Movies

శిల్పాశెట్టి భర్త మెడచుట్టూ ‘ఈడీ’ ఉచ్చు

Shilpa Shetty's Husband Raj Kundra Under ED's Eagle Eye

శిల్పాశెట్టి భర్తకు ఈడీ ఝలక్.. రాజ్ కుంద్రాకు మెడకు ‘మిర్చి’ ఉచ్చు!బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త రాజ్ కుంద్రాకు ఎదురుదెబ్బ తగిలింది. గ్యాంగ్‌స్టర్‌ ఇక్బాల్ మిర్చి‌తో సంబంధాల నేపథ్యంగా మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టోరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ కేసులో రాజ్ కుంద్రాను విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. దీంతో ఆయన మెడకు ఈ కేసు ఉచ్చు గట్టిగానే బిగిసే అవకాశం ఉందనే మాట రాజకీయ, వ్యాపార వర్గాల్లో వినిపిస్తున్నది.