DailyDose

కొండెక్కిన కోడి ధరలు-తాజావార్తలు-11/11

Chicken Prices Sky Rocketing In Telugu States-Telugu Breaking News-11/11

* కార్తీక మాసంలో చికెన్ ధరలు కొండెక్కాయి. అలా ఇలా కాదు… కొన లేనంతగా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్… రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కిలో చికెన్ 194రూపాయలు, లైవ్ చికెన్ 350 రూపాయల చొప్పున కొనాల్సి వస్తోంది.ఇక నాటు కోడి… ఆరు వందల రూపాయల వరకూ పలుకుతోంది. హేచరీస్ సమస్య వల్లే ధరలు ఇంత అధికంగా ఉన్నాయని చికెన్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ క్రమంలో… సామాన్య, మధ్య తరగతి ప్రజలు చికెన్‌ తినడమే తగ్గించారు.ఇక దిగువ మధ్య తరగతి ప్రజలైతే చికెన్ జోలికి వెళ్ళడమే మానుకుంటున్నారు. ఈ పరిస్థితి నేపధ్యంలో… చికెన్ దుకాణదారులు కూడా దిగాలు పడుతున్నారు.
* కాలుష్యంతో తల్లడిల్లుతున్నది. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారంటే పరిస్థితి ఎంతదాకా పోయిందో అర్థం చేసుకోవచ్చు.
* శివసేన నుంచి ఎంపీగా గెలిచి, కేంద్ర కేబినెట్‌లో స్థానం సంపాదించిన అరవింద్ సావంత్ ఆ పదవికి రాజీనామా చేయనున్నారు.
* మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అమరేశ్వర్‌ ప్రతాప్‌ సాహీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
* భారత స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు.
* ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని ఢిల్లీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మనోజ్ తివారీ డిమాండ్ చేశారు.
* నేషనల్ పోలీస్ అకాడమీలో 2018 బ్యాచ్ కు చెందిన ఐదుగురు ఐపీఎస్ అధికారులను ఏపీకి కేటాయించారు.
* జమ్మూకశ్మీర్‌లోని బందీపోరాలో సోమవారం ఉదయం ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
* ఆర్టీసి కార్మికులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ‌ముట్టడి..గెట్లు వేసి లోనికి కార్మికులను వెళ్ళకుండా అడ్డుకుంటున్న పోలీసులు…క్యాంపు కార్యాలయం ముందు బైఠాయింపు…సి.ఎం.డౌన్ సి.ఎం.డౌన్ అంటూ నినాదాలు చెస్తూ క్యాంపు‌ కార్యాలయం ముందు బైఠాయించిన ఆర్టీసి కార్మికులు,వామపక్ష నాయకులు.
*ఆర్టీసీ స్థితి గతులను వివరిస్తూ ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ఈనెల 8వ తేదీ వరకూ మొత్తం ఆర్టీసీ బకాయిలు 2వేల 209 కోట్లు ఉన్నట్లు ప్రభుత్వం అఫిడవిట్ లో తెలిపింది. ఇందులో పీఎఫ్ బకాయిలు 788 కోట్లు, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ బకాయిలు 500కోట్లు, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ 180 కోట్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ సెటిల్ మెంట్స్ 52 కోట్లు, ఎంవీ యాక్ట్ కింద 452 కోట్లు, హెచ్ ఎస్ డి ఆయిల్ బిల్స్ 34 కోట్లు, హెచ్ వో, రిజియన్, జోన్ ఇతర బకాయిలు మరో 36 కోట్లుగా తేల్చింది సర్కార్.
*రిటైర్డ్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ అధికారి పీఎస్‌‌‌‌ కృష్ణన్‌‌‌‌(89) కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణన్‌‌‌‌కు భార్య శాంతికృష్ణన్‌‌‌‌, కుమార్తె శుభాకృష్ణన్‌‌‌‌ ఉన్నారు.
*రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాదం కేసులో తీర్పుచెప్పిన సుప్రీంకోర్టు జడ్జిలు ఐదుగురికి సెక్యూరిటీ పెంచారు.వాళ్లుంటున్న ఇళ్ల దగ్గర అదనంగా సెక్యూరిటీ టీమ్‌‌లను ఏర్పాటు చేశారు. ఇళ్ల దగ్గర బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. మొబైల్‌‌ ఎస్కార్ట్‌‌ టీమ్స్‌‌ ను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్పారు. సీజేఐ జస్టిస్‌‌ రంజన్‌‌ గొగొయ్‌‌, సీజేఐ డిజిగ్నేట్‌‌ జస్టిస్‌‌ శరద్‌‌ ఆర్వింద్‌‌ బాబ్డే, జస్టిస్‌‌ డి.వై. చంద్రచూడ్‌‌, జస్టిస్‌‌ అశోక్‌‌ భూషణ్‌‌, జస్టిస్‌‌ ఎస్‌‌.అబ్దుల్‌‌ నజీర్‌‌లు ఏళ్లపాటు నానుతున్న అయోధ్య కేసులో శనివారం తీర్పు చెప్పారు. ఏ ఒక్క జడ్జికీ ఎలాంటి బెదిరింపులు రాకపోయినా ముందుస్తు చర్యల్లో భాగంగానే సెక్యూరిటీని పెంచినట్టు సీనియర్‌‌ అధికారి ఒకరు చెప్పారు. ప్రతి జడ్జి వెహికల్‌‌కి ఆర్మ్డ్‌‌ గార్డ్స్‌‌ ఉన్న ఎస్కార్ట్‌‌ వెహికల్స్‌‌ సెక్యూరిటీగా ఏర్పాటుచేశారు.
