DailyDose

రోజాకు జగన్ వార్నింగ్-రాజకీయ-10/29

Jagan Warns Roja-Telugu Political News Today-10/29

*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా కు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అనవసరమైన విషయాలపై వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయంలోఆర్టీసీ సమ్మెపై మాట్లాడొద్దని సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న క్లాస్ ఏపీలోని వైసీపీ నేతలకు గట్టిగానే పనిచేస్తుంది. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ రోజా సైలెంట్ అయ్యారు. మిగతావారు ఇంతకాలంగా ఏపీలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ఒక్క ముక్క మాట్లాడిన పాపాన పోలేదు.
*భాజపాకి శివసేన వార్నింగ్
ఎన్నికల ఫలితాలు వచ్చి ఐదు రోజులవుతున్నా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 50:50 ఫార్ములాపై శివసన పట్టువీడకపోవడంతో బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఉద్ధవ్ దిగిరాకపోతే.. ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి శివసేన గట్టి వార్నింగ్ ఇచ్చింది.
* పవన్‌ కల్యాణ్‌ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి: అవంతి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళలే ప్రధాన కారణమని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వాన్ని కూల్చాలన్నా.. ఏర్పాటు చేయాలన్నా మహిళా శక్తే కీలకమని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ మంత్రి మాట్లాడుతూ.. ఏపీ సమస్యలపై పార్లమెంటులో ఎంపీ విజయసాయిరెడ్డి ఒకే ఒక్కరుగా పోరాటం సాగించారని ప్రస్తావించారు. వైఎస్సార్‌ సీపీ విజయంలో ఆయన కీలకపాత్ర పోషించారని అన్నారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో విశాఖను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. నాడు ఎన్టీఆర్‌ తర్వాత ఢిల్లీలో కేంద్రాన్ని ఎదురించిన తెలుగు వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు.
*కొరతంటూ విష ప్రచారం: వైకాపా
రాష్ట్ర ప్రభుత్వమే ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తోందంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ విష ప్రచారం చేస్తున్నారని వైకాపా అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు. అలా చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని, వరదలతో నదుల్లో నుంచి ఇసుక బయటకు తీసే పరిస్థితి లేనందునే కొరత ఏర్పడుతోందని, దానిపై వారిద్దరూ అర్థం లేని విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… భవన నిర్మాణ కార్మికుల పక్షాన మాట్లాడుతున్నట్లుగా వారు ఇసుకపై అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
*దిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
మహిళల భద్రతకు దిల్లీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ‘భాయ్ధూజ్’ను పురస్కరించుకుని కానుకగా మంగళవారం నుంచి దిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దాంతో పాటు బస్సుల్లో వారి రక్షణకు నియమించిన మార్షల్స్ సంఖ్యను 13వేలకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 3400 మంది మార్షల్స్ మాత్రమే ఉన్నారు.
*హరియాణా సీఎంగా ఖట్టర్ ప్రమాణ స్వీకారం
హరియాణా ముఖ్యమంత్రిగా భాజపా నేత మనోహర్లాల్ ఖట్టర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. జననాయక్ జనతా పార్టీ నేత దుష్యంత్ చౌతాలా ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆదివారం దీపావళినాడు రాజ్భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గవర్నర్ సత్యదేవ్ నారాయణ ఆర్య వారి చేత ప్రమాణం చేయించారు. దుష్యంత్ మాతృమూర్తి, ఎమ్మెల్యే నైనా చౌతాలాతో పాటు… తిహార్ జైలు నుంచి ఫర్లోపై విడుదలైన తండ్రి అజయ్ చౌతాలా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
*మహారాష్ట్రలో చిచ్చుబుడ్లు
మహారాష్ట్రలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-శివసేన కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు ఏ రీతిన ఉంటుందన్న విషయమై రెండు పార్టీలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ‘చెరి సగం కాలం’ పాలన చేపడదామని పట్టుబడుతున్న శివసేన.. ఈ విషయమై భాజపా రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని శనివారం డిమాండ్ చేసింది. మరోవైపు ‘ప్రత్యామ్నాయాలనూ’ పరిశీలించాలంటూ ఆ పార్టీకి కాంగ్రెస్ సూచించింది. శివసేనకు మద్దతిచ్చే అంశమేదీ తమ పరిశీలనలో లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు.
*పారిశుద్ధ్యం పట్టకుంటే కఠిన చర్యలే
తెలంగాణలో గ్రామీణ పారిశుద్ధ్యాన్ని పట్టించుకోకపోతే బాధ్యులపై పంచాయతీరాజ్ చట్టం మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. అధికారులు, ఉద్యోగులు, గ్రామపంచాయతీల సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులూ పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.
*8 జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలు
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాల పర్యటనల షెడ్యూలు ఖరారైంది. ఈనెల 29న కృష్ణా జిల్లాతో మొదలై.. డిసెంబరు 24న విజయనగరంతో ఆయన పర్యటన ముగుస్తుంది. మొత్తం 8 జిల్లాల్లో పర్యటిస్తారు. వరుసగా కృష్ణా, చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరి, కడప, ప్రకాశం, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. పర్యటనలో కొన్ని మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉందని తెదేపా వర్గాలు తెలిపాయి.
*వైకాపాలోకి వంశీని రానివ్వకండి
తెలుగుదేశం పార్టీ నాయకుడు, గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ను వైకాపాలో చేర్చుకోవద్దంటూ ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు శనివారం రోడ్డెక్కారు. విజయవాడ పటమటలో ఉంటున్న గన్నవరం వైకాపా ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు ఇంటివద్దకు కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. గŸత ఎన్నికల సమయంలో తమను ఇబ్బందులకు గురిచేసిన వంశీని వైకాపాలోకి ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. గత ఐదేళ్లుగా తాము తెదేపా నాయకులతో పోరాడామని, తమను పోలీసుస్టేషన్లలో కూర్చోబెట్టి, అక్రమ కేసులు బనాయించిన వ్యక్తిని పార్టీలోకి ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలంటూ వైకాపా అధిష్ఠానాన్ని ప్రశ్నించారు.
*భాజపా మంత్రులకు విలువైన బహుమతులిచ్చా
‘కర్ణాటక విద్యుత్తుశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలోని భాజపా మంత్రులందరికీ విలువైన బహుమతులు ఇచ్చా’ అని ఆర్థిక నేరాల కేసులో బెయిలుపై విడుదలైన కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం బెంగళూరు చేరుకున్న అనంతరం పీసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ముగ్గురు మినహా మంత్రులందరూ నా వద్ద బహుమతులు పొందారు. రాష్ట్ర కీలక పథకాలకు సహకరిస్తే ప్రభుత్వం తరఫునే బహుమతులు అందించా.