DailyDose

వేలానికి గంటా-లింగమనేని ఆస్తుల-వాణిజ్యం-11/18

Ganta Lingamaneni Assets To Be Auctioned-Telugu Business News-11/18

*తెదేపా అధినేత చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల వేలానికి రంగం సిద్దమైంది. మాజీ మంత్రి విశాఖ నార్త్ తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తి వేలానికి వేయనున్నట్లు బ్యాకులు ప్రకటన విడుదల చేశాయి. ప్రత్యూష ఇన్ ఫ్రా ప్రేవేట్ లిమిటెడ్ పేర ఇండియన్ బ్యాంక్ నుంచి భారీ ఋణం తీసుకుని ఎగవేసిన కేసులో ఇప్పటికే బ్యాంకులు నోటీసులు జరీ చేసాయి.
* మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ ఫోన్ వై19ను భారత్‌లో ఇవాళ విడుదల చేసింది. రూ.13,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో 6.53 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి65 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 16, 8, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. కాగా ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ లేదా ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు.
* చైనా మొబైల్‌ సంస్థ వివో మిడ్‌ రేంజ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. వై సిరీస్‌లో వై19 పేరుతో భారతీయ మార్కెట్లో సోమవారం లాంచ్‌ చేసింది. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో రూ. 13990లకు వై 19 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. గ్రేటర్ నోయిడాలో రూపొందించినట్టుగా భావిస్తున్న దీన్ని మాగ్నెటిక్ బ్లాక్, స్ప్రింగ్ వైట్ కలర్ వేరియంట్‌లలో తీసుకొచ్చింది. నవంబర్ 20 నుండి వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్.ఇన్, పేటిఎమ్, టాటా క్లిక్‌లతో సహా అన్ని ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది.
*ఎయిర్ ఇండియా (ఏఐ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సంస్థల అమ్మకాన్ని వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తి చేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
*సౌదీ అరామ్కో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఇంధన దిగ్గజం మార్కెట్ విలువను 1.71 లక్షల కోట్ల డాలర్లుగా తేల్చారు. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ దీని మార్కెట్ విలువ 2 లక్షల కోట్ల డాలర్ల వరకు ఉండవచ్చని భావించారు.
*ప్రభుత్వం ఆదుకోకపోతే కొన్ని టెలికాం కంపెనీల మనుగడ ముఖ్యంగా పాత టెలికాం కంపెనీల మనుగడ ప్రశ్నార్థకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
*ఈ ఏడాది జనవరి-అక్టోబరు నెలల మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు భారత స్టాక్మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు సగానికి సగం పడిపోయాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి స్పందన నీరసంగా ఉండడంతో ఎంఎఫ్ సంస్థలు ఈక్విటీల్లో రూ.55,700 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశాయి.
*భారత విమానయాన పరిశ్రమ ప్రస్తుతం ‘స్వర్ణ యుగం’లో ఉందని ఇండిగో సీఈఓ రొనొజాయ్ దత్తా అన్నారు. పరిశ్రమ పునాదులు కూడా అత్యంత బలంగా ఉన్నాయన్నారు. దేశీయ విమానయాన సంస్థల మధ్య పోటీ సైతం ఆరోగ్యకరంగానే ఉందన్నారు.
*దేశీయ విపణిలో గత రెండు నెలల్లో బంగారం ధర 10 గ్రాములు రూ.2,000 తగ్గింది. సెప్టెంబరు ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర రికార్డు గరిష్ఠ స్థాయి రూ.40,000 పలికిన 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ.38,246 వద్ద నిలిచింది. అమెరికా, చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న ఆశావహ దృక్పథంతో దేశీయ ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్ల విషయంలో అప్రమత్త వైఖరి అనుసరిస్తున్నారు.