DailyDose

వైకాపా ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు-నేరవార్తలు–08/12

Criminal Case Lodged On YSRCP MLA-Telugu CrimeNews Today-Aug122019

*వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి జమీన్ రైతు వారపత్రిక అధినేత డోలేంద్ర ప్రసాద్ మీద కోటంరెడ్డి దాడి చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కోటం రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా.. ఓపత్రికాధినేత పై కోటంరెడ్డి వ్యవహరించిన తీరుపై టీడీపీ, బీజేపీ, సీపీఎం పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మీడియాపై దాడులకు నిరసనగా జర్నలిస్ట్ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాయి. కోటం రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పలువురు జర్నలిస్ట్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కాగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కూడా కోటంరెడ్డిపై సీఎం జగన్ కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
*కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులో విషాదం జరిగింది. పొలం పనులకోసం వెళ్లిన ఇద్దరు రైతులు విద్యుత్ షాకుకు బలయ్యారు. చలసాని కృష్ణమూర్తి, కోగంటి లీలాప్రసాద్ అనే ఇద్దరు రైతులు పొలంలో పనులు చేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి షాక్ కు గురై చనిపోయారు.
*సాగర్ డ్యాం వద్ద వ్యక్తీ మృతి
నాగార్జున సాగర్ డ్యాం వద్ద సోమవరం విషాదం చోటు చేసుకుంది. సాగర్ పర్యటనకు వచ్చిన ఓ వ్యక్తి నీటిలో గల్లంతు అయ్యాడు. సాగర్ ప్రాజెక్టు పూర్తీ స్థాయిలో జలకాలా సంతరించు కుంది. అధికారులు గేట్లు వదిలి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ఆ దృశ్యాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు సాగర్ బాట పట్టారు. అయితే సాగర్ దిగువన శివాలయం ఘాట్ వద్ద కొందరు వ్యక్తులు ఈతకు దిగారు. అందులో ఓ వ్యక్తీ నీట ప్రవాహంలో చిక్కుకుపోయాడు. చాలాసేపు ఒడ్డుకు చేరేందుకు తీవ్రంగా యత్నించాడు. అయితే పై నుంచి ప్రవాహం అధికంగా ఉండటంతో ఆటను నీటి ఉద్రుతికి కొట్టుకుపోయాడు. పక్కన ఉన్నవారు కూడా చేసేది ఏమీ లేక ఉండిపోయారు. గల్లంతైన వ్యక్తిని జహీరాబాద్ కు చెందిన నరసిమ్గంగా గుర్తించారు. అయితే ప్రమాదం జరగక ముందు నరసింహం తన స్నేహితులాటి సరదాగా కలిసి ప్రాజెక్టు పరిసరాల్లో ఫోటోలు దిగారు.
*అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఎరీ నగరంలో విషాదం చోటు చేసుకుంది. హ్యారిస్ ఫ్యామిలీ పిల్లల సంరక్షణ(డే కేర్) కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
*ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఊర్వశి థియేటర్ సమీపంలోని మద్దుల అనంత రామిరెడ్డి కి చెందిన బొరుగుల బట్టి లో ఈరోజు తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించిందిఈ ప్రమాదంలో బొరుగుల బట్టి లో ఉన్న విలువైన వస్తువులు కాలి పోయినట్లుగా యజమాని తెలిపాడు
*ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఊర్వశి థియేటర్ సమీపంలోని మద్దుల అనంత రామిరెడ్డి కి చెందిన బొరుగుల బట్టి లో ఈరోజు తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది
*హన్మకొండ లోని సమ్మయ్యనగర్ లో దారుణం.. 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు ఆకతాయిలుబాలిక ఆత్మహత్య.యంజియం మార్చురీకి మృతదేహం తరలింపు
* విశాఖ సముద్రతీరంలోని ఔటర్‌ హార్బర్‌లోని జాగ్వర్‌ టగ్‌లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. టగ్‌లో మంటలను అదుపు చేసేందుకు తీరం నుంచి బోట్లను పంపించారు.
*కరీంనగర్ జిల్లా రాజీవ్ రహదారి పై ప్రమాదం జరిగింది. గన్నేరువరం మండలం గుండ్లపల్లి దగ్గర సైకిల్ ను తప్పించబోయి కిరాన షాపు పైకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్రేన్ సాయంతో కారును బయటకు తీసి క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిమ్కాహ్రు.
*హన్మకొండలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన పోలేపాక ప్రవీణ్‌ (25)కు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఉన్మాదికి ఉరి శిక్షపడిన మరుసటి రోజే ఇలాంటి ఘటన జరగడం స్థానికులను కలవరపెడుతోంది.
*హన్మకొండలో దారుణం జరిగింది. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అవమానాన్ని తట్టుకోలేక ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. హన్మకొండలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
*హన్మకొండ లోని సమ్మయ్యనగర్ లో దారుణం.. 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు ఆకతాయిలుబాలిక ఆత్మహత్య.యంజియం మార్చురీకి మృతదేహం తరలింపు
*యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలనే ఆశతో శ్రుతిమించి ప్రయత్నించి ఓ యువకుడు కటకటాలపాలయ్యాడు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చెల్లూరుకు చెందిన రామిరెడ్డి, రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్, ద్విచక్రవాహనాలు పెట్టి వాటిని రైలు తొక్కినట్లు చిత్రీకరించి, యూట్యూబ్లో పెట్టేవాడు. ఇలాంటి ప్రయత్నాలతో ప్రమాదాలు జరుగుతాయని ట్విటర్ ద్వారా ఓ వ్యక్తి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రామిరెడ్డిని అరెస్టు చేశారు.
*విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. సత్యనారాయణపురం పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా కడతేర్చాడు. ఆమె తలను నరికి హత్య చేశాడు. ఆ తర్వాత భార్య తలను చేత్తో పట్టుకుని రోడ్డుపైకి నడుచుకుంటూ వచ్చాడు.
*పశ్చిమ బంగాల్కు చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుంటూ ఆ ఘటనను ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఈయన దిల్లీ మెట్రో రైలు సంస్థలో (డీఎంఆర్సీ) పని చేసే ఓ ఉద్యోగి కావడం గమనార్హం. దిల్లీలో తాను అద్దెకుంటున్న ఇంట్లో ఆదివారం శుభాంకర్ చక్రబర్తి (27) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
*సెల్ఫోన్ ఛార్జర్ తీగను పట్టుకున్న రెండేళ్ల బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణం దుర్గారావు కాలనీలో చోటుచేసుకుంది.
*బీబీఏ ఇంటర్న్షిప్ కోసం ఉక్రెయిన్ వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి అక్కడ నదిలో మునిగి మృత్యువాతపడ్డాడు. మరికొద్ది గంటల్లో ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి బయలుదేరాల్సి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది.
*ఆదివారం మధ్యాహ్నం 2.17 గంటలు.. విజయవాడ సత్యనారాయణపురం పరిధిలోని శ్రీనగర్కాలనీ 4వ లైను.. చుట్టూ జనం చూస్తుండగానే ఓ వ్యక్తి తన భార్యపై విచక్షణారహితంగా దాడికి దిగాడు.
* శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ‘జమీన్ రైతు’ పత్రిక సంపాదకుడు, సీనియర్ పాత్రికేయుడు డోలేంద్ర ప్రసాద్పై నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి దాడి చేశారు.
*నవమాసాలు మోసి కన్న చిన్నారిని రెండ్రోజులు కాకుండానే ఆసుపత్రిలో విడిచిపెట్టి వెళ్లిపోయిందో అమ్మ.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్కు శనివారం ఉదయం ఓ మహిళ, మరో వ్యక్తి రెండ్రోజుల వయసున్న మగశిశువును తీసుకొచ్చారు.
* అప్పుల బాధ భరించలేక గుంటూరు జిల్లా కొల్లూరు మండలం తిప్పలకట్టకు చెందిన కౌలు రైతు జుట్టా శ్రీనివాసరావు (32) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
*కాకుళం జిల్లా పైడిభీమవరంలోని అరబిందో రసాయన పరిశ్రమలో ఆదివారం ఉదయం పవర్ప్లాంట్ వద్ద బాయిలరు పేలడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.
*కన్యాకుమారి నుంచి హావ్డా వెళ్తున్న (12666 నెంబర్) ఎక్స్ప్రెస్లో ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఊపిరాడక మృతి చెందిన ఘటన ఆదివారం విశాఖ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది.
*వివాహితుడి లైంగిక వేధింపులు తాళలేక ఓ ఇంటర్ విద్యార్థిని(17) బలవన్మరణానికి పాల్పడింది. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
* ఒడిశాకు చెందిన ఓ వివాహిత గుంటూరులో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేకపోవటంతో తనకేం జరిగిందో చెప్పలేకపోతోంది.
*ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పొట్టంగిలో సారా తయారీ విక్రయ కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించారు.
*అభంశుభం తెలియని 9 సంవత్సరాల కుమార్తెపైనే…అత్యంత అనాగరికంగా రెండేళ్లపాటు పదేపదే అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
*ఆదాయపన్ను అధికారులు శనివారం తమిళనాడులో మెరుపు దాడులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 55 ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టగా రూ.700 కోట్ల మేర వెల్లడికాని ఆదాయం వెలుగుచూసినట్టు శనివారం ఐటీ అధికారులు వెల్లడించారు.
* పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ప్రభుత్వ ఉపాధ్యాయుడే మోసానికి తెరదీసిన ఉదంతమిది. చనిపోయే వ్యక్తిపై రూ.50 లక్షలకు బీమా చేయించి ఆ సొమ్మును కాజేయాలని చూశాడు.
*కాశం జిల్లా సింగరాయకొండలో చిత్తు కాగితాలు ఏరుకునేవారికి పది రోజుల కిందట ఓ వెండి కిరీటం దొరికింది. దాన్ని వారు స్థానిక బంగారు వర్తకుడికి చూపించారు. ఆయన పరిశీలించి ఆ కిరీటం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చమళ్లమూడిలోని చంద్రశేఖరస్వామి ఆలయానికి చెందినదిగా గుర్తించారు.
*ఒంగోలు నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ భర్త హత్యాహత్యానికి పాల్పడిన ఘటన ఒంగోలు వీఐపీ రోడ్లో శనివారం కలకలం రేపింది.