DailyDose

కళింగపట్నం బీచ్‌లో అయిదుగురు విద్యార్ధుల మృతి-నేరవార్తలు-11/11

Five Studnents Dead In Kalingapatnam Beach-Telugu Crime News Today-11/11

* సోంపేట,మందస మండలం లోని కుంటుకోట ప్రాంతాల్లో కస్తూరిభా విద్యాలయాల్లో ఏసీబీ తనిఖీలుకార్డులు పరిశీలించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.
* భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ వినోద్ రెడ్డి మాట్లాడుతూ సోమవారం తెల్లవారుజామున వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా .. అనుమానస్పదంగా 2 కార్లు ఆపకుండా వెళ్లాయని వాటిని వెంబడించి ఫారెస్ట్ చెక్ పోస్ట్ నందు ఆపి తనిఖీ చేయగా అందులో నిషేధిత గంజాయి ఉన్నట్లుగా గుర్తించామన్నారు.
* రామగుండం ఓసిపి3 బొగ్గుగనిలో రెండు డంపర్లు ఢీకొని పందిళ్ల రమేష్ అనే కార్మికుడు మృతి.
* గుంటూరు జిల్లాకాకుమానులొ గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి ప్రత్తి పొలంలో కుళ్ళిన శవం ని గుర్తించారు. సుమారుగా వారం రోజులు అయి ఉండవచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు
* సూర్యలంక సముద్రంలో మునుగుతూ బాలుడు మృతిఈపురుపాలెం కు చెందిన కర్రీ ఏడుకొండలు కొడుకు కర్రీ మహేష్ గా గుర్తింపు.కార్తీక పౌర్ణమి సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చి తోటి పిల్లలతో సముద్రంలో మునుగుతూ మృతి.
* ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రాజుకుని లక్షల ఎకరాల అడవి బూడిదవుతోంది. ఇప్పటికే 150 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యేసరికి అత్యవసర పరిస్థితి ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం.
* రామగుండం ఓసిపి3 బొగ్గుగనిలో, రెండు డంపర్లు ఢీకొని. పందిళ్ల రమేష్ అనే కార్మికుడు మృతి. క్యాబిన్ లో చిక్కుకున్న డ్రైవర్ రమేష్ మృత దేహం.స్థానిక మార్కండేయ కాలనీకి చెందిన రమేష్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు…
*శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం బీచ్ వద్ద నిన్న ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఐదుగురిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరొకరిని మెరైన్ పోలీసులు రక్షించారు. ఇంకా ముగ్గురి ఆచూకీ లభించలేదు.
*తల్లిగారింటికని వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
*గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గౌలిదొడ్డి గ్రామ సమీపంలో శ్రీనివాసరావు అనే వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో వేపచెట్టుకు ఉరేసుకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతుండటంతో స్థానికులు గుర్తించి గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు.
*తల్లిగారింటికని వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన సాయిలు, గంగా(22) దంపతులు మేడ్చల్‌లోని కిందిబస్తీలో ఏడాదిగా నివాసముంటున్నారు.
* గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గౌలిదొడ్డి గ్రామ సమీపంలో శ్రీనివాసరావు అనే వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో వేపచెట్టుకు ఉరేసుకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతుండటంతో స్థానికులు గుర్తించి గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు.
*అతిగా మద్యం సేవించిన ముగ్గురు యువకులు (వలసకూలీలు) ఒకే ద్విచక్ర వాహనంపై వేగంగా ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. అదుపు తప్పిన బైక్ రోడ్డుపై పడిపోవడంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, మిగిలిన ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది
*శంషాబాద్‌కు సమీపంలోని పెద్దషాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ట్రక్కును ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడు మృతి చెందారు.
*ప్రైవేట్ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకెళ్తే.. అబ్దుల్లాపూర్‌మెట్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి బీ-ఫార్మసీ చదువుతున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు.
*శ్రీకాకుళం జిల్లా గార మండలం పోర్టుకళింగపట్నం సముద్రతీరంలో నలుగురు ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు గల్లంతయ్యారు.
*హైదరాబాద్‌: నగరంలోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. మలక్‌పేట నుంచి వస్తున్న ఎంఎంటీఎస్‌ రైలు, స్టేషన్‌లో ఆగివున్న కర్నూలు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదంతో ఎంఎంటీఎస్‌లోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాచిగూడ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలవల్లే ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.
