Movies

నాజుకు నడుము కోసం పాట్లు

Ileana Working Hard For Losing Weight

సన్నటి నడుముతో కుర్రకారు మనస్సు దోచుకున్న నటీమణి ఇలియానా బాయ్‌ ఫ్రెండ్‌కు దూరమయ్యారట. ఓ విదేశీయుడితో ప్రేమలో పడ్డ ఈ అమ్మడు అతనిని బాయ్‌ఫ్రెండ్‌గా గతంలో పరిచయం చేసుకున్నారు. ఆయనతోనే ఇంతకాలం విదేశాలలో గడిపారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా అతనితో సంబంధాలు వదులుకొని తిరిగి ఇటీవల సినిమా పరిశ్రమకు మళ్లీ వచ్చారు. అవకాశాలు కోరుతూ దర్శకుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ.. ఆమె ఇప్పటికే బాగా బొద్దుగా మారిపోయిన కారణంగా బరువు తగ్గించుకోవాలని దర్శకులు సూచించారట. దీంతో ఆమె బరువు తగ్గించుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తున్నారన్నారు. ప్రతిరోజు జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తున్నట్లు సూచించారట.