Editorials

ఇక పెద్దపులులు కనిపించవంట

Tigers Will Go Extinct In India

‘నాయనా పులివచ్చె’ కథలిక విన్పించకపోవచ్చు.ఎందుకంటే అసలు పెద్దపులి జాతే కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. అదెలాగంటారా? వందేళ్లకు పూర్వం భూమ్మీద లక్ష పెద్దపులులు ఆకుపచ్చలోకాలలో లక్షణంగా జీవించాయట. కానీ ఇప్పుడు వ్యాఘ్రాల సంఖ్య కొన్ని వేలల్లోనే ఉంది. ఆగ్నేయాసియాలో వీటి ఉనికే ప్రశ్నార్థకమైంది.పులిచర్మాలకు, గోళ్లకు, ఎముకలకు ఉన్న అంతర్జాతీయ గిరాకీ కారణంగా వేటగాళ్లు విజృంభించారు. కొత్త శతాబ్దారంభం నుంచి నేటిదాకా కేవలం 19 ఏళ్లలో 2,300 పులులు వధకు గురయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయవచ్చు.ఏటా సగటున అక్రమరవాణాదార్ల నుంచి అదికారులు 120 పులులను స్వాధీనపర్చుకుంటున్నారు. 2000 సంవత్సరం నుంచి వారానికి 2 పులులను పట్టుకుంటున్నారు. 1900 సంవత్సరంలో భూమిమీద లక్ష పులులు సంచరించాయని అంచనా వేశారు. ఆగ్నేయాసియాలో అక్రమ రవాణాదార్లు ప్రైవేటుగా పులిసంతతి వృద్ధికేంద్రాల ఏర్పాటు చేస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి 2018 వరకు స్వాధీనం చేసుకున్న పులులలో 2,359 పులులు కొందరు ఇలా పెంచుకుంటున్నవే. వాటి శరీర భాగాలకు ఉన్న గిరాకీ కారణంగానే వ్యాఘ్రాల వధసాగుతోంది. జెనీవాలో జరుగుతున్న వన్యప్రాణి సంరక్షణ సదస్సు సందర్భంగా ఆగ్నేయాసియా పెద్దపులుల సంరక్షణ వ్యవహారాల అధిపతి కణితా కృష్ణమూర్తి ఆసక్తిదాయక అంశాలతో ఒక నివేదిక విడుదల చేశారు. గత 19 ఏళ్ల గణాంక సమాచారాన్ని విశ్లేషించారు.
* 1900లో భూమిపై ఉన్న పులులు లక్ష.
* 2010 గణాంకాల ప్రకారం మిగిలినవి 3,900.