Movies

బాలకృష్ణ సరికొత్త లుక్ అదుర్స్

NBK 105 New Looks Shaking Social Media

తన 105వ సినిమా కోసం స్టైలిష్‌గా మారిన నందమూరి బాలకృష్ణ ఈసారి జోడీగా అభిమానుల ముందుకు వచ్చారు. సోమవారం వినాయకచవితి సందర్భంగా కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పోస్టర్లను నేడు విడుదల చేశారు. ఇందులోని ఓ పోస్టర్‌లో బాలయ్య రొమాంటిక్‌ యాగింల్‌ను చూపించారు. ముద్దుగుమ్మ సోనాల్‌ చౌహాన్‌ ఆయన సరసన కనిపించారు. మరో పోస్టర్‌లో బాలయ్య సూటుబూటుతో హ్యాండ్సమ్‌ లుక్‌తో సందడి చేశారు. చిత్ర బృందం అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపింది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా ఇది. హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. బాలయ్య, సోనాల్‌ ఇప్పటికే ‘లెజెండ్‌’, ‘డిక్టేటర్‌’ సినిమాల కోసం జంటగా నటించిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది కావడం విశేషం.