Devotional

జులై 24న తితిదే ప్రత్యేక దర్శనాలు

TTD Special Darshan Dates Announced For Handicapped & Kids

1. ఉజ్జయిని మహంకాళి ప్రసాద మహత్యం – ఆద్యాత్మిక వార్తలు
మనకు వరాలివ్వ మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన తల్లి.. నేడు శ్రీ ఉజ్జయిని మహాకాళిగా విరాజిల్లుతోంది. 204 ఏళ్ల నుంచి ఏటేటా బోనంతోనే సంతృప్తి చెందుతూ చల్లని చూపుచూస్తోంది. నేడు రాష్ట్ర పండగై బోనాల జాతరకు కేంద్రబిందువుగా బాసిల్లుతోంది. అందుకే పేదలు, పెద్దలు అని తేడా లేకుండా అమ్మ సేవలో ఒదిగిపోతున్నారు. జులై21, 22 తేదీల్లో జరిగే బోనాల జాతరకు ఆలయం సన్నద్ధమవుతున్న తరుణంలో ఆధ్యాత్మిక సన్నిధిపై ప్రత్యేక కథనం.
సికింద్రాబాద్కు చెందిన సురిటి అప్పయ్య మిలిటరీ ఉద్యోగి. 1813లో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీలో పని చేశారు. అప్పుడు అక్కడ కలరాసోకి వేలాదిమంది మృత్యువాత పడ్డారు. అప్పయ్య ఉజ్జయినీలోని మహాకాళిని దర్శించి కాపాడాలని కోరారు. పరిస్థితులు అనుకూలిస్తే అమ్మవారి అంశను సికింద్రాబాద్కు తెచ్చి, ఆలయం నిర్మిస్తామని మొక్కుకున్నారు. పరిస్థితులు బాగవడంతో 1815లో సికింద్రాబాద్లో అమ్మవారిని ప్రతిష్ఠించారు.
***నగరంపై అమ్మ చల్లని చూపు
* కర్భలా మైదానం కూడలి: ఇక్కడి నుంచే అమ్మవారి ఘటం ఎదుర్కోలు ఉంటుంది.
* బోయిగూడ: అమ్మవారి పుట్టిల్లుగా కొనసాగుతోంది. చివరిరోజు ఇక్కడి భక్తులకు మహాకాళి దర్శనం లభిస్తుంది.
* మెట్టుగూడ: బోనాల జాతర ఉత్సవాల్లో చివరిదైన ‘సాగనంపు’ ఇక్కడే పూర్తవుతుంది.
* ఘటం యాత్ర: సికింద్రాబాద్లోని హిమాంబావి, నల్లగుట్ట, పాన్బజార్, ఓల్డ్బోయిగూడ, రంగ్రేజీబజార్, ఉప్పర్బస్తీ, చిలకలగూడ, కుమ్మరిగూడ, రెజిమెంటల్బజార్ బోయిగూడ, బన్సీలాల్పేట ప్రాంతాల్లో ఘటం దర్శనమిస్తుంది.
2. సామాన్యులకు సులువుగా శ్రీవారి దర్శనం
తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ల విభజన రద్దుకు స్పందన లభిస్తోంది. బుధవారం తీసుకున్న నిర్ణయాన్ని తితిదే గురువారం ఆచరణలోకి తెచ్చింది. ఈ విధానం కింద గంట సమయం ఆదా అయింది. అదనంగా 5వేల మందికిపైగా సామాన్యులు శ్రీవారిని దర్శించుకోగలిగారు. గురువారం ఉదయానికి వీఐపీ బ్రేక్దర్శనం కింద 2,904 మందికి తితిదే టిక్కెట్లు ఇచ్చింది. వీరిలో 49మంది ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులున్నారు. వీరందరినీ ఆలయానికి ముందుగా తీసుకెళ్లి హారతితో కూడిన శ్రీవారి దర్శనం చేయించి తీర్థం, శఠారీ మర్యాదలు చేసింది. కేవలం పది నిమిషాల వ్యవధిలో దర్శనం చేయించి మిగిలిన వారిని తర్వాత ప్రవేశపెట్టి 1.50 గంటల వ్యవధిలో బ్రేక్ దర్శనం పూర్తి చేసింది. గురువారం ఉదయం రద్దీ సాధారణంగా ఉండడంతో ప్రొటోకాల్ ప్రముఖులకు మర్యాదలు చేయించి ఇతరులను కులశేఖరపడి వరకు అనుమతించారు. సాయంత్రానికి రద్దీ పెరిగింది. శుక్రవారం ప్రొటోకాల్ ప్రముఖులకే వీఐపీ దర్శనం ఉంటుంది. శనివారం ప్రముఖులకు ఎలాంటి మర్యాదలు లేకుండా దర్శనం చేయించడంతో పాటు ఇతరులకు లఘు దర్శనం చేయించాలని తితిదే నిర్ణయించింది.
3. పద్మావతి అమ్మవారికి అంబులెన్స్ విరాళం
చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ముంబయికి చెందిన భక్తుడు అజయ్కుమార్ సాహు రూ.25 లక్షల విలువైన అంబులెన్స్ను అందజేశారు. తన తల్లి దివంగత డాక్టర్ ఇందిరా సాహు జ్ఞాపకార్థం అంబులెన్స్ను గురువారం ఆలయం వద్ద ఆయన విరాళంగా అందించారు. వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సంబంధిత తాళాలను జేఈవో పి.బసంత్ కుమార్కు కుటుంబ సభ్యులతో కలిసి అజయ్కుమార్ సాహు అప్పగించారు.
4. 23న నూతన గవర్నర్ తిరుమల రాక
రాష్ట్ర నూతన గవర్నర్గా నియమితులైన భాజపా సీనియర్ నేత బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 23వ తేదీన తిరుమలకు రానున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అమరావతికి చేరుకుని ఈ నెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు తితిదేకు గురువారం సమాచారం అందింది.
5. తలనీలాల ఆదాయం రూ.1.96 కోట్లు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించుకున్న తలనీలాలను గురువారం విక్రయించారు. ఈ-వేలం ద్వారా వివిధ రకాలను విక్రయానికి పెట్టగా రూ.1.96 కోట్ల ఆదాయం వచ్చింది. మొదటి రకం కింద రూ.22,508 వంతున 500 కిలోలు, రెండో రకం రూ.17,260 చొప్పున 400 కిలోలు అమ్ముడుపోయాయి.
6. శ్రీరస్తు శుభమస్తు
*తేది : 19, జూలై 2019*
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : భృగువాసరే (శుక్రవారం)
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : విదియ
(ఈరోజు ఉదయం 6 గం॥ 55 ని॥ వరకు విదియ తిధి ఉన్నది తదుపరి తదియ తిధి)
నక్షత్రం : ధనిష్ట
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 34 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 25 ని॥ వరకు ధనిష్ట నక్షత్రం తదుపరి శతభిషం నక్షత్రం)
