DailyDose

నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు-రాజకీయం-11/21

Devineni Avinash Says He Is Not A Illegal Land Grabber-Telugu Political News-11/21-నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు-రాజకీయం-11/21

* ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు , సియం జగన్ పై నమ్మకంతో వైసిపిలో చేరాము తూర్పు నియోజకవర్గ భాద్యతలు అప్పచెప్పినందుకు ధన్యవాదాలు స్దానిక సంస్దల ఎన్నికలలో వైసిపి అబ్యర్దుల గెలుపుకు పూర్తిస్దాయిలో కృషిచేస్తాము తూర్పు నియోజకవర్గ ప్రజలను కలుపుకుని ముందుకు వెళతాము పార్టీలో చేరడానికి సహకరించిన పెద్దలందరికి ధన్యవాదాలు టిడిపికి నేను ఉపయోగపడ్డాను పార్టీవల్ల నాకు ఉపయోగం లేదు నేను కార్యకర్తల అభిమానాన్ని సంపాదించుకున్నానే తప్ప డబ్బు సంపాదించలేదు టిడిపిలో ఉండి నేను భూకబ్జాలు చేయలేదు , నాపై ఎటువంటి నేరారోపణా లేదు .. నేను భయపడాల్సిన అవసరమలేదు.

* ఎల‌క్టోర‌ల్ బాండ్ల అంశంలో ఇవాళ పార్ల‌మెంట్ ద‌ద్ద‌రిల్లింది. లోక్‌స‌భ‌లో ఈ అంశంపై కాంగ్రెస్ నేత మ‌నీష్ తివారీ మాట్లాడారు. ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌తో అవినీతిని క‌ప్పుపుచ్చుతున్నార‌ని అన్నారు. ఆర్బీఐ వార్నింగ్ ఇచ్చినా.. ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేసినట్లు ఆయ‌న ఓ మీడియా రిపోర్ట్‌ను స‌భ‌లో పేర్కొన్నారు. 2018లో క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు పీఎంవో కార్యాల‌య‌మే ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్‌కు ప‌చ్చ‌జెండా ఊపింద‌ని ఆ రిపోర్ట్‌లో తేలింది. నియ‌మావ‌ళిని ఉల్లంఘించి బాండ్ల‌ను సేక‌రించిన‌ట్లు తివారీ ఆరోపించారు. ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ కాంగ్రెస్ పార్టీ స‌భ నుంచి వాకౌట్ చేసింది. కాంగ్రెస్ నేత శ‌శిథ‌రూర్ కూడా ఎల‌క్టోర‌ల్ బాండ్ల ప్ర‌క్రియ‌ను త‌ప్పుప‌ట్టారు. ఇక ఇవాళ ఉద‌యం రాజ్య‌స‌భ‌లోనూ ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌పై కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

* సోనియా నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ … ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు జరిగింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నేతలు సమావేశంలో చర్చించారు. అనంతరం ఆ పార్టీ నేత వేణుగోపాల్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో తాజా పరిస్థితులపై సీడబ్ల్యూసీతో చర్చించినట్లు తెలిపారు. ఇవాళ కాంగ్రెస్, ఎన్‌సీపీ మధ్య చర్చలు కొనసాగుతాయన్నారు. రేపు ముంబయిలో జరిగే సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం రావచ్చు అని పేర్కొన్నారు.

