NRI-NRT

న్యూజెర్సీ రాష్ట్రంతో తెలంగాణ ఒప్పందం

Telangana Signs MoU With New Jersey State

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. విద్య, వాణిజ్య, వ్యాపార రంగాల్లో పరస్పరం సహకారం కోసం ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పదంపై సీఎస్‌ జోషి, న్యూజెర్సీ గవర్నర్‌ ఫిలిప్‌ మార్ఫీ సంతకాలు చేశారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా న్యూజెర్సీ గవర్నర్‌ మాట్లాడుతూ తెలంగాణలో వాణిజ్య అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలుగు వారు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో న్యూజెర్సీ కూడా ఒకటన్నారు. ఈ కొత్త ఒప్పందం రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.