DailyDose

కాంగ్రెస్‌లో కపట సూత్రధారి డికే శివకుమార్-రాజకీయ-09/05

DK Shivakumar Is The Shrewd Congress Leader-Telugu Political News-09/05

* ఎస్‌‌.ఎం.కృష్ణ కర్నాటక సీఎంగా ఉన్నప్పుడు 2001లో ట్రబుల్‌‌ షూటర్‌‌ లక్షణాలను ప్రదర్శించడానికి డీకేకు అవకాశం వచ్చింది. ఎస్‌‌.ఎం.కృష్ణ కర్నాటక సీఎంగా ఉన్నప్పుడే… మహారాష్ట్ర లో విలాసరావ్‌‌ దేశ్‌‌ముఖ్‌‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడి అధికార కాంగ్రెస్‌‌-, ఎన్సీపీ కూటమి కూలిపోయింది. కృష్ణ సాయాన్ని దేశ్‌‌ముఖ్‌‌ అడిగారు. దేశ్‌‌ముఖ్ ను గద్దెనెక్కించే బాధ్యతను డీకేకు అప్పగించారు కృష్ణ. మహారాష్ట్ర ఎమ్మెల్యేలను బెంగళూరుకు తీసుకుకొచ్చి ఈగల్టన్‌‌ రిసార్ట్‌‌లో వారం రోజులు ఉంచారు శివకుమార్‌‌. విశ్వాస పరీక్ష రోజున వాళ్లను తిరిగి ముంబైకి తీసుకెళ్లారు. ట్రస్ట్‌‌ ఓటులో దేశ్‌‌ ముఖ్‌‌ గెలిచారు. దీంతో శివకుమార్‌‌ కాంగ్రెస్‌‌ చీఫ్‌‌ సోనియాగాంధీ అభిమానం పొందారు.
*పవన్ పై విజయసాయిరెడ్డి సెటైర్లు
రాష్ట్ర ప్రభుత్వం పై జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న దుష్ప్రచారం పై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైకాపా పై పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలను ట్విట్టర్ ద్వారా విజయసాయిరెడ్డి ఖండించారు. టీడీపీతో గేమ్ ప్లాన్ లో భాగంగానే పవన్ వైకాపా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని అన్నారు.
* కేసీఆర్‌ పని అయిపోయింది: కోమటిరెడ్డి
వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ ఆవేదనతో చేసిన వ్యాఖ్యల ద్వారా సీఎం కేసీఆర్‌ పని అయిపోయినట్లు తెలంగాణ సమాజానికి అర్థమైందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో విలేకరులతో మాట్లాడుతూ, ‘కులం పేరుతో తనకు మంత్రిపదవి రాలేదని, తెలంగాణకోసం కొట్లాడిన ఓనర్లమని’ మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యల ద్వారా తెలంగాణ కేసీఆర్‌ ఒక్కడి సొంతం కాదని అర్థమ వుతుందని తెలిపారు. ఈటలతోపాటు, సీనియర్‌ నాయకుడు హరీశ్‌ రావు లాంటి వాళ్లు పార్టీమారే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పార్టీమారితే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు తమ పార్టీ కార్యకర్తలు పడిన బాధేంటో వారికి తెలుస్తుంద న్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చుచేస్తున్న కేసీఆర్, బి.వెల్లెంల ప్రాజెక్టుకు రూ.200 కోట్లు కేటాయించడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు.
*ఎ మహిళకు అలంటి పరిస్థితి రాకూడదు- జగన్
రాష్ట్రంలోని ఎ మహిళకూ అవమానాలు ఎదుర్కొనే పరిస్థితిలు రాకూడదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి మేకతోటి సుచరిత తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి జగన్ ను కలిశారు. వినాయకచవితి రోజున చోటు చేసుకున్న ఘటనను శ్రీదేవి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కులం పేరుతొ తనను దూశించారంటూ ఆయన వద్ద వాపోయారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతో రాష్ట్ర్మలో ఎ మహిళకూ ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. ఎ పార్టీకి చెందినవారికైనా ఇలాంటి అవమానకర పరిస్థితులు ఎదురు కకూదదన్నారు. ఎ పార్టికి చెందిన వారికైనా ఇలాంటి అవమానకర పరిస్థితులు ఎదుట రాకూడదు అన్నారు.
*టీడీపీకి ఆడారి ఆనంద్ రాజీనామా
విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్, కుమార్తె పిళ్లా రమాకుమారి శుక్రవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆనంద్ ప్రస్తుతం ఎలమంచిలి పట్టణ టీడీపీ అధ్యక్షునిగా, రమాకుమారి పార్టీ సభ్యురాలిగా ఉన్నారు. గడచిన ఎన్నికలలో ఆనంద్ అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి టీడీపీ పక్షాన పోటీ చేసి ఓటమి చెందారు. రమాకుమారి ఎలమంచిలి మునిసిపల్ చైర్పర్సన్గా పనిచేశారు. ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్న నేపథ్యంలో వీరిరువురూ టీడీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నట్టు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు పంపిన లేఖలో పేర్కొన్నారు. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆనంద్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
*వైసీపీ-బీజేపీ ట్విటర్వార్!
