Kids

పిల్లలు తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు

Telugu Kids Moral Stories-Kids Learn From Their Parents...పిల్లలు తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు

చిన్నారులు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే… వాళ్లకు ఫోన్లు ఇవ్వడం కన్నా శారీరక శ్రమను పెంచే దిశగా ప్రయత్నించాలి. అదెలాగంటే…
ఆటలు… క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌, ఈత, కబడ్డీ…. ఏదైనా సరే పిల్లలకు నచ్చిన ఆటల్లో చేర్పించండి. ఇవి మీ చిన్నారిని చురుగ్గా మారుస్తాయి. కొత్త స్నేహితులూ పరిచయమవుతారు. భవిష్యత్తులో భిన్న మనస్తత్వం ఉన్న వ్యక్తులతో ఎలా మెలగాలో తెలుసుకుంటారు.
డ్యాన్స్‌… శరీరాన్ని వేగంగా కదిలించడం వల్ల వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బలంగానూ తయారవుతారు. ఓ గంటపాటు డాన్స్‌ చేయడం వల్ల ఎక్కువ సంఖ్యలో కెలొరీలు ఖర్చవుతాయి.
కలిసి నడవండి… ఇంట్లో చిన్నచిన్న పనుల్ని వాళ్లచేత చేయించండి. కుదిరినప్పుడల్లా మీరు నడుస్తూ… వారినీ మీ వెంట తీసుకెళ్లండి. శరీరానికి వ్యాయామం అందడమే కాదు… మీ మధ్య అనుబంధమూ పెరుగుతుంది.
ఆదర్శంగా… చిన్నారులు చాలా విషయాలు తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. మీరు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తే వారూ అదే అనుసరిస్తారు. వ్యాయామం… మీరు మొదలుపెడితే వాళ్లూ చేస్తారు. కుదిరినప్పుడల్లా వారితో కలిసి ఆడండి. దగ్గర్లోని పార్కుకు తీసుకువెళ్లండి.
పోషకాహారం… ఆహారం విషయంలోనూ మార్పులు చేయండి. వీలైనంతవరకూ పోషకాహారమే వండి వడ్డించాలి. పిల్లలకు మొదట్లో ఇది నచ్చకపోవచ్చు కానీ… క్రమంగా మిమ్మల్ని చూసి అలవాటు చేసుకుంటారు.