Politics

వారం రోజుల్లో కూల్చాలి-బాబు నివాసానికి CRDA నోటీసులు

CRDA Gives One Week Notice To Demolish Chandrababu House

రాజకీయ దుమారానికి కారణమైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వ్యవహారం మరో సారి తెర మీదకు వచ్చింది.

గతంలోనే అక్రమంగా నిర్మించిన ఈ నివాసాన్ని ఎందుకు తొలిగించకూడదంటూ స్థానిక అధికారులు నోటీసులు జారీ చేసారు.

అయిేత..దీని పైన అన్ని పత్రాలు సమర్పిస్తామని నాడు భవన యజమానులు సమాధానం ఇచ్చారు.

వారు కోరిన సమయం ముగిసింది. దీంతో..మరోసారి సీఆర్డీఏ అధికారు లు చంద్రబాబు ఉంటున్న నివాసానికి నోటీసులు అంటించారు.

వారంలోగా ఆయన ఉంటున్న నివాసాన్ని తొలిగించాలని..లేకుంటే తామే తొలిగిస్తామంటూ సీఆర్డీఏ అధికారులు ఆ ఇంటికి నోటీసులు అంటించారు.

ఈ మేరకు భవన యజమాని లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు.

ఇప్పుడు దీని పైన ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారా..

తిరిగి ఇది రాజకీయంగా ఎటువంటి టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులను లింగమనేని రమేష్ పేరుతో జారీ చేశారు. అయితే ఈ నోటీసుల వ్యవహారంపై లింగమనేని రమేష్ స్పందించారు. వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని సీఆర్డీఏ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ఫ్లోర్‌, స్విమ్మింగ్‌పూల్‌, ఫస్ట్‌ఫ్లోర్‌లోని డ్రెసింగ్‌ రూమ్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన లింగమనేని రమేష్.. ఇంటి నిర్మాణ సమయానికి సీఆర్డీఏ లేదని పేర్కొన్నారు. ఉండవల్లి పంచాయతీ అనుమతి తీసుకుని ఇంటిని నిర్మించామని తెలిపారు. స్విమ్మింగ్‌పూల్‌కి రివర్‌ కన్సర్వేటర్‌ అనుమతి ఉందని లింగమనేని రమేష్‌ వెల్లడించారు.