DailyDose

భాజపాకు వైకాపా బద్దశత్రువు-రాజకీయ–09/05

.YSRCP Is Big Enemy To BJP - Telugu Political News Today

* ఏపీలో వైకాపాకు తమ పార్టీ వంద శాతం వ్యతిరేకమేనని ప్రభుత్వ లోపాలము ప్రస్నించడంలో ముందుంటామని భాజపా ప్రదాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. దిల్లిలోని భాజపా ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో ఇష్టా గోస్తి మాట్లాడారు. ఏపీలో ప్రభుత్వ పాలన లోపాలపై పోరాడతామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రిచంద్రబాబు రాజకీయాల్లో లోగడ పోషించిన పాత్ర భవిష్యత్తులో పోషించే అవకాశం ఎంత మాత్రం, లేదని అన్నారు. ఆయన వారసుడు సమర్ధుడు కాకపోవడం, తేదేపాకు భవిష్యతు లేనందునే ఆపార్టీ నాయకులూ భాజపాలో చేరుతున్నారని తెలిపారు. తెదేపాను చంద్రబాబును విమర్శించక పోవడాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదని అన్నారు,. ఏళ్లుగా తెదేపాలో కొనసాగడం చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేకపోవడంతో వారు విమర్శలు చేయడం లేదని వివరించారు. వాగ్దానాల అమలులో తెరాస ప్రభుత్వం విఫలమవడం కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడం తేదేపాకు భవిష్యత్తు లేకపోవడంతో తెలంగాణాలో అంతా భాజపా గూటికి చేరుతున్నారని తెలిపారు.
* 100 రోజుల పాలన భేష్ …
మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదుజగన్మోహనరెడ్డి గారి వందరోజులు పాలన లో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు అన్నారుశుక్రవారం గోల్లపూడి పార్టీ కార్యాలయంలో జగన్మోహనరెడ్డి పాలన వంద రోజులు పూర్తయిన సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారుఈ సందర్భంగా కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి గారి వంద రోజులు పాలన గురించి కొనియాడారుపేదల సంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారుఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
*శిబిరాన్ని సందర్శించిన లోకేష్
వైకాపా బాధితుల పునరావాస శిభిరాన్ని సందర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ .బాధితుల వివరాలను శిబిరం ఇన్ చార్జ్ నక్కా ఆనంద బాబు ను అడిగి తెలుసుకున్న నేతలు.
గ్రామాల్లో వైకాపా నాయకులు,పోలీసులు వ్యవహరించిన తీరు,కార్యకర్తల పడిన కష్టాలను అడిగి తెలుసుకున్న లోకేష్ కార్యకర్తలకు అండగా ఉంటాం అని భరోసా
*జగన్ పరిపాలన అద్వానం
రాష్ట్రంలో పది మంది ముఖ్యమంత్రులు పని తీరును దగ్గర్నుండి సునిశితంగా పరిశీలించిన అనుభవం తనకు ఉందని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్, నేదురుమల్లి తదితరుల పేర్లను ప్రస్తావిస్తూ జగన్ అంత దారుణంగా, ఆటవికంగా ఏ ముఖ్యమంత్రి పరిపాలించ లేదని తెలుగుదేశం అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు శుక్రవారం జిల్లా పార్టీ నాయకులతో బ్రేక్ ఫాస్ట్ ఆరగించారు. వారితో కీలక అంశాలపై చర్చించారు. గురువారం రాత్రి నగరంలోని జిఆర్టి గ్రాండ్ హోటల్ లో బస చేసిన చంద్రబాబు శుక్రవారం ఉదయం జిల్లా ముఖ్య నేతలను తన వద్దకు ఆహ్వానించారు. వారితో జిల్లాలో పార్టీ పరిస్థితి పై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర చరిత్రలో ఒక్కసారి గెలిచిన సీఎంగా జగన్ పేరు నిలబడిపోతుంది అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అదేవిధంగా జిల్లా పార్టీలో కొందరు నాయకులు స్తబ్దుగా ఉన్నారు అంటూ కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు జిల్లాకు సంబంధించి కీలక నేతలు ఓ కమిటీ గా ఏర్పడాలని సూచించారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమావేశాలు జరుపుకొని నిర్ణయాలు తీసుకోవాలని, యావత్ పార్టీ యంత్రాంగాన్ని ఉత్సాహపరిచే లా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కమిటీ హైదరాబాద్, అమరావతి లో ఎప్పుడైనా తనను కలవచ్చు అని అదే విధంగా తాను కూడా వారిని కలిసి చర్చిస్తామని వివరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన, ఆధునిక సౌకర్యాలతో జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారంటూ నేతలను అభినందించారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ఉండాలని సూచించారు. ఈ నెల 11న చలో ఆత్మకూరు కార్యక్రమం తలపెట్టామని ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తరలి రావాలని బాబు సూచించారు.
