1. రేపటి నుంచి అన్నవరంలో ఆవిర్భావ వేడుకలు – ఆద్యాత్మిక వార్తలు
అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా తొలిసారిగా ఆగస్టు 2న స్వామివారి మూలవిరాట్ను వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించడానికి ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో ఎం.వి.సురేష్బాబు తెలిపారు. ఆగస్టు 1, 2 తేదీల్లో స్వామివారి ఆవిర్భావ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంగళవారం ఉదయం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం గణపతిపూజ, పుణ్యాహవాచనం, దీక్షా వస్త్రధారణ, జపాలు, పారాయణాలు, హోమాలు, ఆయుష్యహోమం జరుగుతాయని తెలిపారు. ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు మండపారాధన, నీరాజన మంత్ర పుష్పం తదితర పూజలు నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు రెండోతేదీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామి, అమ్మవార్ల మూలవిరాట్కు మహన్యాసపూర్వక పంచామృతాభిషేకం, ఉదయం 10.30 గంటలకు వెండి రథంపై ప్రాకారసేవ, 11 గంటలకు పూర్ణాహుతి, పండిత సత్కారాలు ఉంటాయని వివరించారు. ఆరోజు రాత్రి ఏడు గంటలలకు గరుడ వాహన సేవ, అనంతరం 7.30 గంటలకు నిత్య కల్యాణమండపంలో ఫల పుష్పసేవ జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. స్వామివారి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఫల, పుష్ప సేవను గత ఏడాది నుంచే ప్రారంభించామన్నారు. ఈ ఏడాది గతంలో కన్నా మరింత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నిత్యకల్యాణ మండపంలో జరిగే వేడుకకు బెంగళూరుకు చెందిన ప్రత్యేక బృందం వచ్చి అలంకరణ చేస్తారన్నారు. అందులో భాగంగా మండపాన్ని సిద్ధం చేస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది మొదటిసారిగా స్వామి, అమ్మవార్ల మూలవిరాట్కు కూడా ఫల, పుష్పాలంకరణ చేయాలని నిర్ణయించామని ఈవో తెలిపారు. ఆగస్టు రెండోతేదీన ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల మద్య అలంకరణ చేసిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్ రమేష్బాబు, ఏఈవోలు ఎం.కె.టి.ఎన్.వి. ప్రసాద్, కర్రా శ్రీనివాసరావు, భ్రమరాంబ, సత్యవతీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆగస్టు రెండోతేదీ రాత్రి నిత్య కల్యాణమండపంలో జరిగే ఫల, పుష్ప సేవకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను అధికారులు, పోలీసులు పరిశీలించి చర్చించారు. ఎస్సైలు మురళీమోహన్, శంకరరావు, పీఆర్వో తులారాముడు, ఇ.ఇ. నూకరత్నం తదితరులు భక్తులను లోపలకు అనుమతించడం, బయట మార్గం, విద్యుత్తు అలంకరణ, ప్రసాదం పంపిణీ, గ్యాలరీల ఏర్పాటు తదితర వాటిపై చర్చించారు.
2. యాదాద్రిలో మహా సుదర్శన యాగం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన అభివృద్ధి పనులు ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో అక్కడ త్వరలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. యాగం నిర్వహణ, ఏర్పాట్లపై చినజీయర్స్వామితో సీఎం చర్చించారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని పీఠంలో చినజీయర్ స్వామిని కలిశారు. ఈ సందర్భంగా సుదర్శన యాగం సంకల్పాన్ని సీఎం వివరించారు. 100 ఎకరాల ప్రాంగణంలో 1048 యజ్ఞ కుండాలతో ఈ యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 3000 మంది రుత్విక్కులు, మరో 3000 మంది వారి సహాయకులతో నిర్వహిస్తారు.
3. శ్రావణంలో శ్రీశైలం ఆలయ వేళల్లో మార్పు
శ్రావణమాసాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో శ్రీరామచంద్రమూర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 2 నుంచి 31 వరకు ఆలయ వేళల్లో మార్పు చేస్తున్నట్లు చెప్పారు. శ్రావణమాసంలో ఆగస్టు 3, 4, 5, 10, 11, 12 తేదీలు, స్వాతంత్య్ర దినోత్సవం, పౌర్ణమి పురస్కరించుకొని 15, 17, 18, 19, 24, 26, 31 తేదీల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని.. ఆ రోజుల్లో తెల్లవారుజామున 3 గంటలకే సుప్రభాతసేవ, స్వామి అమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు మహామంగళహారతులు నిర్వహిస్తామన్నారు. వేకువజాము 4 గంటల నుంచేే భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. 5.30 నుంచి అభిషేకాలు ప్రారంభమవుతాయన్నారు.
