‌ చెప్పారు
*మీడియా, విమానయానం, బీమా, ఏక బ్రాండ్ రిటైల్ రంగాల్లో మరిన్ని విదేశీ నిధులను ఆకర్షించేందుకు వీలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనల్ని తాజా బడ్జెట్లో సడలించారు. ‘బీమా బ్రోకరేజీ సంస్థల్లో 100 శాతం ఎఫ్డీఐల్ని అనుమతించబోతున్నాం.
*పన్ను పరిధిని పెంచడం కోసం ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టర్లు లేదా వృత్తినిపుణులకు వ్యక్తులు చేసే చెల్లింపులు ఒక ఏడాదిలో రూ.50 లక్షలకు మించితే 5 శాతం మూలం వద్ద పన్ను మినహాయింపు(టీడీఎస్)ను విధిస్తారు.
*25 శాతం కార్పొరేట్ పన్ను పరిధిలోకి వచ్చే కంపెనీల వార్షిక టర్నోవరు పరిమితిని రూ.250 కోట్ల నుంచి రూ.400 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
*ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడిని ఉపసంహరించేందుకు ప్రభుత్వం ఈటీఎఫ్ మార్గాన్నే ఎంచుకుంది. సీపీఎస్ఈ పేరుతో ఈటీఎఫ్లను స్టాక్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
*సౌర విద్యుత్తు వినియోగానికి తోడ్పడే సెల్స్, బ్యాటరీలు, ఛార్జింగ్ వ్యవస్థల తయారీ యూనిట్లను దేశీయంగా నెలకొల్పేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చేలా ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం ఆవిష్కరించనుంది.
*సెల్ఫోన్లు, టీవీలు, సెట్టాప్ బాక్సుల తయారీదార్లకు ఊరట కలిగించే ప్రతిపాదనను ఆర్థిక మంత్రి చేశారు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లింగ్, సెల్ఫోన్ల కెమేరా మాడ్యూల్, ఛార్జర్/అడాప్టర్, లిథియం అయాన్ బ్యాటరీ, డిస్ప్లే మాడ్యూల్, సెట్టాప్ బాక్స్, కాంపాక్ట్ కెమేరా మాడ్యూల్ల తయారీ, బిగింపు (అసెంబ్లింగ్)నకు వినియోగించే యంత్రాలపై ప్రస్తుతం అమలవుతున్న పన్నును పూర్తిగా పరిహరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
*ఒక వ్యక్తి ఖాతాలో మరో వ్యక్తి డబ్బు జమ చేయడం ఇకపై కుదరకపోవచ్చు. ఇప్పటి వరకూ ఎవరి ఖాతాలో ఎవరైనా బ్యాంకు శాఖకు వెళ్లి… డబ్బు వేసే వీలుంది. దీనివల్ల మోసపూరిత లావాదేవీలు జరుగుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
*జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా బడ్జెట్లో కీలక నిర్ణయం వెలువడింది. ఎన్పీఎస్ వ్యవధి తీరిన తర్వాత ఖాతాదారులు వెనక్కి తీసుకునే మొత్తంలో 60శాతం వరకూ పన్ను వర్తించదని బడ్జెట్లో ప్రతిపాదించారు.
*ఆర్థిక వ్యవస్థలో నగదు అవసరాన్ని తగ్గించడంతోపాటు.. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం ఇచ్చేలా బడ్జెట్లో పలు ప్రతిపాదనలు వచ్చాయి.
*విమాన ప్రయాణికులపై నేరుగా ప్రభావం చూపే అంశాలేమీ బడ్జెట్లో లేవు. అయితే విమానయాన రంగానికి ప్రోత్సాహం కలిగించే నిర్ణయాలను మాత్రం ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇవి సాకారం కావాలంటే, వేలకోట్ల రూపాయల పెట్టుబడులు రావాల్సి ఉంది.