Sports

ఫెదరర్ కిరీటంలో మరో ఫెదర్

Roger Federer Wins Swiss Indoors Basel 2019

టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ఆదివారం స్విస్‌ ఇండోర్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచాడు. దీంతో కెరీర్‌లో పదోసారి ఈ ఘనత అందుకున్నాడు. బాసెల్‌ వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్‌ డి మినార్‌పై 6-2, 6-2 తేడాతో విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో కెరీర్‌లో మొత్తం 103 సింగిల్స్‌ సాధించిన ఆటగాడిగా నిలిచాడు‌. ఫెదరర్‌కి ఈ సీజన్‌లో నాలుగో టైటిల్‌ కావడం విశేషం. ఇదివరకు దుబాయ్‌, మియామి, హాలే టైటిల్స్‌ గెలుపొందాడు. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఆట త్వరగా పూర్తయినా చాలా బాగా సాగింది. నేను అత్యుత్తమంగా ఆడాననుకుంటున్నా. అలాగే అలెక్స్‌ కూడా ఈ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. మా ఆట పట్ల ఇద్దరం సంతోషంగానే ఉన్నామని భావిస్తున్నా. బాసెల్‌(హోమ్‌టౌన్‌)లో పదోసారి ఈ టైటిల్‌ గెలుపొందడం నాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది’ అని టెన్నిస్‌ దిగ్గజం చెప్పుకొచ్చాడు.