4. తిరుమలలో దశలవారీగా నీటి విక్రయం నిషేధం
ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా తిరుమల దివ్యక్షేత్రంలో దశలవారీగా నీటి సీసాల అమ్మకాన్ని నిషేధించనున్నట్లు తితిదే ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి సంకేతాలిచ్చారు. తిరుమల వ్యాప్తంగా జలప్రసాద కేంద్రాలు విరివిగా ఉన్నందున ఇక్కడి సురక్షిత నీటినే తాగేలా భక్తులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. దేవస్థానంలోని విభాగాధిపతులతో మంగళవారం సమావేశమైన ధర్మారెడ్డి మాట్లాడుతూ.. భక్తకోటికి మెరుగైన సేవలు అందించే దిశగా తిరుమలలో ప్రాంతాల వారీగా విభజించి సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించారు. వసతి సముదాయాల నిర్వహణ, పరిశుభ్రత, విద్యుద్దీపాలు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై బాధ్యతలు అప్పగించారు. రానున్న బ్రహ్మోత్సవాలకు అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులు పూర్తిచేసేలా ఆదేశాలిచ్చారు.
5. శ్రీశైలం ఆలయ వేళల్లో మార్పు
శ్రావణమాసాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో ఆగస్టు 2 నుంచి 31 వరకు ఆలయ వేళల్లో మార్పు చేస్తున్నట్లు ఈవో శ్రీరామచంద్రమూర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 3, 4, 5, 10, 11, 12 తేదీలు, స్వాతంత్య్ర దినోత్సవం, పౌర్ణమి పురస్కరించుకొని 15, 17, 18, 19, 24, 26, 31 తేదీల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని.. ఆ రోజుల్లో తెల్లవారుజామున 3 గంటలకే సుప్రభాతసేవ, స్వామి అమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు మహామంగళహారతులు నిర్వహిస్తామన్నారు. వేకువజాము 4 గంటల నుంచేే భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. 5.30 నుంచి అభిషేకాలు ప్రారంభమవుతాయన్నారు. ఈ రద్దీ రోజుల్లో మహామంగళహారతి, సుప్రభాతసేవ టిక్కెట్లను నిలుపుదల చేస్తున్నామన్నారు.
6. పూరి ఆలయంలో గుట్కా, పొగాకుపై నిషేధం
గురువారం నుంచి పూరి జగన్నాథ ఆలయంలో గుట్కా, పొగాకు, తమలపాకులను నిషేధిస్తున్నట్లు ఆలయ పాలకవర్గం ప్రకటించింది. ఎవరైనా వీటిని నములుతూ.. లేదా తమ వద్ద ఉంచుకుని ఆలయంలోనికి ప్రవేశిస్తే రూ.500 వరకు జరిమానా విధిస్తారని పేర్కొంది.
7. దుర్గమ్మకు ఆషాఢ సారె
ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు 12 బృందాలు సంప్రదాయబద్ధంగా మంగళవారం సారెను సమర్పించాయి. దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో దుర్గమ్మ ఉత్సవమూర్తి ఎదుట సారెను అర్చక బృందానికి అందజేశారు. పసుపు, కుంకుమ, చీర, పండ్లు, పూలు, గాజులు, చలిమిడి, మిఠాయిలతో వచ్చిన బృందాలు తొలుత సారెను సమర్పించిన తరువాత వారికి దేవస్థానం సిబ్బంది వారికి దుర్గమ్మ దర్శనం చేయించారు. విజయవాడ సత్యనారాయణపురం నుంచి మాతృశ్రీ మండలి, మల్లికార్జునపేట నుంచి బాల గణపతి భక్త బృందం, కొత్తపేట నుంచి యాదవ హక్కుల పోరాట సమితి, దేవస్థానం పారిశుద్ధ్య సిబ్బంది అమ్మవారికి సారెను అందజేశారు. ఈవో కోటేశ్వరమ్మ, దేవస్థానం సిబ్బంది వారికి ప్రసాదాలు అందజేశారు.