*గవర్నర్ను కలిసిన స్పీకర్ పోచారం
తెలంగాణ గవర్నర్ నరసింహన్కు ప్రగతిభవన్లో సెప్టెంబరు 7వ తేదీన సీఎం కేసీఆర్ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. రాష్ట్ర కొత్త గవర్నర్గా తమిళిశై సౌందరరాజన్ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 7న నరసింహన్ రాజ్భవన్ను వీడి వె ళ్లనున్నారు. 8న కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం ఉండటంతో.. ఒక రోజు ముందే రాజ్భవన్ను ఖాళీ చేయడానికి ఏర్పాట్లు చేశారు.
*ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదు: బీజేపీ
సీఎం కేసీఆర్ అసమర్థ పాలన వల్లే డెంగీకి క్యాపిటల్గా తెలంగాణ రాష్ట్రం మారిందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్రావు విమర్శించారు. డెంగీ వల్ల రాష్ట్రంలో 200 మందికిపైగా మరణించినా అయిదారుగురి కంటే ఎక్కువ మంది మరణించలేదని మంత్రి ఈటల చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభు త్వం పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కళ్లుండీ చూడలేకపోతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్, రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్రం అనేక విధాలుగా సహకారం అందిస్తోందన్నారు
*యూత్ హాస్టల్స్’ అభివృద్ధికి సహకరిస్తా : వినోద్
యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని వినోద్కుమార్ హామీ ఇ చ్చారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ట్రెక్కింగ్, క్యాంపింగ్ బ్రోచర్ను మంగళవారం ఆయన విడుదల చేశారు. దసరా సెలవులు రా నున్నందున.. తక్కువ ఖర్చుతో కుటుంబమంతా కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదించేలా రూపొందించిన ఈ కార్యక్రమం గురించి అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ వెంకట్యాదవ్, పురుషోత్తం యాదవ్, జాతీయ కౌన్సిల్ ప్రతినిధులు సూర్యప్రకాశ్, వంశీమోహన్, జాఫ్ తదితరులు పాల్గొన్నారు.
*గవర్నర్గా దత్తన్న.. బీసీలకు గౌరవం: జాజుల
కొత్త గవర్నర్లలో ఇద్దరు బీసీలు ఉండటంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయకన్వీనర్ జాజుల శ్రీనివా్సగౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బీసీలు అయిన బండారు దత్తాత్రేయ, తమిళిసై సౌందరరాజన్లను గవర్నర్లుగా నియమించడం యావత్ బీసీలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన దత్తాత్రేయను ఆయన మంగళవారం కలిసి అభినందించారు.
*ప్రభుత్వ స్కూళ్లను మెరుగు పర్చాలి: తమ్మినేని
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం లేఖ రాశారు. 5వ తరగతి విద్యార్థులు 3వ తరగతి తెలుగు వాచకాన్ని చదవలేకపోతున్నారన్నారు.
*త్వరలో టీఆర్ఎస్ 2 ముక్కలు: భట్టి
టీఆర్ఎస్ రెండు ముక్కలు కాబోతోందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క జోస్యం చెప్పారు. మంత్రి ఈటల రాజేందర్ ప్రకటనే ఇందుకు నిదర్శనమన్నారు. ములుగులో ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. టీఆర్ఎ్సను చూసి కాంగ్రెస్ కార్యకర్తలెవరూ భయపడాల్సిన పని లేదని, కేసీఆర్ పతనం మొదలైందని అన్నారు. ‘‘ఇటీవల ఈటల ప్రకటనను బట్టి టీఆర్ఎస్ రెండు ముక్కలు కాబోతోంది. కేసీఆర్ ఎన్నో రోజులు నిలబడడు. ఆయన అవినీతిని నిరూపిస్తాం. ఆయనపై చట్టపరమైన చర్యలు తప్పవు’’ అని స్పష్టం చేశారు. కేసీఆర్ సీఎంలా కాకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘గులాబీ జెండాకు నేనే ఓనర్ని అని మంత్రి ఈటల అన్నాడు. కాదు కాదు.. కేసీఆరే అని మరో మంత్రి దయాకర్రావు అన్నాడు. వీరంతా ఓనర్షిప్ గొడవలో పడి ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు’’ అని విమర్శించారు.