*రహస్యంగా విదేశాలకు తరలిస్తున్న 44 కిలోల గంధం చెక్కలను శంషాబాద్‌ విమానాశ్రయంలో భద్రతాధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. విదేశీ ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు.
*జమ్మూ-కశ్మీర్‌లోని బందీపొరా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ముష్కరుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు లదారా గ్రామంలో గాలింపు చేపట్టాయి.
*గలగలపారే కృష్ణా జలాలను చూసి తన్మయత్వంతో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించి ఓ విద్యార్థిని మృత్యువు బారిన పడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
*టిక్‌టాక్‌ వీడియో ఓ యువకుడి ప్రాణం తీసింది. తన సహచరులే లేనిపోని ఆరోపణలతో ఓ వీడియో సృష్టించి దాన్ని వైరల్‌ చేశారంటూ ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
*రైలుపట్టాలపై విగతజీవులుగా పడి ఉన్న భార్యాభర్తలను పోలీసులు కనుగొన్నారు. సీఆర్‌పీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ కపరోటు వెంకటరమణారావు(48), ఆయన భార్య నాగమణి (40)గా వారిని గుర్తించారు.
*భార్యపై అనుమానంతో..ఉన్మాదిగా మారిన భర్త రోకలితో ఆమెపై దాడి చేశాడు…ఆపై ఏడాది వయసున్న కుమారుడిని నేలకేసి బలంగా కొట్టాడు. భార్య తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా…చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ అమానుష ఘటన ప్రకాశం జిల్లా రాచర్లలో చోటుచేసుకుంది.
*తాకట్టు కోసం తీసుకున్న బంగారు ఆభరణాలు ఎప్పుడిస్తావని అడిగిన పెద్దమ్మ పట్ల ఓ యువకుడు కర్కశంగా ప్రవర్తించాడు. ట్రాక్టరుతో తొక్కించి ప్రాణాలు తీశాడు.
*చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రాజాఇండ్లు గ్రామం వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు.
*చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం సమీపంలో కంటైనర్ ఢీకొనడంతో మరణించిన వారిలో 8మంది అంత్యక్రియలు గంగవరం మండలం మర్రిమాకులపల్లెలో శనివారం మధ్యాహ్నం ముగిశాయి.
*పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం సిద్దిపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కిరణ్కుమార్(27) రాజస్థాన్లో శనివారం మృతిచెందాడు.
*హైదరాబాద్లోని కూకట్పల్లి పరిధిలో ఓ ప్రైవేటు బస్సు దగ్ధమైంది.
*పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఒక సివిల్ సర్వీస్ అధికారి ఇంట్లో చొరబడి ఆ దంపతులను తాళ్లతో కట్టేసి చోరీకి పాల్పడటం కలకలం సృష్టించింది.
*తాగిన మైకంలో కన్న కొడుకుపైనే కత్తి పీటతో తండ్రి దాడి చేసిన ఘటన నర్సాపూర్ మండలం గూడెంగడ్డలో చోటుచేసుకుంది.
*ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నిర్వహించిన ‘సకల జనుల సామూహిక దీక్ష’లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
*భర్త అతని చెల్లెలి చికిత్స కోసం ఎక్కువ ఖర్చుపెడుతున్నాడని బాలికను హత్య చేసిందో వివాహిత. తిరుప్పూరు జిల్లా కాంగేయంలో చిన్నారిని బావిలో తోసి హత్య చేసిన చిన్నారి వదినను నాలుగు నెలల తర్వాత అరెస్టు చేశారు.
*శ్రీకాకుళం జిల్లా భామిని మండలం దిమ్మిడిజోల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
*పెళ్లిపీటలెక్కి నూతన జీవితానికి నాందిపలకాల్సిన తరుణంలో ఫంక్షన్ హాల్లోనే పెళ్లి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా కొంపల్లిలో జరిగింది.
*విశాఖ జిల్లాలోని దువ్వాడ రైల్వే స్టేషన్లో రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి దంపతులు మృతి చెందారు.
*ఉత్తరాఖండ్ భాజపా ఎంపీ తీరత్ సింగ్ రావత్ ఆదివారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు మెడ, నడుము భాగాల్లో గాయాలయ్యాయి.
* గుంటూరు జిల్లా గలగలాపారే కృష్ణా జలాలతో స్వీయచిత్రం తీసుకొనే ప్రయత్నంలో బీటెక్‌ విద్యార్థిని ప్రాణాలు కోల్పో యింది.
*అంబర్పేట పరిధిలోని గోల్నాకలో పెను విషాదం నెలకొంది. స్థానిక పెరల్ గార్డెన్ ఫంక్షన్హాల్లో వివాహ వేడుక జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలిపోయింది.
*పత్తి లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం-పలివెల గ్రామాల మధ్య అదుపుతప్పి బోల్తాపడింది.
*శ్రీకాకుళం జిల్లా గార మండలం పోర్టు కళింగపట్నం తీరంలో విషాదం నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం సముద్రంలో స్నానానికి దిగిన నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే స్థానికులు గాలింపు చేపట్టారు. ఒక విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మిగిలిన ముగ్గురికోసం గాలిస్తున్నారు.
*పశ్చిమ బెంగాల్‌‌ను ‘బుల్‌‌ బుల్‌‌’ సైక్లోన్‌‌ ముంచెత్తింది. ఆదివారం ఉదయం భారీ గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
* చార్జింగ్ పెట్టిన ఫోన్ పేలడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఒడిశాలోని పారాదీప్ అనే ప్రాంతంలో చోటు చేసుకుంది.