* బీజేపీ ఎమ్మెల్సీ సొము వీర్రాజు కామెంట్స్ … అమరావతి : చంద్రబాబు, జగన్ కు మతపరమైన విధానంలో తేడా లేదు…. క్రిష్టియన్, ముస్లింల ఓటు బ్యాంక్ రాజకీయాలు వీరు చేస్తున్నారు క్రైస్తవం, ఇస్లాం మాత్రమే మతాలు హిందూ మతం మతం కాదు ధర్మం…జీవన విధానం భారతీయ జనతా పార్టీ మత ఒట్ బ్యాక్ రాజకీయాలకు వ్యతిరేకం పాస్టర్లకు ఇమాంలకు జీతాలు ఇస్తామని చంద్రబాబు, జగన్ ఇద్దరూ అన్నారు అవినీతి అక్రమాల కేసులు వున్నవారిని మేం తీసుకొకూడదంటే ఎలా ? మేం బలపడాలి. .. మేం కూడా పరిపాలించాలనుకుంటున్నాం. మమ్మల్లి మాత్రమే కరెక్ట్ గా వుండాంటే ఎలా ? తెలుగును తీసేస్తామనే హక్కు ఎవరికీ లేదు…ఇంగ్లీషు మీడియం అమలుపై తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకోవాలి వైసీపీ ఎంపీలు బీజేపీ అధినాయకత్వంతో టచ్ లో ఉన్నారు ఎంత మంది బీజేపీలోకి వస్తారు అనేది ఇప్పుడే చెప్పలేం క్రిష్టియానిటీని ప్రొత్సహించేందుకే ఇంగ్లీషు మీడియం తీసుకవస్తున్నారు అన్న కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖలకు వివరణ ఆయన్నే అడగాలి టీటీడీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సరికాదు… మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడాలి.

* ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ శుభాకాంక్షలు. తెదేపా హయాంలో మత్స్యరంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామిగా నిలిపాం. మత్స్యరంగ అభివృద్ధితో పాటు మత్స్యకారులలో పేదరిక నిర్మూలనకు సైతం ఎంతో కృషి చేసాం. 50 ఏళ్ళకే పింఛన్లను ఇచ్చి వారిలో భరోసా పెంచాం. వేట నిషేధ కాలంలో పరిహారం రెండు రెట్లు చేసాం, మహిళా మత్స్య గ్రూపులకు సహాయం 4 రెట్లు చేసాం. వేటకెళ్లి తిరిగిరాని మత్స్యకారుల కుటుంబాలకు పరిహారం 2 రెట్లు చేసాం. మత్స్యకారుల సంక్షేమానికి భారీగా బడ్జెట్ పెంచాం. ఇళ్ల పట్టాలిచ్చాము, డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించాము. మత్స్యకారులకు అండగా ఆదరణ పథకాన్ని తెచ్చాం. అందుకే ఎల్లప్పుడూ మత్స్యకారులే టీడీపీకి వెన్నెముకగా నిలిచారు. తమను ఎస్టీల్లో చేర్చాలన్న మత్స్యకారుల డిమాండ్ ను నెరవేర్చే కృషి చేసాం. మా కృషిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించి మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలి. మత్స్యకారుల గృహనిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలి. #WorldFisheriesDay _ట్విట్టర్ లో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

* సీఎం వైఎస్ జగన్ కు వలతో సత్కరించి జాలరి టోపీని, చేప ప్రతిమను బహూకరించిన మత్స్యకారులు తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం మండలం కొమనాపల్లిలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సభ ఏర్పాటు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం వైఎస్ జగన్, వేదికపై మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన సాంప్రదాయ మత్స్యకారులు వేదికపై మత్స్య కారుడు ధర్మాడి సత్యాన్ని సన్మానించిన సీఎం వైఎస్ జగన్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సీఎంకు శాలువా కప్పి సత్కరించిన మంత్రి మోపిదేవి వెంకటరమణ

* విజయవాడలో ఆంధ్రప్రదేశ్ నగరాలు సంఘం భవనాన్ని ప్రారంభించిన దేవాదాయశాఖ మంత్రి శుభాశీస్సులు అందించిన శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అంతటా నగరాలు కులాన్ని బిసీలుగా గుర్తించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నారని, త్వరలో దీనిపై జీవో విడుదల అవుతుందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడలోని నగరాల సీతారామస్వామి దేవస్థానం వద్ద ఆంధ్రప్రదేశ్ నగరాలు సంఘం కేంద్ర కార్యాలయ భవనం రెండో అంతస్తును మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి జ్యోతి వెలిగించి, శుభాశీస్సులు అందించారు.

