DailyDose

నవంబరు 18 నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు-తాజావార్తలు–10/21

Indian Parliament 2019 Winter Sessions From Nov 18-Telugu Breaking News-10/21

* పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయినట్లు సమాచారం. నవంబరు 18న ప్రారంభమై డిసెంబరు 13వరకు కొనసాగే అవకాశం ఉంది.
* గ్రామ వాలెంటీర్లు కు జగన్ సర్కార్ ఝలక్…ఒక్కరోజు విధులకు దూరమైతే , రోజుకు 166రూ.జీతంలో కట్. మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
* ఉత్తరాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం , ఈ నెల 23న దక్షిణకోస్తాంధ్ర మీద అల్పపీడనం ఏర్పడే అవకాశం. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు రాష్ట్రానికి వర్షసూచనతూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం. ప్రకాశం,నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ,అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం.
* తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్‌ నెల వేతనాలు చెల్లించకపోవడంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ విచారించింది. వేతనాలు చెల్లించేందుకు అవసరమైన నిధులు లేవని ప్రభుత్వం కోర్టుకు దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే పని చేసిన నెలకు వేతనం చెల్లించకపోవడం చట్ట విరుద్ధమని పిటిషన్‌ వాదించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది
* శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి నిల్వ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో ప్రాజెక్టు ఎనిమిది వరద గేట్లను ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
* నారాయణపుర్ ప్రాజెక్టు వరద 7 గేట్స్ ఎత్తివేత ఇన్ ఫ్లో : 60.000క్యూసెక్కులుఔట్ ఫ్లో : 75.720 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం : 492.252 మీటర్లుప్రస్తుత నీటిమట్టం : 492.18 మీటర్లు ఆల్మట్టి ప్రాజెక్టు
ఇన్ ఫ్లో: 90.000క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 90.000 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటిమట్టం : 519.60 మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం : 519.60 మీటర్లు
* రేపు జరగనున్న బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ మద్దతు.సమ్మెకు మద్దతు, సంఘీభావం తెలిపిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ.ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని ఉపసంహరించుకోవాలన్న రామకృష్ణ.
* ఉత్తర కర్ణాటకకు మరోసారి భారీ వర్షాల ముప్పు ముంచుకొచ్చింది. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండు నెలలక్రితం బెళగావిని వరదలు ముంచెత్తగా మరోసారి అదే పరిస్థితి కనిపిస్తోంది. మలప్రభ నదీ తీరంలో హెచ్చరికలు జారీ చేశారు.
* ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 17 రోజులు అవుతుండగా, ఈరోజు హుస్నాబాద్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వం మీద నిరసన తెలియజేశారు. వీరికి మద్దతుగా అఖిల పక్ష నాయకులు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు వచ్చి మద్దతు తెలిపారు.
* కార్మికుల వేతనాల చెల్లింపునకు అవసరమైన నిధులు తమ వద్ద లేవని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. జీతాల కోసం రూ.230 కోట్లు అవసరమని.. ప్రస్తుతం తమ వద్ద ఉన్నది రూ.7.5 కోట్లు మాత్రమేనని వివరించింది. కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమని పేర్కొంది. చేసిన పనికి వేతనం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది. కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తూ వారి ప్రాథమిక హక్కులకు ఆర్టీసీ యాజమాన్యం భంగం కలిస్తోందంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
* తెలంగాణ ఆర్టీసీ ఐకాస సమ్మె వరుసగా 17వ రోజు కొనసాగుతోంది. సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ ఐకాస నేతలు, కార్మికులతోపాటు అఖిలపక్ష నేతలు చాడ వెంకటరెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరాం, వి.హనుమంతరావు తదితరులు హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్టాండ్‌ వద్ద ధర్నా నిర్వహించారు.
* తెదేపా హయాంలో ఉచితంగా ఇసుక ఇస్తామంటే వైకాపా నేతలు విమర్శలు చేశారని కానీ ఈ రోజు ఇసుక కొరతను తీర్చే పరిస్థితుల్లో లేరని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు.
* పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయినట్లు సమాచారం. నవంబరు 18న ప్రారంభమై డిసెంబరు 13వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ లోక్‌సభ, రాజ్యసభ కార్యదర్శులకు షెడ్యూల్‌ పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
* ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు చెందిన సీఈవో సలీల్‌ పరేఖ్‌, సీఎఫ్‌ఓ నిలంజన్ రాయ్‌ అనైతిక పద్ధతులను అవలంబించినట్లు కంపెనీకి చెందిన కొంతమంది గుర్తుతెలియని ఉద్యోగులు బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు సెప్టెంబరు 20న రాసిన లేఖ కొన్ని ప్రముఖ మీడియా సంస్థలకు లభించింది.
* శాంతి భద్రతల కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోలీసులు పని చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కొనియాడారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంఘ వ్యతిరేక శక్తులను అదుపుచేసే క్రమంలో పోలీసులు ప్రాణాలర్పిస్తున్నారని అన్నారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన పోలీసులు ఎప్పటికీ అమరులుగా ఉంటారని సీఎం వ్యాఖ్యానించారు.
* రివర్స్‌ టెండరింగ్‌తో జలవనరుల శాఖలో ఇప్పటివరకు రూ.1000 కోట్ల ఆదాయం తెచ్చామని మంత్రి అనిల్‌కుమార్‌ చెప్పారు. రివర్స్‌ టెండరింగ్‌ తీసుకురాకపోతే ఈ మొత్తంమంతా కొంతమంది జేబుల్లోకి వెళ్లేదని ఆరోపించారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ చేపడుతుంటే తెదేపా నేతలు ఓర్వలేకపోతున్నారనీ.. నిరంతరం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
* తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరినదిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటు వెలికితీతలో పురోగతి సాధించారు. సోమవారం ఉదయం ధర్మాడి సత్యం బృందం బోటు పైకప్పును ఎట్టకేలకు బయటకు తీసింది. రెండు రోప్‌ల మునిగిపోయిన బోటుకు కట్టి వెలుపలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
* తేజస్‌ రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం చెల్లిస్తామన్న ఐఆర్‌సీటీసీ.. మాటను నిలబెట్టుకోనుంది. అక్టోబర్‌ 19న రైలు మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో 950మంది ప్రయాణికులకు రూ.1.62లక్షల పరిహారం ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా అందించనున్నాయనమని అధికారులు వెల్లడించారు. రైళ్లు ఆలస్యమైతే పరిహారం చెల్లించడం చరిత్రలో ఇదే మొదటిసారి.
* ఇమ్రాన్‌ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్‌ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ(పీపీపీ) ఛైర్మన్‌ బిలావల్‌ బుట్టో జర్దారీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లోని తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ ప్రభుత్వంపై రాజకీయ పార్టీలతో పాటు, ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆయన మీడియాతో వెల్లడించినట్లు సమాచారం. ఆదివారం జిన్నా మెడికల్ పీజీ కళాశాలను సందర్శించిన బిలావల్‌ మీడియాతో మాట్లాడారు.
* ప్రగతిభవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ నేతల అరెస్టులను ఖండిస్తున్నామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రాష్ట్రం మొత్తాన్ని జైలులా మార్చారని ఆయన మండిపడ్డారు. గాంధీభవన్‌లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు. ఇంత అణచివేత ధోరణి గతంలో ఎన్నడూ లేదని.. ఇది ప్రజాస్వామ్య పాలన కాదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్‌ నియంతృత్వ ధోరణి వల్లే కాంగ్రెస్‌ పార్టీ ప్రగతిభవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిందని చెప్పారు.
* ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ కూడా కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు చేసింది. తాజాగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను రాజస్థాన్ ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. ప్రస్తుత కోచ్ పాడీ ఆప్టన్ స్థానంలో ఆండ్రూ నియమితులయ్యాడు. 2009, 2011లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, 2012, 2013లో రాయల్ ఛాలెంజర్స్ జట్లకు మెక్‌డొనాల్డ్ ప్రాతినిధ్యం వహించాడు.
* మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్‌ తిక్కారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మిగనూరులో ఆయనను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. తిక్కారెడ్డి భాగస్వామిగా ఉన్న పరిశ్రమకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.12 కోట్లు బకాయి చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపైనే తిక్కారెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తిక్కారెడ్డి అరెస్ట్‌ను స్థానిక టీడీపీ నేతలు ఖండించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కుమ్మక్కై రెండు రాష్ట్రాల్లోని తమ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తిక్కారెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.