*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ కుట్రపన్నుతోందంటూ శివసేన సంచలన ఆరోపణలు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై సోమవారం సాయంత్రం 7:30 గంటల్లోగా అభిప్రాయం తెలపాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ గడువు విధించడం వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రావత్ ఆరోపించారు.
*తెలంగాణ ఆర్టీసీ ఐకాస కార్మికులు చేపడుతున్న సమ్మె సెగ విదేశాలకూ పాకింది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ అభివృద్ధి వేదిక (టీడీఎఫ్‌) 20వ వార్షిక వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
*నల్గొండ జిల్లా…నాగార్జున సాగర్ డ్యామ్ అప్డేట్.. క్రస్ట్ గేట్లు ఓపెన్…నిల్ఇన్ ఫ్లో ..42,413 క్యూసెక్కులు.
ఔట్ ఫ్లో..52,788 క్యూసెక్కులు.పూర్తి స్థాయి నీటి మట్టం:590 అడుగులు.ప్రస్తుత నీటి మట్టం: 589.60 అడుగులు.
. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం:312.0450టీ.ఎం .సీ లు .ప్రస్తుతం:..310.8498 టీఎంసీలు.
*నటుడు, SVBC ఛైర్మన్ పృథ్వి ఈ రోజు తెల్లవారుజామున విజయవాడలో కొలువై యున్న కనక దుర్గ అమ్మవారి ని దర్శించుకున్నారు.అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు.
*ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ టిఎన్ శేషన్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
*క్రిమికీటకాల నుంచి పంటల సంరక్షణపై ఆయా దేశాలు దేనికది కాకుండా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర్ పేర్కొన్నారు.
*వచ్చే నెల 8, 9 తేదీల్లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరిగే నాలుగో ఆస్ట్రేలియా-భారత్ అంతర్జాతీయ నాయకత్వ సదస్సుకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది.
*రామగుండంలో ఎన్టీపీసీ యాజమాన్యం నిర్మిస్తున్న తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టుకు స్వర్ణశక్తి అవార్డు లభించింది.
*సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు నీటిపారుదల, పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయం, విద్యుత్ తదితర రంగాల్లో అత్యంత వేగంగా పురోగమిస్తూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఉద్యోగులను వెంటనే రాష్ట్రానికి రప్పించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం సంఘం అధ్యక్షుడు సంపత్ కుమార స్వామి నేతృత్వంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలను ఆమోదించారు.
*పేదరికం, అసమానతల వల్ల పేద, నిమ్న వర్గాల విద్యార్ధులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య అన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకోలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఆదివారంనాడు విలేకరులతో మాట్లాడుతూ చదువును ‘కొనలేని’ వారికి మేలు జరిగేలా విద్యారంగంలో మార్పులు తేవాలని డిమాండ్ చేశారు.
*రాష్ట్రంలో పది శాతం ఉన్న గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ (ఏఐబీఎస్సెస్) రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా శ్యామ్నాయక్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు, తండాల సమస్యలపై ఈ నెల 16 నుంచి 22 వరకు జిల్లాల పర్యటన చేపట్టేందుకు తమ కమిటీ నిర్ణయించిందని ఆదివారం హైదరాబాద్లోని గిరిజన భవన్లో జరిగిన సమావేశంలో వెల్లడించారు.
*బంగాళాఖాతంలో ఏర్పడిన ‘బుల్బుల్’ తుపాను బలహీనపడి వాయుగుండంగా మారి పశ్చిమబెంగాల్లోని సాగర్ దీవుల ప్రాంతంలో తీరం దాటినట్లు వాతావరణశాఖ అధికారి రాజారావు తెలిపారు. ‘తెలంగాణపై దీని ప్రభావం ఏమీ లేదు. సోమ, మంగళవారాల్లో పొడి వాతావరణం ఉంటుంది.
*తెలుగు రాష్ట్రాలకు వైద్య పరికరాల ఉత్పత్తి కళ సంతరించుకోనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వైద్య పరికరాల పార్కుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్య పరికరాలను ఈ పార్కుల్లో తయారుచేయనున్నారు.