* మాజీ మంత్రి, దేవినేని ఉమ-సిఎం జగన్మోహన్ రెడ్డి.. మీ మంత్రులు, ఎమ్మెల్యే లతో మత విశ్వాసాలను దెబ్బ తీసేలా మాట్లాడుతున్నారు మాల ధారణలో ఉండి.. మమ్మలను తిట్టించడానికి .. నీచమైన భాష వాడుతున్నారు ఇలా నోరేసుకుని పడితేనే మీ అపాయింట్మెంట్ లు దక్కు తున్నాయి సిమెంట్ కంపెనీలు తో కుమ్మక్కై ధరలు పెంచేసింది‌ వాస్తవం కాదా మద్యం బార్లు, కంపెనీలతో కూడా చీకటి ఒప్పందాలు‌ చేసుకున్నారు వీటిని ప్రశ్నిస్తే … నా పై ఎదురు దాడి‌ చేస్తున్నారు ఇసుక విషయంలో 68మంది పై ఫిర్యాదులు వస్తే.. వారి పై సిఎం ఎందుకు చర్యలు తీసుకోలేదు పోలవరం చూడని‌ వారు నేడు నన్ను తిడుతున్నారు పోలవరం విషయంలో మంత్రి పత్తా లేడు… సిఎం నోరు విప్పడు గిన్నీస్ రికార్డు ఎక్కిన కంపెనీలను పక్కన పెట్టేశాడు ముఖం‌నచ్చక పోయినా, అడిగిన మామూళ్లు ఇవ్వకపోయినా కాంట్రాక్టు రద్దు చేస్తున్నారు మీ తప్పు లను ప్రశ్నిస్తే అయ్యప్ప మాల‌ వేసుకున్న వారితో తిట్టిస్తున్నారు 151 ఎమ్మెల్యే లు ఉన్నా.. సిఎం అభద్రతా భావంతో బతుకుతున్నారు తిరుమల పై కొడాలి నాని వ్యాఖ్యలు చేస్తే జగన్ ఎందుకు స్పందించ లేదు అన్యమత ప్రచారం ఆపాల్సిన బాధ్యత టిటిడి ఛైర్మన్ గశ వై.వి. సుబ్బారెడ్డి కి బాధ్యత లేదా.. స్వర్ణ కాటేజీ లో కూడా రాజకీయాలు చేసింది మీరు స్వామి వారి అన్న ప్రసాదంతో … పార్టీ లు చేస్తారా తిరుమల వంటి పవిత్ర ప్రదేశాన్ని పంచాయతీ లకు అడ్డాగా మార్చారు మైలవరం నియోజకవర్గం లో నోట్లను చించి, స్లిప్పులు ఇచ్చింది వైసిపి నేతలే ఎన్నికల సమయంలో కరెన్సీ నోట్ల ను చించి పంచే అధికారం ఎవరిచ్చారు ఈ‌ విషయం సోషల్ మీడియాలో కూడా వచ్చింది స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు సిఎం, పోలీసులు స్పందించి బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలి అయ్యప్ప మాలలో ఉన్న ఎమ్మెల్యే వివరణ ఇవ్వాలి ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారించాలి ఇలాంటివి బయట పెడుతున్న నన్ను తిట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు ఇటువంటి మాఫియా సంస్కృతిని ప్రోత్సహించే వారిని తరిమి కొట్టాలి మీడియా ప్రసారం చేయకపోయినా…‌సోషల్ మీడియా స్పందించింది 2430 జి.ఒ వల్ల కొన్ని మీడియా సంస్థ లు జగన్ కు భయపడుతున్నాయి కరెన్సీ నోట్లను ముక్కలు చేసిన విషయం పై ఆర్.బి.ఐ కూడా స్పందించాలి క్షేత్ర స్థాయిలో విచారిస్తే అందరికీ వాస్తవాలు తెలుస్తాయి.