యోగము : (ప్రీతి ఈరోజు తెల్లవారుఝామున 4 గం ll 26 ని ll వరకు తదుపరి ఆయుష్మాన్ రేపు తెల్లవారుఝామున 5 గం ll 19 ని ll వరకు)
కరణం : (గరిజ ఈరోజు ఉదయం 6 గం ll 55 ని ll వరకు)
(వణిజ ఈరోజు రాత్రి 8 గం ll 3 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మద్యాహ్నము 12 గం ll 22 ని ll )
వర్జ్యం : (ఈరోజు ఉదయం 6 గం॥ ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 49 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 47 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 34 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 16 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 12 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 27 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 22 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 9 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 13 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 40 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 38 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : మకరము
శుక్ర మూఢమి ప్రారంభం రాత్రి 8 గం ll 47 ని ll
7. మనీయుని మాట*
మనిషి అందంగా కనపడాలంటే ఎన్నో తెరలు తొలగించాలి. కానీ…
మనసు అందంగా కనపడాలంటే మాత్రం అహం, అసూయ, ఈర్ష్య, క్రోధం అనే అడ్డు పొరల్ని తొలగించుకోవాలి.”
8. నేటీ మంచి మాట*
“ఒక మంచి వ్యక్తికోసం వేచిన సమయం
ఒక మంచి పనికోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కాదు.”
9. నేటి సుభాషితం
*గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చాలు.*
10. చరిత్రలో ఈ రోజు/జూలై 19* మంగళ్ పాండే
1827 : , ఈస్ట్ ఇండియా కంపెనీ, 34వ బెంగాల్ రెజిమెంటునందు ఒక సిపాయి, సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు మంగళ్ పాండే జననం (మ.1857).
1905 : అప్పటి భారత వైస్రాయి అయినటువంటి లార్డ్ కర్జన్ చే బెంగాల్ విభజన యొక్క నిర్ణయం ప్రకటించబడింది.
1955 : పూర్వపు భారత క్రికెట్ ఆల్‌రౌండర్ అయిన రోజర్ బిన్నీ జననం.
1969 : కేంద్ర ప్రభుత్వం 14 బ్యాంకులను జాతీయం చేసింది.
1985 : ముమ్మిడివరం బాలయోగి కైవల్య సిద్ధి (మరణించిన రోజు).
1993 : భారత్ ఇన్‌సాట్ -II బి ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
11. ప్రహ్లద సమేత స్వయంభూగా వేలశి యున్నక్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము*
కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్ఫోన్ నెం : 08494 – 221066, 221366 19.07.2019 వతేది, శుక్రవారము ఆలయ సమాచారం
*శ్రీస్వామి వారి దర్శన వేళలు
ఉదయము 5.30 గంటలకై అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ..స్వామి వారి దర్శనము ఉదయము 6.00 గంటల నుండి 7.30 గంటలకు వుండుఅనంతరము ఉదయం 7.30 గం|| నుండి స్వామివారికి అర్జిత అభిషేక సేవ ప్రారంభమగును. స్వామి వారికి *_ఆర్జిత అభిషేకము_* సేవా, సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటలనుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు…శుక్రవారము సందర్భముగా అమృత వళ్ళీ అమ్మవారికి (లక్ష్మీదేవి) ప్రత్యేక అభిషేకము ఉదయము 7.30 గంటలనుండి నిర్వహించబడును తిరిగి సర్వ దర్శనము ఉదయము 10.00 గంటల నుండి మ. 12.00 వరకు వుండును..రెండవ మహాగంట నివేదనమ.12.00 నుండి 12.30 లోపు, బాలబోగ్యం త్రికల నైవేద్యాము సమర్పణ..మ. 12.40 నుండి 1.30 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును.. మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.30 నుండి 7.00 లోపు, బాల బోగ్యం త్రికల నైవేద్యాదులు సమర్పణ. మహ మంగళ హారతి, పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ.. తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 7.00 గంటల నుండి రా.8.30 వరకు వుండును.. రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
*ఆర్జిత సేవాల వివరములు
19.07.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్: 20*_
19.07.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్
12. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం జూలై 23న వృద్ధులు, దివ్యాంగులకు,
జూలై 24వ తేదీ చంటిపిల్లల తల్లిదండ్రులకు …
శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు ల్పిస్తోంది.ఇందులోభాగంగా జూలై 23వ తేదీ మంగ‌ళ‌వారం వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను జూలై 24వ తేదీ బుధ‌వారం ఉద‌యం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను జూలై 24న సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.