Movies

అక్క తలుచుకుంటే తమ్ముడికి కొదవా?

Rakul Helps Her Brother To Grab Nags Title

కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్న సినిమా ‘నిన్నే పెళ్లాడతా’. వైకుంఠ్‌ బోను దర్శకుడు. ఇది అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున హిట్‌ సినిమా టైటిల్‌ కావడం విశేషం. ఈ చిత్రాన్ని అంబిక ఆర్ట్స్‌, ఈశ్వరి ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నాగ్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జునకు రకుల్‌ ధన్యవాదాలు తెలిపారు. ‘నా చిట్టి తమ్ముడు అమన్‌కు శుభాకాంక్షలు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌’ అని ట్వీట్‌ చేశారు. ఇదే సందర్భంగా రకుల్‌ స్నేహితురాలు మంచు లక్ష్మి కూడా అమన్‌ను విష్‌ చేశారు. అమన్‌ 2017లో ‘రాక్‌ అండ్‌ రోల్‌’ అనే లఘు చిత్రంతో నటుడుగా కెరీర్‌ ఆరంభించారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.