Food

వైన్ పరిమితంగా తీసుకుంటే…

వైన్ పరిమితంగా తీసుకుంటే...A glass of good red wine keeps all health problems away

పరిమితంగా రెడ్ వైన్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని పలు పరిశోధనల్లో వెల్లడవగా తాజాగా రెడ్ వైన్లో ఉండే ఓ పదార్ధం కుంగుబాటు, యాంగ్జైటీల నుంచి ఉపశమనం కలిగిస్తుందని తేలింది. రెడ్ వైన్ తయారీలో ఉపయోగించే ద్రాక్షలో ఉండే పదార్ధం ఈ వ్యాధులను నిలువరిస్తుందని ఎలుకలపై చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. కుంగుబాటు, యాంగ్జైటీలను ప్రేరేపించే ఎంజైమ్ను రెడ్ వైన్లో ఉండే రిస్వరట్రాల్ అడ్డుకుందని పరీక్షల్లో వెలుగుచూసింది.ఈ పరిశోధనలో వెల్లడైన అంశాలు డిప్రెషన్, ఎంగ్జైటీలో నూతన చికిత్సలకు దారితీస్తాయని భావిస్తున్నారు. ఈ రెండు వ్యాధులపై రిస్వరట్రాల్ ప్రభావాన్ని యూనివర్సిటీ ఆఫ్ బఫెలో శాస్త్రవేత్తలు ఎలుకలపై పరీక్షించడం ద్వారా అంచనా వేశారు. క్యాన్సర్, అర్ధరైటిస్, డిమెన్షియా సహా పలు వ్యాధులను ప్రభావవంతంగా ఎదుర్కొనే సామర్ధ్యం రిస్వరట్రాల్కు ఉందని చాలా కాలంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.వేరుశెనగ పప్పులోనూ ఉండే రిస్వరట్రాల్ శరీరంలో వాపు ప్రక్రియను తగ్గిస్తుందని పలు అథ్యయనాల్లో వెల్లడైంది. హాని చేసే కొవ్వులను నియంత్రించడం, మెదడు పనితీరును మెరుగుపరచడం, బీపీని నియంత్రించడంలోనూ ఇది మెరుగ్గా పనిచేస్తుందని పలు అథ్యయనాల్లో వెలుగుచూసింది. వైన్లో తక్కువ పరిమాణంలో ఉండే రిస్వరట్రాల్ను సప్లిమెంటరీలుగా అందిచడంపైనా పలు అథ్యనాలు జరుగుతున్నాయి.