DailyDose

పెడన పోలీసులను చితకబాదిన బెల్టుషాపు యజమానులు-నేరవార్తలు-10/28

Liquor Store Owners Beats Police In Pedana-Telugu Latest Crime News Today-10/28

* వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు. పైపులైన్ విషయంలో తలెత్తిన వివాదం. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణకు దారి తీసింది. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం శ్రీహరినాయుడు పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కాగా… క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

* పెడన మండలం పుల్లపాడులో రెచ్చిపోయిన బెల్టు షాపు యజమానులు. ముగ్గురు కానిస్టేబుళ్లపై దాడి చేసిన బెల్టు షాపు సిబ్బంది. బెల్టు షాపులు తనిఖీల్లో భాగంగా ఎస్ఐ తో పాటు విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లపై దాడి చేసిన బెల్టు షాపు యజమానులు. దాడిలో ముగ్గురు కానిస్టేబుళ్లకు స్వల్పగాయాలు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

* హైతీలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారాయి. వేతనాలు పెంచాలని కోరుతూ పోలీసులు చేపట్టిన ఆందోళనలో ఘర్షణలు చెలరేగి… ఇద్దరు మరణించారు. ​​​​​​​పోలీసుల నిరసన హింసాత్మకం… ఇద్దరు మృతి. హైతీ రాజధాని పోర్ట్​ ఎ ప్రిన్స్​లో ఆదివారం పోలీసుల ఆందోళన హింసాత్మకమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న పోలీసులు, మద్దతు ఇస్తున్న పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఇద్దరు మృతి చెందారు. జీతాల కోసం…హైతీలో 2 నెలలుగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ దేశాధ్యక్షుడు జొవెనెల్ మోయిసే రాజీనామా చేయాలన్నది నిరసనకారుల ప్రధాన డిమాండ్. వీరికి తోడుగా ఆదివారం పోలీసులు ఆందోళనబాట పట్టారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు.

* నెల్లూరు జిల్లా కోవూరు మండలం రామన్నపాలెం హ్ప్ పెట్రోల్ బాంక్ వద్ద నార్త్ రాజుపాలెంకి చెందిన అవినాష్,ప్రమోద్ అనే ఇద్దరు కాలేజ్ విద్యార్థులపై నెల్లూరుకు చెందిన తోటి విద్యార్థులు కత్తులతో దాడి. కోవూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలింపు. ప్రమోద్ అనే యువకుడి పరిస్థితి విషమం.మెరుగైన చికిత్స కోసం నెల్లూరు హాస్పిటల్ కు తరలింపు.

* హైదరాబాద్ నుండి అమలాపురం వస్తున్న కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్ మండలంలోని కె.పెదపూడి ప్రమాద మలుపు వద్ద పంటకాలవ లోనికి దూసుకెళ్లింది.స్థానికుల వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి అమలాపురం వస్తున్న కావేరి ట్రావెల్స్ బస్ డ్రైవర్ నిద్రమత్తు లో బస్ ను నడపడం వల్ల కె.పెదపూడి కల్వర్ట్ మలుపు వద్ద పంట కాలువ లోనికి దూసికెళ్లిఒదన్నారు. ఈ కల్వర్టుకు ఇటీవలే ఆరు లక్షల రూపాయలతో ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులు చేసింది. అయితే రెండు వైపులా రక్షణ గోడ లేకపోవడం, బస్ వస్తున్న సమయం తెల్లవారుజామున కావడం, డ్రైవర్ కు నిద్రమత్తు రావడం తో మలుపు తిరగకుండా నేరుగా పంట కాలవ లోనికి వెళ్లిపోయిందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఆరుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారని ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే ట్రావెల్స్ సిబ్బంది బస్సు నెంబర్ కనపడకుండా నెంబర్ ప్లేట్ల పై మట్టి పోవడం కొసమెరుపు.

* ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో మహిళా కండక్టర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వ వైఖరితో మహిళా కండక్టర్ నీరజ తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. కండక్టర్ నీరజ మృతి పట్ల ఆర్టీసీ జేఏసీ నేతలు సంతాపం తెలిపారు.

* విశాఖపట్నం జిల్లాలోని చీడికాడ మండలం వరహపురంలో కెనరా బ్యాంకుకు తాళం వేసి ఖాతాదారులు నిరసన వ్యక్తం చేశారు. కెనరా బ్యాంకులో నెలరోజులుగా సర్వర్ పనిచేయనందుకు నిరసనగా ఆందోళనకు దిగారు ఖాతాదారులు.

* ముంబై (మహారాష్ట్ర): ముంబై నగరంలోని వేర్‌హౌస్‌లో దీపావళి వేళ అగ్నిప్రమాదం జరిగింది. ముంబై నగరంలోని సియాన్ ప్రాంతంలో ఉన్న వేర్‌హౌస్‌లో సోమవారం తెల్లవారుజామున ఒంటి గంటకు అగ్నిప్రమాదం జరిగింది. వేర్‌హౌస్‌లో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక వాహనాలు పెద్దసంఖ్యలో తరలివచ్చి గంటలోనే మంటలను అదుపు చేశాయి.అగ్నిమాపకశాఖ వాహనాలు వెంటనే రావడంతోపాటు గిడ్డంగిలో ఉన్న అగ్నిమాపకశాఖ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారి విష్ణు చెప్పారు. వేర్‌హౌస్‌లో అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ముంబై పోలీసులు చెప్పారు.

* గుంటూరు: ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. ఐదులాంతర్ల సెంటర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పురుగుల మందు తాగి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఎవరనే విషయంపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు. 

* విజయవాడ: ‘టిక్‌ టాక్‌’ మోజు పచ్చని కాపురంలో చిచ్చు రేపింది. ఇంట్లో ఓ భార్య ఉండగానే మరో భార్యను వెతుక్కున్నాడు కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం వాసి సత్యంరాజు. వీటీపీఎస్‌ ఉద్యోగి అయిన సత్యంరాజు 2009లో అనురాధను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ఉండగానే టిక్‌ టాక్‌లో పరిచయమైన హైదరాబాద్‌ యువతిని ఐదు నెలల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంపై గతంలో పెద్దల వద్ద పంచాయతీ జరిగింది. మారతానని అప్పట్లో అందరిముందు మాట ఇచ్చిన సత్యంరాజు ఆ తర్వాత ఎప్పటిలాగే భార్యకు దూరంగా ఉంటున్నాడు. మానసికంగా తనను వేధిస్తున్నాడని ఆయన భార్య అనురాధ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తల్లిదండ్రులను భార్య అనురాధ సరిగా చూసుకోవడం లేదని సత్యంరాజు పోలీసుల వద్ద ఆరోపించాడు. అనురాధ ఫిర్యాదు మేరకు పోలీసులు సత్యంరాజుపై కేసు నమోదు చేశారు.

* ఏలూరు: తనపై పోలీసులు పెట్టిన కేసులపై తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. “మీ అరెస్టులు మమ్మల్ని భయపెట్టలేవు. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తా, దేనికైనా తెగిస్తా” అని ఆయన అన్నారు.