DailyDose

విజయవాడ-విశాఖ కొత్త విమాన సర్వీసు-తాజావార్తలు–09/05

New Flight Service Between Vizag-Vijayawada-Telugu Breaking News-09/05

*విజయవాడ-విశాఖ మధ్య ఎయిర్ ఇండియా నూతన విమాన సర్వీసును నడపనున్నట్లు ఏపీ ఎయిర్ సర్వేసును నడపనున్నట్లు ఏపీ ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నరేష్ కుమార్ తెలిపారు. ఈ సర్వీసు విజయవాడలో రాత్రి 7.55 గంటలకు బయలుదేరి 8.55 గంటలకు విశాఖ చేరుతుంది.
*రాష్ట్రంలో క్రమంగా ప్రెవేటు బస్సు సర్వేసులు తగ్గాలని ఆర్టీసీ సర్వీసులు కచ్చితంగా పెరగాలని ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు.
* తెలంగాణలోనే అతి పెద్ద దేవాలయమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాళేశ్వరం జలాలను మిడ్ మానేరు ద్వారా వేములవాడ గుడి చెరువులోకి ఇవాళ ఉదయం వదిలారు.
* ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన మంగాయమ్మ(73) అనే వృద్ధురాలు కవల పిల్లలకు జన్మనిచ్చారు. గుంటూరులోని అహల్య నర్సింగ్ హోమ్‌లో మంగాయమ్మ ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది. డాక్టర్ శనక్కాయల అరుణ, ఉమా శంకర్ శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేశారు. 1992లో వివాహమైన మంగాయమ్మ ఏళ్లు గడిచినా తల్లి కావాలనే కోరిక తీరలేదు.
*దేశంలో డిజిల్, పెట్రోల్ కార్లను నిషేదించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని రోడ్డు రావాన, హైవేల మంత్రి నితిన్ గడ్కారి స్పష్టం చేశారు. దేశ ఎగుమతులు, ఉపాధి రంగంలో ఆటో మొబైల్ రంగం పాత్రను ప్రభుత్వం గుర్తెరిగిందని పేర్కొన్నారు. ఎగుమతుల్లో అటో మొబైల్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
*మూడు నెలలుగా ఆందోళననుతో అట్టుడుకుతున్న హాంకాంగ్ లో శాంతి పవనాల దిశగా తోలి అడుగు పడింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని చ్వ్హైనా సహా ఇతర దేశాలకు అప్పగించేందుకు ఉద్దేస్సించిన నేరస్తుల అప్పగింత బిల్లును ఉప సంహారించానున్నట్లు హాంకాంగ్ ముఖ్య కార్య నిర్వహణ అధికారిని కెరీ లం ప్రకటించారు.
*మనిషి చేతిలాంటి లక్షణాన్ని కలిగి ఉన్న ఎలక్ట్రానిక్ తొడుగు.. ఈ-గ్లోవ్ ను శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. కృతిమ చేతికి తోడుక్కోవడం ద్వారా పలు ప్రయోజనాలు పొందవచ్చు. మనిషి చేతి మాదిరిగానే ఒత్తిడిని ఉష్ణోగ్రతను గుర్తించే సామర్ధ్యం ఈ-గ్లోవ్ కు ఉంటాయని అమెరికాలోని పద్యూ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
*జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంపీడీపీ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కుమార్తె సనా ఇల్తిజాకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. గృహ నిర్బంధంలో ఉన్న తన తల్లిని వ్యక్తిగతంగా కలుసుకునేందుకు అనుమతించింది. నెల రోజులుగా తాను తల్లిని కలుసుకోలేదనీ.. ఆమె ఆరోగ్యంపై ఆందోళనగా ఉందంటూ సనా దాఖలు చేసిన పిటిషన్ మేరకు సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఆర్టికల్ రద్దుకు ఒకరోజు ముందు ఆగస్టు న మెహబూబా ముఫ్టీఒమర్ అబ్దుల్లా సహా వందలాది మంది రాజకీయ నేతలుకార్యకర్తలను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
*రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం లేఖ రాశారు. 5వ తరగతి విద్యార్థులు 3వ తరగతి తెలుగు వాచకాన్ని చదవలేకపోతున్నారన్నారు.
*హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా నియమితుడైన బండారు దత్తాత్రేయ 9న బాధ్యతలు చేపట్టనున్నారు. 8న ఆయన ఇక్కడినుంచి బయలుదేరి సిమ్లా చేరుకుంటారని, సోమవారం ఉదయం గవర్నర్గా ప్రమాణం చేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా దత్తాత్రేయను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయకు పాదాభివందనం చేశారు. ఇదిలా ఉండగా దత్తాత్రేయ సోమవారం సాయంత్రం తెలంగాణ గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు.
*చదువుకోవాలనే ఆసక్తి గల వారి కోసం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీవోఎస్ఎస్) విద్యావకాశాన్ని కల్పిస్తోందని ఏపీవోఎస్ఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ ఎం.రామకృష్ణ తెలిపారు. పదో తరగతిలో ప్రవేశానికి ఈఏడాది ఆగస్టు 31 నాటికి 14 సంవత్సరాల వయస్సు, ఇంటర్కు 15 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలన్నారు.
*నిబంధనలను ఉల్లంఘించి, లేదా అనుమతి పొందిన ప్లాన్లకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం)-2019కు రాష్ట్రవ్యాప్తంగా 41,462 దరఖాస్తులు అందాయి. దీనికి గత నెలాఖరుతో గడువు ముగిసింది. అధికారులు వీటిని పరిశీలిస్తున్నారు. అత్యధికంగా కృష్ణాజిల్లాలో 7800, అత్యల్పంగా కడపలో 617 దరఖాస్తులొచ్చాయి. అపరాధ రుసుముగా ఇప్పటి వరకూ ప్రభుత్వ ఖజానాకు రూ.118.37 కోట్లు జమయ్యాయి.
*తెలుగువారి వారసత్వాన్ని ప్రతిబింబించే ఆంధ్రా బ్యాంక్ను యథాతథంగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు.
* ఈ నెల 7వ తేదీన గవర్నర్‌ నరసింహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు సభ నిర్వహించనుంది. ఈ వేడుకకు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. 8వ తేదీన కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో 7వ తేదీనే గవర్నర్‌ నరసింహన్‌కు ప్రభుత్వం వీడ్కోలు సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
* లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ6 నోట్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.7,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 11వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం కానుంది.