*హైదరాబాద్ విలీనానికి బీజేపీ వక్రీకరణ: చాడ
కమ్యూనిస్టుల సాయుధ పోరాటం వల్లే హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైందని, కానీ బీజేపీ తప్పు డు ప్రచారం చేస్తూ చరిత్రను వక్రీకరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. గుండ్రాంపల్లిలో అమరవీరులకు అమిత్షా నివాళులర్పించారని, వారు ఎలా అమరులయ్యారో తెలుసా?అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సెప్టెంబర్ 17ను అధికారికంగా విలీన దినోత్సవంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
*రేవంత్ ఎక్కడున్నా ఐరన్ లెగ్గే: లక్ష్మీకాంతరావు
టీఆర్ఎస్ జెండాను మోసిన వారంతా ఓనర్లేనని రాజ్యసభ సభ్యుడు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ చురుగ్గా పాల్గొన్నందునే మంత్రి అయ్యారని తెలిపారు. ఈటల మాటల్లో తప్పేమీ లేదన్నారు. ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు చొరవతోనే రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తు సరఫరా జరుగుతోందని చెప్పా రు. అలాంటి వ్యక్తిపై రేవంత్రెడ్డి అవాకులు చెవాకులు పేలడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ ఐరన్లెగ్గా మారడంతో టీడీపీ ఉనికే కోల్పోయిందని, భవిష్యత్తులో కాంగ్రె్సకూ అదే పరిస్థితి తప్పదన్నారు.
*ఆ భూములపై బొత్స స్పష్టతివ్వాలి: సోమిరెడ్డి
‘‘బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్కు చెందిన కంపెనీ భూములు ఇప్పుడు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయా;? లేక భరత్ చేతిలో ఉన్నాయా? అన్న విషయాన్ని మంత్రి బొత్స తేల్చి చెప్పాలి. బాలకృష్ణ అల్లుడు కాబట్టి ఏదో ఒక నింద మోపాలని చూడటం తగదు’’ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. రాజధాని విస్తరణ పరిధికీ, రాజధానికీ తేడా తెలియకుండా బొత్స లాంటి సీనియర్ మంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
*బొత్సకు కౌంటర్ ఇచ్చిన సుజనా చౌదరి
రాజధాని ప్రాంతంలో భూములన్నాయన్న మంత్రి బొత్స వ్యాఖ్యలపై సుజనా చౌదరి స్పందించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో సుజనా చౌదరి మాట్లాడుతూ ‘‘రాజధాని అంటే చొక్కా మార్చుకున్నట్లు కాదు. బొత్స ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. వాళ్ల లోపాలు కప్పిపుచ్చుకునేందుకు ఇలా మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రతి రంగంలో అట్టర్ఫ్లాప్ అయింది. బొత్స భాషా ప్రావీణ్యాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఆయన మాట్లాడిన తీరు నవ్వొస్తుంది. 120 కంపెనీల్లో బొత్స చెప్పిన కంపెనీ పేరు లేదు. వాస్తవాలకు దగ్గరగా చెబితే ప్రజలు నమ్ముతారు. బొత్సకు సీడ్ కేపిటల్ ఏదో, సీఆర్డీఏ పరిధి ఏదో తెలియదు.
*అవినీతిపై చర్యలేవీ: మాణిక్యాలరావు
‘పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో ప్రకటించడంలేదు.. అవినీతిని బయటపెట్టడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ గానీ, కేబినెట్ సబ్ కమిటీ గానీ ఇంత వరకు రికవరీ చేయలేదు. ఎక్కడా ఒక కేసు కూడా నమోదు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు దుయ్యబట్టారు. గురువారం భీమవరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం, ఇతర ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడిననాయకులు, అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షం, అధికారపక్షం ఏకమై ఒప్పందం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల పనులు నిలుపుదల చేశారని, సెక్యులర్ దేశంలో ఇమామ్లకు, పాస్టర్లకు జీతాలు ఇవ్వడం ద్వారా మత ప్రచారం చేసుకోవడం కోసం ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ‘గతంలో ఏడు కొండలను రెండు కొండలు చేస్తూ రాజశేఖర్రెడ్డి జీవో ఇచ్చింది నిజం కాదా? ఆ రోజుల్లో హిందూ దేవాలయాల ఆస్తుల్ని పంచిపెట్టారు’ అని దుయ్యబట్టారు. అత్యధిక మెజారిటీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలకు తెలియకుండా.. రద్దుల జీవోలు జారీచేయడంలో ప్రభుత్వ ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.