Editorials

భారత సైనికులపై పాకీ అమ్మయిల వల

Pakistan Sex Trapping Indian Army Soldiers

ఆర్టికల్ 370 రద్దు జమ్మూ కాశ్మీర్ పునర్విభజనను జీర్ణించుకోలేకపోతున్న పాకిస్తాన్ తనకు ఉండే ఏ అవకాశాన్ని వదలడం లేదు. తన వక్రబుద్ధిని మళ్ళీ మళ్ళీ బయటపెడుతుంది. భారత ఆర్మీ రహస్యాలు దొంగలించడానికి అడ్డదారులు తొక్కుతోంది. మన సైనికుల పైకి అమ్మాయిల ముసుగులో ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ కుట్రల కోసం సోషల్ మీడియానే వేదికగా ఎంచుకుంటోంది. దాయాది ఆర్మీ ఈ విషయాన్నీ ఇండియన్ ఆర్మీ పసిగట్టింది. కుటుంబానికి దూరంగా ఉంటూ సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్లకు మత్తుగా మాటలు చెప్పి ట్రాప్ చేస్తోంది. జవాన్లు మాయలో పడిపోయాక సైనిక ఆయుధ స్థావరాల వివరాలను కూపీ లాగుతున్నారని తరచూ ఇటువంటి ఘటనలు ఎక్కువ కావడంతో భారత ఆర్మీ దీనిపై అప్రమత్తం అయింది. భారత్ జవాన్లకు కొన్ని జాగ్రత్తలు చెబుతూ అడ్వైజరీ జారీ చేసింది. ఇక తాజాగా రాజస్తాన్ లో ఇద్దరు జవాన్లు పాక్ ఆర్మీ హనీ ట్రాప్ లో పడగా లాన్స్ నాయాద్ రవి వర్మ సిపాయి విచిత్ర బెహేరా పాక్ ఇంటలిజెన్స్ వలలో చిక్కారని గుర్తించి రాజస్తాన్ పోలీసులు వారిని అరెస్టు చేసారు. ఇప్పటికే హనీ ట్రాప్ ఐడీలను ట్రాక్ చేస్తున్న మన ఆర్మీ వారిని పట్టుకోగలిగింది. సిరాత్ అనే ఐడీ నుంచి మహిళ ఫోటోతో వాళ్ళని పట్టుకోగలిగింది. సిరాత్ అనే ఐడీ నుంచి మహిళ ఫోటోతో వాళ్ళని లోబరచుకోగాలిగింది. ఆర్మీ రహస్యాలను దొంగాలించే ప్రయత్నం చేసినటు ఇండియన్ ఆర్మీ గుర్తించింది. మరోవైపు పాక్ కుట్రలను పసిగట్టింది భారత ఆర్మీ ఇంటలిజెన్స్ మన జవాన్ల ను అప్రమత్తం చేసింది. సైనికులను ఎలా వలలోకి లాగుతుందో దానిపై హెచ్చరిస్తూ అడ్వైజరీ జారీ చేసింది. వలపులతో వల విసరచ్చు అలాగే బాబాల మంటూ ఆద్యాత్మిక గురువులమంటూ కూడా ట్రాప్ చేసే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సైనికులను హెచ్చరిస్తోంది ఇండియన్ ఆర్మీ.