Business

ఆర్థిక మాంద్యం సూచనలు విస్తృతం

Indian Markets Experiencing Recession Flavors

ఆర్థిక మందగమనం ప్రభావం క్రమంగా విస్తరిస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి.

ఉత్పత్తికి తగ్గ డిమాండ్ లేకపోవడంతో హర్యానాలోని మారుతి సుజికి ఇండియా లిమిటెడ్ రెండు రోజుల పాటు తమ వాహనాల ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది.

గురుగావ్, మనెసార్ ప్లాంట్‌ను ఈనెల 7, 9 తేదీల్లో మూసివేయనుంది. ‘నో ప్రొడక్షన్ డే’గా ఆ రెండు రోజులను ప్రకటించాలని నిర్ణయించింది.

ఉత్పత్తి నిలిపివేయడం వల్ల తాత్కాలిక ఉద్యోగులపై మాత్రమే ఈ ప్రభావం ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.