8. పంచాంగం 31.07.2019
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: గ్రీష్మ
మాసం: ఆషాఢ
పక్షం: కృష్ణ బహుళ
తిథి: చతుర్దశి ఉ.11:24 వరకు
తదుపరి అమావాశ్య
వారం: బుధవారం (సౌమ్య వాసరే)
నక్షత్రం: పునర్వసు ప.03:10 వరకు
తదుపరి పుష్యమి
యోగం: వజ్ర, సిధ్ధి
కరణం: శకుని
వర్జ్యం: రా.10:44 – 12:15
దుర్ముహూర్తం: 11:56 – 12:48
రాహు కాలం: 12:22 – 01:59
గుళిక కాలం: 10:45 – 12:22
యమ గండం: 07:31 – 09:08
అభిజిత్ : 11:57 – 12:47
సూర్యోదయం: 05:54
సూర్యాస్తమయం: 06:49
వైదిక సూర్యోదయం: 05:58
వైదిక సూర్యాస్తమయం: 06:46
చంద్రోదయం: 04:47
చంద్రాస్తమయం: 06:16
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మిథునం
దిశ శూల: ఉత్తరం
చంద్ర నివాసం: పశ్చిమం
9. చరిత్రలో ఈ రోజు/జూలై 31*
చంద్రుని ఉపరితల చిత్రాలు తీసి పంపిన రేంజర్ 7
1498: కొలంబస్ ట్రినిడాడ్ దీవి కి చేరుకున్నాడు.
1954: ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొదటిసారిగా, ఆర్డితటొ డిసియో నాయకత్వంలోని, ఇటలీ బృందం ఎక్కింది.
1964: అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపింది.
1965: జె.కె. రౌలింగ్, ఇంగ్లీషు రచయిత జననం.
1980 : ప్రముఖ ఉత్తర భారత నేపథ్యగాయకుడు మహమ్మద్ రఫీ మరణం (జ.1924).
1880 : భారతదేశపు ప్రముఖ హిందీ, మరియు ఉర్దూ కవి ప్రేమ్‌చంద్ జననం (మ.1936).
2007: ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ కు ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసె అవార్డు లభించింది.
2004 : ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య మరణం (జ.1922).
10. ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము
కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెం : 08494 – 221066, 221366
email: ac_eo_kadiri@yahoo.co.in
31.07.2019 వతేది, *బుధ వారము ఆలయ సమాచారం*
*_శ్రీస్వామి వారి దర్శన వేళలు_*
ఉదయము 5.30 గంటలకు అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ..స్వామి వారి దర్శనము ఉదయము 6.00 గంటల నుండి 7.30 గంటలకు వుండుఅనంతరము ఉదయం 7.30 గం|| నుండి స్వామివారికి అర్జిత అభిషేక సేవ ప్రారంభమగును.
స్వామి వారికి *_ఆర్జిత అభిషేకము_* సేవా, సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటలనుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు… తిరిగి సర్వ దర్శ ఉదయము 10.00 గంటల నుండి మ. 12.00 వరకు వుండును..రెండవ మహాగంట నివేదనమ.12.00 నుండి 12.30 లోపు, బాలబోగ్యం త్రికల నైవేద్యాము సమర్పణ..మ. 12.40 నుండి 1.30 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును.. మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.30 నుండి 7.00 లోపు, బాల బోగ్యం త్రికల నైవేద్యాదులు సమర్పణ. మహ మంగళ హారతి, పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ.. తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 7.00 గంటల నుండి రా.8.30 వరకు వుండును.. రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
*ఆర్జిత సేవాల వివరములు
*31.07.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్:1711. ఆగస్టులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలుటిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి ఆగస్టు 1న శ్రీ చక్రత్తాళ్వార్ శాత్తుమొర, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణన్ శాత్తుమొర. ఆగస్టు 3న శ్రీ ఆండాళ్ తిరువడిపురం శాత్తుమొర సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారు శ్రీవారి పాదాల మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు. రిగి వచ్చే క్రమంలో చిన్నజీయర్‌స్వామి మఠానికి చేరుకుని ఆస్థానం చేపడతారు. ఆగస్టు 4న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. ఆగస్టు 7న ఆడి స్వాతి రోజున సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. ఆగస్టు 9న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆగస్టు 12న తులసి మహత్యం ఉత్సవం జరుగనుంది. సందర్భంగా ఉదయం 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు గరుడ వాహనంపై దర్శనమిస్తారు. ఆగస్టు 14న శ్రవణ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 15న శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఉదయం 6.30 గంటలకు శ్రీవారు, శ్రీ కృష్ణస్వామివారు కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేస్తారు. తిరిగి సాయంత్రం ఆలయానికి చేరుకుంటారు. ఆగస్టు 16, 31వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆగస్టు 23న గోకులాష్టమి ఆస్థానం. ఆగస్టు 24న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 26న చిన్నవీధి ఉట్లోత్సవం సందర్భంగా సాయంత్రం 7 గంటలకు శ్రీవారు, శ్రీకృష్ణస్వామివారు మాడ వీధుల్లో భక్తులను కటాక్షిస్తారు. ఆగస్టు 27న పెద్దవీధి ఉట్లోత్సవం సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీవారు, శ్రీకృష్ణస్వామివారు మాడ వీధుల్లో భక్తులను కటాక్షిస్తారు.
శుక్రవారం అన్నవరంలో ఆవిర్భావ వేడుకలు
Related tags :