మిత్రపక్షాలు వైసీపీ, బీజేపీ మధ్య ప్రస్తుతం ట్విటర్ వార్ నడుస్తోంది. ఇటీవలి కాలంలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీజేపీ నేతలు.. ఏ చిన్న అవకాశం దొరికినా వదలడంలేదు. ట్విటర్లోనూ విరుచుకుపడుతున్నారు. వైసీపీ సైతం అదే స్థాయిలో బదులిస్తోంది. వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నడుమ ఇప్పటికే ట్వీట్ల వార్ నడుస్తుండగా.. ఇప్పుడు బీజేపీ ఎంపీలు సీఎం రమేశ్, సుజనాచౌదరి.. అటు వైసీపీ నుంచి అంబటి రాంబాబు కూడా ఈ యుద్ధంలోకి దిగారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే జగన్ నిన్నటి వరకూ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారని సీఎం రమేశ్ బుధవారం చేసిన ట్విటర్కామెంట్ కలకలం రేపింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం జగన్ అక్కడ ఒక కార్యక్రమానికి వెళ్లినప్పుడు జ్యోతి ప్రజ్వలనకు ఆయన్ను నిర్వాహకులు ఆహ్వానించారు.
*ఏకపక్షంగా వెళ్లొద్దంటున్నాం: కన్నా
పోలవరం విషయంలో ఏకపక్షంగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మొదటి నుంచీ బీజేపీ చెబుతూనే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. రివర్స్ టెండరింగ్ విషయంలో కేంద్రం చేసిన సూచనలను ఆయన పట్టించుకోలేదని తప్పుబట్టారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో గోశాలలో గురువారం జరిగిన విశ్వశాంతి యజ్ఞానికి ఆయన హాజరయ్యారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని ముందు నుంచి చెబుతున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పని తేలిపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏ విషయాన్నీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీ దృష్టికి తీసుకెళ్లలేదని ఆక్షేపించారు.
*అవినీతిపై చర్యలేవీ: మాణిక్యాలరావు
పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో ప్రకటించడంలేదు.. అవినీతిని బయటపెట్టడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ గానీ, కేబినెట్ సబ్ కమిటీ గానీ ఇంత వరకు రికవరీ చేయలేదు. ఎక్కడా ఒక కేసు కూడా నమోదు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు దుయ్యబట్టారు. గురువారం భీమవరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం, ఇతర ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడిననాయకులు, అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షం, అధికారపక్షం ఏకమై ఒప్పందం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల పనులు నిలుపుదల చేశారని, సెక్యులర్ దేశంలో ఇమామ్లకు, పాస్టర్లకు జీతాలు ఇవ్వడం ద్వారా మత ప్రచారం చేసుకోవడం కోసం ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
*అబద్ధాలాడినందుకు జగన్ క్షమాపణ ఎప్పుడు?: లోకేశ్ ట్వీట్
‘ఎలాగైతేనేం.. చంద్రబాబు హయాంలో 9,56,263మందికి ఉద్యోగాలు వచ్చాయన్న వాస్తవాన్ని వైసీపీ అంగీకరించిం ది. బాబు వచ్చారు.. జాబు వచ్చిందని జగన్ ప్రభుత్వ మే ప్రకటించింది’ అని టీడీపీ జాతీయ ప్ర ధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం ట్వి టర్లో పేర్కొన్నారు. ‘ఇదివరకు శాసనసభ సాక్షిగా పరిశ్రమల శాఖ ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ, ఎలక్ర్టానిక్స్ శాఖల ద్వారా 30,428 ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ వాళ్లే చెప్పారు. ఇప్పుడు 137 కంపెనీల ద్వారా 2,78,586ఉద్యోగాలు, మెగా ప్రాజెక్టుల ద్వారా 1,33,898 ఉద్యోగాలు వస్తున్నాయని శ్వేతప త్రంలో పేర్కొన్నారు. అంటే బాబు వచ్చారు.. జాబు వచ్చిందని ప్రభుత్వమే ప్రకటించింది. బాబు హయాంలో ఒక్క ఉద్యోగం రాలేదని అబద్ధమాడిన జగన్ ప్రజలకు ఎప్పుడు క్ష మాపణ చెప్తున్నారు’ అని ప్రశ్నించారు.
*కార్పొరేట్కు ఊడిగం చేసేందుకే విలీనం: సీపీఐ రామకృష్ణ
కార్పొరేట్ రంగానికి ఊడిగం చేసేందుకు బ్యాంకుల విలీనం పేరిట కేంద్ర ప్రభుత్వం కొన్నింటిని పెద్ద బ్యాంకులుగా మారుస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. ఆంధ్రాబ్యాంక్ను యూబీఐలో విలీనం చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు ఆంధ్రా బ్యాంకు ప్రధానశాఖ ఎదుట మంగళవారం సీపీఐ, సీపీఎం సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టాయి. నిరసన కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నేతలు పాల్గొన్నారు.